పావులూరి కృష్ణ చౌదరి

డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి (1926 జూన్ 30 - 2023 జనవరి 12) (ఆంగ్లం: Dr Pavuluri Krishna Chowdary) సుప్రసిద్ధ హోమియోపతి వైద్య నిపుణుడు.

పావులూరి కృష్ణ చౌదరి
జననం (1926-06-30) 1926 జూన్ 30 (వయసు 98)
గోవాడ గ్రామం, అమృతలూరు మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం2023 జనవరి 12
హైదరాబాదు
విద్యగణితం, భౌతిక, రసాయన శాస్త్రాలతో డిగ్రీ,
ఎంబీబీఎస్,
మాస్టర్‌ ఆఫ్‌ హోమియో
విద్యాసంస్థఏసీ కళాశాల, గుంటూరు
ప్రభుత్వ వైద్యకళాశాల, విశాఖపట్నం,
మెంబర్‌ ఆఫ్‌ ఫ్యాకల్టీ ఇన్‌ హోమియోపతి (ఎమ్‌ఎఫ్‌.హోమ్‌), లండన్‌
జీవిత భాగస్వామిసుందర రాజేశ్వరి (మ.2010)
పిల్లలు3, మానవేంద్రనాథ్‌ (మ.1980) (కుమారుడు), డాక్టర్‌ నరేంద్రనాథ్‌ (పిల్లల వైద్య నిపుణులు) (కుమారుడు), కొడాలి సుమతి (కుమార్తె)

కెరీర్

మార్చు

నిజానికి ఎంబీబీఎస్‌ చదివిన పావులూరి కృష్ణ చౌదరి సహజసిద్ధమైన ఔషధాలు అందించే హోమియోనే మేలని నిర్ధారణకు వచ్చాడు. అదే సంకల్పంతో లండన్‌ వెళ్లి హోమియో వైద్యంలో పట్టభద్రుడయ్యాడు. స్వదేశానికి తిరిగివచ్చి అతను జీవితమంతా పూర్తిగా హోమియో వైద్య విధానాల విస్తృతికి, అభివృద్ధికి కృషిచేసాడు. ఖరీదైన, సంక్లిష్టమైన రసాయనాలతో కూడిన ఇంగ్లిషు మందుల కంటే మేలని నమ్మిన ఆయన తెలుగునాట హోమియో వైద్యంలో శిఖర సమానుడుగా ఎదిగాడు.

వైద్యుడిగానే కాక హైదరాబాద్‌లోని ప్రభుత్వ హోమియోపతి కళాశాల ప్రధానాచార్యుడిగా, కేంద్ర ప్రభుత్వ అధీనంలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హోమియోపతి, డ్రగ్స్‌ టెక్నికల్‌ అడ్వైజరీ కమిటీ, కోల్‌కతాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోమియోపతి బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌కు సభ్యుడిగా సేవలు అందించాడు. జీయర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (జిమ్స్‌) స్థాపనలో పావులూరి కృష్ణ చౌదరి ప్రముఖంగా వ్యవహరించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలోని హోమియో ఆసుపత్రి, వైద్య కళాశాలలు దేశ విదేశాల్లో ఖ్యాతి గడించాయి.

ఈనాడు దినపత్రికలో అతని వ్యాసాల ద్వారా సామాన్యులకుసైతం హోమియోపతి వైద్యంపై అవగాహన కల్పించాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు ప్రతి ఆదివారం ప్రచురితమైన ఈ వ్యాసాల ధారావాహికల సంకలనమైన ఇంటింటా హోమియో వైద్యం అనే గ్రంధం ప్రతీఇంటా కరదీపికగా మారింది.

వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న 96 సంవత్సరాల పావులూరి కృష్ణ చౌదరి 2023 జనవరి 12న హైదరాబాదులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచాడు.[1] ఆయన భార్య సుందర రాజేశ్వరి 2010లో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం కాగా పెద్ద కుమారుడు 18 ఏళ్ల వయసులో మృతి చెందాడు. రెండో కుమారుడు డాక్టర్ నరేంద్రనాథ్ అమెరికాలో వైద్యుడు. డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి ఏకైక కుమార్తె కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. వీరి కుమార్తె డాక్టర్ అపర్ణ కూడా హోమియో వైద్యంలో నిపుణురాలిగా పేరుగాంచింది.

మూలాలు

మార్చు
  1. "హోమియో శిఖరం పావులూరి కృష్ణచౌదరి ఇక లేరు". web.archive.org. 2023-01-13. Archived from the original on 2023-01-13. Retrieved 2023-01-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)