పార్వతిబాయి అథవాలే

భారతీయ సంఘ సంస్కర్త (1870 – 1955)

పార్వతిబాయి అథవాలే (पार्वतीबाई आठवले) (1870 – 1955) భారతదేశంలోని గొప్ప సామాజిక సంస్కర్తలలో ఒకరైన డా. ధొండొ కేశవ కర్వే మరదలు, [1] [2] సన్నిహితురాలు. మహిళల సామాజిక అభివృద్ధిలో ఆమె ప్రధాన పాత్ర పోషించారు, ప్రత్యేకించి హిందూ వితంతువులు కొరకు. [3]1870లో పార్వతిబాయి దేవ్రుఖ్ లో జన్మించారు. ఆమె మొదటి పేరు కృష్ణ జోషి. ఆమెకు పదకొండేళ్ల వయసులో మహాదేవ్ నారాయణ్ అథవాలేతో వివాహం జరిగింది. ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది, కానీ ఒకే ఒక కుమారుడు (నారాయణ్ మహాదేవ్ అథవాలే) మాత్రమే జీవించాడు.

ఇరవై ఏళ్ళ వయసులో ఆమె వితంతువు అయింది. [4] అప్పటి సంప్రదాయాల ప్రకారం, ఆమె తన జుట్టును క్షవరం చేసి, ఎటువంటి ఆభరణాలను ధరించడం మానేసింది, మహారాష్ట్ర బ్రాహ్మణ వితంతువు యొక్క సాంప్రదాయ దుస్తులను ధరించింది.

వితంతువుల గృహంలో పనిచేసిన కొన్నాల తరువాత, ఒక మార్పు రావాలంటే, దానిని వితంతువులు స్వయంగా ప్రారంభించాల్సి ఉంటుందని ఆమె గ్రహించింది. ఒక ఉదాహరణగా నిలబడటానికి, 1912లో వితంతువు పద్దతులను విడిచిపెట్టింది. ఆమె అవమానాలకు, విమర్శలకు లొంగిపోలేదు. 1918లో నిధుల సేకరణ, ఆంగ్లం నేర్చుకోవడం కోసం ఒంటరిగా అమెరికా వెళ్లింది. [5]

నా కథ (माझी कहाणी) ఆమె రాసిన ఆత్మకథ, ఇది నేటికీ సామాజిక ప్రభావాన్ని చూపుతుంది. 1930లో దీనిని జస్టిన్ ఇ. అబాట్ చే "మై స్టోరీ: ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ హిందూ విడోగా" (My Story: The Autobiography of a Hindu Widow) ఆంగ్లంలోకి అనువదించారు. [6]

మూలాలు

మార్చు
  1. "8. Epilogue: i am an indian. i have no language Parvatibai Athavale and the Limits to English", The Sexual Life of English, Duke University Press, pp. 175–190, 2020-12-31, doi:10.1515/9780822395294-009, ISBN 978-0-8223-9529-4, retrieved 2024-01-28
  2. Ganesh L. Chandavarkar (1958). "Anath—Balikashram". Maharshi Karve(1958) (in ఇంగ్లీష్). p. 83.
  3. Smith, Bonnie Gene (2008). The Oxford encyclopedia of women in world history (in ఇంగ్లీష్). Oxford (GB) New York: Oxford University Press. ISBN 978-0-19-514890-9.
  4. McCarthy, Kathleen (2001). "Women and Philanthropy in India". Women, Philanthropy, and Civil Society (in ఇంగ్లీష్). Bloomington: Indiana University Press. p. 276. ISBN 978-0-253-06901-6.
  5. Sunya, Samhita. "The sexual life of English: languages of caste and desire in Colonial India , by Shefali Chandra: Durham and London, Duke University Press, 2012, 288 pp., $24.95 (paperback), ISBN 978-0-8223-5227-73". South Asian History and Culture (in ఇంగ్లీష్). 4 (3): 417–419. doi:10.1080/19472498.2013.807135. ISSN 1947-2498.
  6. Bose, Aparna Lanjewar, ed. (2020-05-06). Writing Gender Weziting Self: Memory, Memoir and Autobiography (in ఇంగ్లీష్) (1 ed.). Routledge. p. 13. doi:10.4324/9781003081968. ISBN 978-1-003-08196-8.