పార్వేట ఉత్సవం

(పార్వేట నుండి దారిమార్పు చెందింది)

పార్వేట ఉత్సవం తిరుమలలో ఉత్సవ విగ్రమైన మలయప్ప స్వామిని సంప్రదాయ క్షత్రియ వేటగాని వేషంవేసి, శంకం, చక్రం, గద, బాణం, ఖడ్గం వంటి పంచాయుధాలతో పార్వేటి మండపానికి తీసుకు వెళ్లే ఉత్సవం. ఈ మండపం ముఖ్య ఆలయం నుండి సుమారు 2 కి.మి దూరం ఉంది. అక్కడ దగ్గరలో పొదల్లో బంగారంతో చేసిన జింక మున్నగు జంతువులను ఉంచుతారు. అర్చకుడు బంగారంతో చేసిన బల్లెం తీసువచ్చి వేటను కొనసాగిస్తారు.

తిరుపతి జిల్లా వల్లివేడు గ్రామంలో ఉత్సవం మార్చు

తిరుపతి జిల్లా పాకాల మండలం లో వల్లివేడు గ్రామలో పురాతన వరదరాజ స్వామి ఆలయం కలదు. ప్రతి ఏడు సంక్రాంతి సందర్భంగా చివరి రోజున అనగా కనుమ పండగ రోజున, వరదరాజ స్వామి వారిని పల్లికిలో ఆ చుట్టు పక్కల పల్లెల్లో వూరేగించి చివరగా కూనపల్లి వద్ద ఉన్న చిన్న గుడి వద్ద శమీ వృక్షం వద్ద పూజ చేస్తారు. అక్కడే అప్పుడు ఈ కార్యక్రమం కొరకు వుంచిన ఒక పొట్టేలుకు కూడ పూజ చేస్తారు. దాన్ని ఆ పక్కనే ఉన్న మల్లేశ్వర స్వామి కొండ వాలులో దూరంగా కట్టివుంచుతారు. కింద చేలల్లో దూరంగా అందరూ నిలబడి ఒక్కొక్కరుగా తుపాకులతో గురి పెట్టి పొట్టేలును కాల్చడానికి ప్రయత్నిస్తారు. అది అంత సులభం కాదు. పొట్టేలు చాల దూరంలో వుంటుంది. అంతే గాక, స్వామి వారి పల్లికి వెంబడి మంగళ వాయుద్యాలు వాయించిన ఆలయ ఆస్తాన మంగలివారు, జమ్మిచెట్టు కింద ఆ పొట్టేలుకు తుపాకి దెబ్బ తగలకూడదని పూజ చేస్తుంటారు. సూర్యాస్తమ సమయానికి దాన్ని ఎవరూ కాల్చక పోతే అది ఆ మంగలి వారికి చెందుతుంది. అందుకే వారు పూజ చేసేది. అలా చాల మంది ప్రయత్నిస్తారు. తుపాకి లేనివారు తూటాలు తెచ్చుకొని ఇంకొకరి తుపాకితో ప్రయత్నిస్తారు. ఎవరు దాన్ని కాల్చగలిగితే ఆ పొట్టేలు వారికే. ఎవరు కాల్చక పోతే అది మంగలి వారికే చెందుతుంది. గతంలో అనగా సుమారు 50 సంవత్సరాల క్రితం ఈ పార్వేట చాల బారి ఎత్తున జరిదేది. చుట్టు పక్కల చాల పల్లెల నుండి జనం విపరీతంగా వచ్చేవారు. తుపాకి, రైఫిల్ ఉన్న వారు, లేనివారు పిల్లలు, పెద్దలు అందరు వచ్చేవారు. ప్రతి ఏడాది తిరుమలలో జరిగే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పార్వేట ఉత్సవానికి ఇది ప్రతిరూపం. ఇటువంటి పార్వేట ఉత్సవాలు ఇంకా కొన్ని ప్రదేశాలలో జరుగుతుండవచ్చు.

సింహాచలం మార్చు

విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం శ్రీ నరసింహ క్షేత్రంలో కూడా ఇలాంటి పార్వేట ఉత్సవం సంక్రాంతి తర్వాత కనుమ రోజున జరుగుతుంది.

మూలాలు మార్చు