పావగడ
పావగడ, కర్ణాటక తుముకూరు జిల్లా పావగడ తాలూకా లోని1 పట్టణం.[2] చారిత్రికంగా ఇది మైసూరు రాజ్యంలో భాగంగా ఉండేది. రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి ఇది 158 కి.మీ. దూరంలో ఉంది.
పావగడ
పాముకొండ | |
---|---|
పట్టణం | |
Coordinates: 14°06′N 77°17′E / 14.10°N 77.28°E | |
దేశం | India |
రాష్ట్రం | మూస:Country data Karnataka |
జిల్లా | తుముకూరు జిల్లా |
Government | |
• Body | మునిసిపల్ కౌన్సిల్ |
Elevation | 846 మీ (2,776 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 28,486 |
భాషలు | |
• అధికార | కన్నడ |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 561 202 |
టెలిఫోన్ కోడ్ | 08136 |
Vehicle registration | KA-64 |
Website | http://www.pavagadatown.mrc.gov.in/ |
పావగడలో ఉన్న శనీశ్వరాలయం అత్యంత ప్రసిద్ధి నొందినది. ఈ ఆలయం వృత్తాకారంలో వుండి అన్ని ఆలయాల వలే కాకుండా చాల భిన్నంగా వుంటుంది. ఇక్కడి పూజా విధానం కూడా కొంత వైవిధ్యంగా వుంటుంది. శనీశ్వరుని పూజకు కావలసిన అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి.. ఎత్తైన గోపురాలు లేకున్నా శిల్ప కళా తోరణాలు లేకున్నా అత్యంత కళాత్మకంగా వున్నదీ ఆలయం. ఇక్కడ పూజలు చేసినవారికి శని దోషాలు తొలిగి పోతాయని భక్తుల నమ్మకం. ఆంధ్ర సరిహద్దులో వున్నందున ఈ ఆలయానికి తెలుగు నాట నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. పావ గడ ప్రక్కనే వున్న ఒక కొండ పై ఒక పెద్ద కోట ఉంది. ఈ కొండ పాదం వద్ద కోటె ఆంజనేయస్వామి ఆలయం ఉంది.
ఈ పట్టణంలో కన్నడతో పాటు, తెలుగు కూడా ఎక్కువగా మాట్లాడుతారు.
జనాభా
మార్చు2011నాటి జనగణన ప్రకారం పావగడ జనాభా 28,486.[3] అక్షరాస్యత 81.33%: పురుషుల అక్షరాస్యత 88.33%, = ఉండగా స్త్రీలలో 75.36% ఉంది. 6 ఏళ్ళ లోపు వయసు గలవారు మొత్తం జనాభాలో 10.65%.
పావగడ సోలార్ పార్క్
మార్చుపావగడ సమీపంలో 13000 ఎకరాల విస్తీర్ణంలో 2019వ సంవత్సరంలో 2050 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ పార్కును ప్రారంభించారు. ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఫోటోవోల్టాయిక్ సోలార్ పార్కు. దీని నిర్మాణానికి ₹14,800 కోట్లు వెచ్చించారు.[4]
మూలాలు
మార్చు- ↑ "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-05-28. Retrieved 2020-06-13.
- ↑ "Census of India 2011: Data from the 2011 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
- ↑ "GoK order dated 13-06-2016 allocating 200MW solar generation plant with 15 minutes battery storage by Solar Energy Corporation Of India Limited in Pavagada Solar park" (PDF). KSPDCL. Archived (PDF) from the original on 8 March 2017. Retrieved 7 March 2017.