పాముల బుర్ర
పాముల బుర్ర, భారత ఉపఖండంలో పాములు ఆడించేవారు ఉపయోగించే సుషిర సంగీత వాయిద్యం. ఈ వాయిద్యం భారతదేశంలో ఉద్భవించింది. నేటికీ వీటిన అక్కడక్కడా వీధుల్లో వాయించడం చూడవచ్చు. దీనిని ఇతర భారతీయ భాషలలో పుంగీ లేదా బీన్ అని అంటారు.
నిర్మాణము
మార్చుచిన్నని సొరకాయ బుర్రలను ఒకదానిమీద మరొకటి అనుసందానించి, ఒక చివరన రెండు సన్నని గొట్టాలను (కాకెదురు గొట్టాలను అమర్చి) వాటికి రంద్రాలు చేసి రెండో వైపున వున్న సొరకాయ బుర్రకు ఒక రంధ్రం చేసి వుంటారు. ఈ రంధ్రం ద్వారా నోటితో వూదుతూ రెండో వైపున వున్న సన్నని గొట్టాలకున్న రంద్రాలను రెండు చేతి వేళ్ళతో మూస్తూ, తెరుస్తూ వుంటారు. పాముల బుర్రను మధ్యలోనే ఏ అంతరాయం లేకుండా వాయిస్తూ ఉంటారు. బుర్రను ఊదేవారు ముక్కుతో గాలిపీల్చుకుంటూ దాన్ని నోటి ద్వారా బుర్రలోకి వదులుతూ వృత్తాకార శ్వాసను అవలంబిస్తారు.
పాముల బుర్రకు ఉన్న రెండు గొట్టాల్లో ఒక దానికి ఏడు రంధ్రాలు ఉంటాయి. రెండవ గొట్టం శ్రుతిపెట్టె తరహాలో డ్రోన్ (ద్రోణి)ను సమకూరుస్తుంది. జీవల అనబడే ఈ రెండు గొట్టాలను బుర్రకు తేనె మైనంతో అతికిస్తారు.
ఉపయోగము
మార్చువీటిని ముఖ్యంగా పాములను ఆడించేవారు ఉపయోగిస్తారు. మరెందుకూ దీనిని వాడరు. అందుకే దీనిని పాముల బుర్ర అని పేరు.