నాటి నుంచీ ఈ నాటికీ పల్లెటూళ్ళల్లో, పట్టణాల్లో పామును బుట్టలో పెట్టుకుని నాగస్వరం వాయిస్తూ ప్రతి ఇంటికీ తిరిగి, పాముల వాళ్ళు యాచిస్తూ వుండటం తెలిసిందే.

పాముల్ని పట్టటం, వాటిని ఆడించటం ప్రజలను యాచించటం, అలా జీవనం దడపడం పాముల వారి వృత్తి. ఇది ఒక తెగ, వీరు దేసంలో చాల చోట్ల కనిపిస్తారు. వీరు లిపి లేని భాషను కూడా మాట్లాడుతారు. ఎక్కడెక్కడో పుట్టల్లో వున్న త్రాచు పాముల్ని పసికట్టి, ఉపాయంగా పట్టి వాటి పళ్ళను పీకి విషాన్ని పిండి, మూతి కుట్టి దానికి గుడ్డూ పాలు పోసి, మచ్చిక చేసి బుట్టలో పెట్టి నాగస్వరాన్ని ఊదుతూ వివిధ స్తాయిల్లో దానితో విన్యాసం చేయిస్తూ నయనానంద కరంగా ఆడిస్తూ, పిల్లల్నీ, పెద్దల్నీ ఆశ్చర్య చికితుల్ని చేస్తూ తద్వారా జీవనోపాధిని సాగిస్తూ వుంటారు. పాముల వాడు బుట్టలో నున్న పాము విన్యాసం చేసి నట్లే తాను ఆ వాయిద్యానికి అనుగుణంగా మెలికలు తిరిగి పోతూ నృత్యం చేస్తూ అటు పామూ, ఇటు పాముల వాడు, ఇరువురి నృత్యంతో ప్రేక్షకులు ముద్థులై పోయి అక్కడికక్కడే ఎవరికి తోచింది వారు వారికి ముట్ట చెపుతూ వుంటారు.

ఇది ఒకప్పుడు పల్లెల్లో జానపద కళలతో పాటు ఈ పాములాట కూడ వినోద ప్రదర్శనంగా వుండేది.

రెండు త్రాచుల విన్యాసం

మార్చు

ఒక్కొక్కసారి రెండు కోడె త్రచుల్ని ఎదురెదురుగా వుంచి, తాను వాయిద్యంతో ఆ రెంటినీ రెచ్చ గొట్టి లబ్జుగా పాముల బూర ఊదుతూ తాను నేత్ర పర్వంగానృత్యం చేస్తాడు. పాము క్రిచినట్లూ, విషం తలకెక్కి నట్లూ తూలుతూ, త్రుళ్ళుతూ సొక్కి పోతూ, తనమంత్ర విద్యను ప్రవేశపెట్టి, క్రమేపీ కోలుకుని బ్రతికానన్నంత సంతోషంతో ఆనంద నృత్యం చేసి ప్రజలంజు తృప్తి పరిచె దండు కుంటారు.

నిజంగా పాలులవాని నృత్యం నేత్ర పర్వంగానే వుంటుంది. సహజంగా చాల మంది స్వయంగా త్రాచు పాముల్ని చూడలేరు. అటువంటి తెల్ల త్రాచుల్నీ, కోడె త్రాచుల్నీ, గోదుమ వన్నె త్రాచుల్నీ కష్పడి పట్టుకొచ్చి తమ జీవనోపాధి కోసం వృత్తిని సాగిస్తారు. వీరు ఒక వూరినుంచి మరో వూరికి సంచారం చేస్తూ పాముల్ని పడుతూ, పాము కాటుకు గురైన వాళ్ళకు మందులిస్తూ జీవిత యాత్ర సాగిస్తారు.

పోటీల మోడీలు

మార్చు

ఈ రోజుల్లో మోడీలంటే ఎవరికీ తెలియదు. కానీ ఏబై సంవత్సరాల క్రితం ఈ మోడీలు అధికంగా పల్లె ప్రాంతాల్లో జరిగేవి.

పలానా గ్రామంలో ఫలానా అరోజున మోడి అని తెలిస్తే సరి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండొప తండాలుగా వచ్చి పడేవారు. అది ఒక పెద్ద ఉత్సవంగానూ ఇరుపక్షాల మధ్యా జయాపజయాల పోరాటంగానూ సాగేది.

ఒక్కొక్క సారి గ్రామ జాతర్ల సమయం లోనూ, సంతల సమయాల్లోనూ కూడ ఈ ప్రదర్శనాలు జనారంజకంగా జరిగేవి.

ఈ మోడీలు అరవై సంవత్సరాల క్రితం పాముల నాడించే పాముల వారి ముఠాల మధ్యనే జరిగేవి. ఇవి చాల పౌరుష వంతంగా జరిగేవి. చావు బ్రతుకుల పోరాటంగా పోరాడే వారు. అయితె ఈ మోడీలను ఇతర కులస్థులైన పెద్దేటు గొల్లలు మొదలైన వారు చేసే వారని ప్రతీతి.

ఈ మోడీలకు సంబంధించిన వారు ఇంద్రజాలం, హస్త లాఘవ విద్యలలో మంత్ర తంత్రాలలో ఆరి తేరినవారై వుండేవారు. ఇవి పూరి మధ్యనో, లేక విశాల మైన మైదాన ప్రదేశంలోనో ప్రజల మధ్యన జరిగేవి.

మంత్ర ప్రయోగాలు

మార్చు

ఇరు పక్షాలవారూ, ఒకరి విద్యలను మరొకరిపై ప్రయోగిస్తూ, ఒకరిని మించి మరొకరు అస్త్రాలను ఎక్కు పెట్టినట్లు ఒకర్ని మించి మారొకరు మంత్ర ప్రయోగాలు చేస్తారు. ప్రజలు వీరు చేసే హస్త లాఘవ తాంత్రిక విద్యలకు అచ్చెరువొందేవారు.

ముఖ్యంగా వీరు నూరు గజాల దూరంలో , అటూ ఇటూ రెండు పక్షాలుగా చేరుతారు. ఇరువురూ చిన్న గుడారాలను నిర్మిస్తారు. ఆ గుడారంలో ఒక గొయ్యి తీస్తారు. ఆ గోతిలో పసుపు కుంకుమ కలిపిన రంగు నీళ్ళు వుంచుతారు. అందులో ఒక కొబ్బరికాయ వుంచుతారు. మోడీ ప్రారంభమైన వెంటనే పాముల బుర్ర వూదుతూ వచ్చి గుడారానికి ముందున్న గీతను దాటి, గుడారపు గుంటలో నున్న కొబ్బరి కాయను తీసుకు వెళ్ళాలి. ఇలా తీసుకు వెళ్ళటానికి ఆ ప్రక్క నుంచి ఈ ప్రక్కకు వచ్చే వ్వక్తిని గుడారానికి దగ్గర వరకూ రానీయ కుండా మంత్రాలను వల్లిస్తూ మంత్రించిన కందులను అతని మీద చల్లుతాడు. అవి కందిరీగల్లాగ కుట్టినట్లు బాధపడుతూ, అడుగు ముందుకు వేయలేడు. అప్పుడు అవతలి వ్వక్తి మరో మంత్రం చదివి, ఆ కట్టును విప్పుతాడు. ఇలా ఒకరి కొకరు మంత్ర ప్రయోగాలు చేసి ఎవరి మంత్ర శక్తి ఎక్కువైతే వారు చివరికి ఎదుటి వారి గుడారపు గుంటలో దిగి కొబ్బరి కాయ తీసి జన సమూహం మధ్యలో పగుల కొట్టి ఎదుటి వారిని జయించి నట్లు అట్టహాసం చేస్తాడు.

ఉత్తేజాన్ని కలిగించే వాయిద్యాలు

మార్చు

ఇలా మోడీ చేసే వ్వక్తికి వత్తాసుగా నగ స్వరాలు, డప్పుల వాయిద్యాలతో, అతనిని ఉత్తేజ పర్చి విజయానికి మార్గ దర్శకులౌతారు.

చూసేవారి కిది భయంకర పోరాటంలా కనిపిస్తుంది. రెండు మూఠాలకి చెందిన వయసు ముదిరిన పెద్దలు గంభీరమైన వేషంతో తలపాగలు ధరించి, నల్ల కోటు వేసుకుని, అంగ వస్త్రం పైన వేసుకుని గుడారం ముందు ఏదో శక్తి ఆవహించిన వ్వక్తుల్లా కూర్చుంటారు.

వీరు ప్రారంభంలో రూఫాయలను సృష్టించడం, తెల్ల కాగితాన్ని రూపాయి నోటుగా మార్చటం, వేపాకులు దూసి తేళ్ళను సృష్టించడం, పొడి ఇసుకను నీళ్ళలో కలిపి తిరిగి పొడి ఇసుకనే తీయటం, తడి బట్టమీద ముడి జొన్నలు జల్లి వాటిని పేలాలు వేగింట్లు చేయటం, పొడి మట్టిని నీళ్ళలో చల్లి దానిని రంగుగా మార్చడం, మండే నిప్పుని మ్రింగటం, నాలుకను కోసినట్లు చూపింటం, ఇలా ఎన్నో కనికట్టు విద్యల్ని ఒకరిని మించి మరొకరు భయంగారంగా చేశేవారు.

మోడీని వృత్తిగా స్వీకరించి బ్రతికేవారు వంశ పారంపర్యంగా ఆ కళను బహుళ ప్రచారం చేశారు. ముఖ్యంగా గ్రామ పెద్దలను, పెద్ద రెడ్లు, ముంసిఫ్ కరణాలు, జమీదారులు, ఊరు పెద్దల ఆమోద ముద్రతో ఈ ప్రదర్శనాలు రసవత్తరంగా జరిగేవి.

మహమ్మదీయుల మోళీ విద్య

మార్చు

మోళీ విద్యను ఒక్క పాముల జాతివారే ప్ర్దర్శిస్తారనుకున్నాం. కానీ ఈ విద్యను మహమ్మదీయుల్లో ఒక వర్గం వారు కూడా ఆదరించారు.

మోళీల్లో కేవలం సాహెబులు ప్రదర్శించే మోళీలు పాముల వారి మోళీకి భిన్నంగా వుంటుంది. ఇది మంత్రతంత్రాలతో కూడిన మాయదారి విద్యగా కనిపిస్తుంది.

మాయలు మ్యాజిక్కులు

మార్చు

వీరు పాముల ల్బుట్టల్లో ప్రథమంగా పాముల్ని చూపించి తరువాత బుట్టల్ని తెరిచి పాముల్లేని ఖాళీ బుట్టల్ని చూపిస్తారు. అలాగే ఆ ఖళీ పాముల బుట్టలో ఒక కాగితపు ముక్క వేసి బుట్ట మూసి ఛూ మహంకాళీ అంటూ బుట్టను తెరిస్తే అందులో నుంచి పడగ విప్పిన పాము ప్రత్యక్షమౌతుంది. అలాగే ఒక ఖాళీ డబ్బాను ఒక కుర్రవాడి కాళ్ళ మధ్యను పెట్టి, కుర్రవాడి పిర్రమీద ఒక దెబ్బ కొట్టి డబ్బాలోకి రూపాయలు కురుపిస్తాడు.

చేతుల్లో వున్న రూపాయల్ని మాయం చేయడం, ఒట్టి చేతుల నుండి రూపాయల్ని ప్రత్యక్షం చేయడం చేతి కున్న వుంగరాన్ని మాయం చేసి, ఆ వుంగరాన్ని ప్రేక్షకుల్లో ఒకరి చేతి నుండి లాక్కోవడం, ఇలా ఎన్నెన్నో వింతలు కన్ను మూసి కన్ను తెరిచే లొగా, అద్భుతాలను ప్రదర్శించి, ప్రేక్షకులను సంభ్ర మాశ్చర్యాలలో ముంచెత్తుతారు.

వీరు ఉరుదు భాషను ఉఛ్చరిస్తూనే తెలుగు మాట్లాడుతూ, మధ్య మధ్య హాస్య చలోక్తులను విసురుతూ, ప్రేక్షకులను మాయలో ముంచి, ఇదంతా వారి గురువు లీస్తాద్ మహిమంటూ, చివరగా గాలికీ, ధూళికీ, ప్రేతాలకూ, పిశాచలకూ మందుగా తాయిత్తులను అమ్ముతారు. వాటిని జనం విరగబడి కొంటారు వాటిలో ఏదో మాహాత్మ్యముందని. ఈమోళీ విద్యలు ఈ నాడు ఎక్కడా మచ్చుకు కూడ వున్నట్లు లేదు. కాని ఒక నాటిది అద్భుతమిన అతీంద్రియ శక్తులను ప్రదర్శించే కళగానూ, ప్రజలను ఆనందింప చేసే ఆసక్తికరమైన కళారూపంగానూ రూపొందింది.

మూలాలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=పాములాట&oldid=3717217" నుండి వెలికితీశారు