పారాణి
పసుపుతో పాటు పాదాల అలంకారానికి వాడేది పారాణి. పసుపును సున్నం నీరుతో కలిపితే ఎర్రని పారాణి తయారవుతుంది. ఈ ద్రవం చిక్కగా ఉంటే దానిని పారాణి అనీ, పల్చగా ఉంటే దానిని వసంతం అని పిలుస్తారు. పూర్వం వసంతం అడటానికి పిచికారి గొట్టంలో ఈ ఎర్రని ద్రవాన్నే పోసే వారు. ఈ రంగులు సహజమైనవి కనుక ప్రమాదకారి కావు. [1]
పారాణిని పెళ్ళి సమయంలో పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు కాళ్ళకు చేతులకు పూసి అందంగా తీర్చిదిద్దుతారు. ఇది గోరింటాకు వలె ఉన్నప్పటికి వాడినప్పటికి దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీనిని పెళ్ళి సమయంలో వధువరుల అలంకరణలో ఒక సాంప్రదాయంగా వాడుతున్నారు. దిష్టి తియ్యటానికి, ముఖ్యంగా శుభ సందర్భాలలో పారాణి నీటిని ఉపయోగిస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసేప్పుడు పూజ చేసే వారూ, వారి చేత ముత్తైదువలుగా పూజింప బడే వారూ పాదాలకి పసుపు పారాణి విధిగా అలంకరించుకోవలసి ఉంటుంది. అప్పుడప్పుడు పారాణి పెట్టుకోటం కాలి గోళ్ళ ఆరోగ్యానికి మంచిది.
పసుపులో సున్నం కలపటం వల్ల ఇది పసుపు కన్నా తీవ్రమైన క్రిమి సంహారకం, ఘాటుగా ఉంటుంది. అందుకనే గోరు చుట్టు వస్తే పారాణి ముద్దని గోరింటాకు లాగా పెట్టి కట్టు కడతారు.[2]
మూలాలు
మార్చు- ↑ "కాళ్ళకి పారాణి ఎందుకంటే..." TeluguOne Devotional (in english). 2021-04-05. Retrieved 2021-04-05.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Rajashekhar (2018-09-10). "అందంతోపాటు ఆరోగ్యం: కాళ్ళకు పారాణి ఎందుకంటే?". telugu.oneindia.com. Retrieved 2021-04-05.