పాసేజ్ డు గోయిస్

ప్యాసేజ్ డు గోయిస్ అనేది ఫ్రాన్స్ దేశంలోని అట్లాంటిక్ తీరంలోని వెండీలోని బ్యూవోయిర్-సుర్-మెర

ప్యాసేజ్ డు గోయిస్ అనేది ఫ్రాన్స్ దేశంలోని అట్లాంటిక్ తీరంలోని వెండీలోని బ్యూవోయిర్-సుర్-మెర్, నోయిర్మోటియర్ ద్వీపం మధ్య ఉన్న కాజ్ వే. ఇది 4.125 కిలోమీటర్లు (2.6 మైళ్ళు) పొడవు ఉంది, అధిక అలల కారణంగా ఇక్కడ రోజుకు రెండుసార్లు వరద వస్తుంది. ఈ రహదారిని రోజుకు రెండు సార్లు అది కూడ కొన్ని గంటలు మాత్రమే వాడతారు. [1] ఆ తరువాత అధిక ఆటుపోట్ల వల్ల నీరు ఎక్కువగా రావడం వలన నీళ్లలో మునిగిపోతుంది. దీని మీద 13 ఫీట్ల వరకు నీళ్లు ఉంటాయి. ఇది ఫ్రాన్స్ జాతీయ స్మారక చిహ్నం, ప్రపంచవ్యాప్తంగా క్రమానుగతంగా వరదలు వచ్చే రోడ్లలో ఇది ఒకటి.

ది పాసేజ్ డు గోయిస్

వివరణ

మార్చు

క్వాటర్నరీలో బై డి బోర్గ్‌నెఫ్ ఏర్పడినప్పుడు, ఉత్తరం, దక్షిణం నుండి సముద్ర ప్రవాహాలు పెద్ద మొత్తంలో ఇసుకను తీసుకోని రావడం వలన ఇది ఏర్పడింది. 1702 లో, ఫ్రెంచ్ మార్షల్ చమిల్లీ నోయిర్‌మౌటియర్ ద్వీపంలోకి ప్రవేశించి కాలినడకన బయలుదేరవచ్చు అనే పుకార్లు నిజమో కాదో అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. తక్కువ ఆటుపోట్లలో కాలినడకన వెళ్ళవచ్చు అని నిర్దారించుకున్నాడు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో వెండీ యుద్ధంలో, విప్లవ సైన్యాన్ని వెంబడించిన వారు ద్వీపంలో కవాతు చేస్తున్నప్పుడు వరదల్లో చిక్కుకున్నారు. 18వ శతాబ్దంలో, ఇక్కడి వారు ఇసుక తీరాల మీదుగా కాలినడకన ద్వీపానికి వెళ్ళడానికి ఇసుక తిన్నెల మీద పునాదులు నిర్మించారు. 1924లో ఈ మార్గాన్ని కంకరతో తయారు చేసారు, ఈ మార్గంలో మూడు లైఫ్ రాఫ్ట్ ప్లాట్ఫారంలను నిర్మించారు. ఎప్పుడైనా ఈ రహదారిని దాటేటపుడు ప్రమాదవశాత్తు నీటి ప్రవాహం ఎక్కువ అయితే ఆ ప్లాట్ఫారం (రెస్క్యూ పోల్) మీదికి వెళ్ళవచ్చు.[2] ఆ తరువాత ఈ రహదారిని సిమెంట్ తో వేశారు. ఈ మార్గం ఎక్కువగా ఆగస్టులో రవాణాకు అనుకూలంగా ఉంటుంది. 2010 తర్వాత ఒక నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 200,000 నుండి 300,000 వాహనాలు ఈ మార్గాన్ని ఉపయోగిస్తున్నాయి.

ఫౌలీస్ డు గోయిస్

మార్చు

ఫౌలీస్ డు గోయిస్ అనేది పాసేజ్ డు గోయిస్‌ మీద ఏటా నిర్వహించబడే అంతర్జాతీయ రహదారి పరుగు పందెం.[3] ఇక్కడ మొదటి ఈవెంట్ జూన్ 20, 1987న నిర్వహించబడింది. ప్రతి సంవత్సరం ఈ పందెం జూన్ నెలలో ప్రారంభమవుతుంది.[4]ఇది ఫ్రాన్స్, అంతర్జాతీయ దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేయబడిన 30 మంది పోటీదారులకు పరిమితం చేయబడిన ప్రొఫెషనల్ పందెం, తక్కువ ఆటుపోట్లు ఉన్నప్పుడు ఈ పందెం ప్రారంభమవుతుంది. 1990 ఈవెంట్‌లో ఫ్రెంచ్ అథ్లెట్, ఒలింపియన్ డొమినిక్ చౌవెలియర్ ఈ పందాన్ని 12 నిమిషాల 8 సెకన్లలలో పూర్తిచేసాడు.

గ్యాలరీ

మార్చు


మూలాలు

మార్చు
  1. "Le Passage du Gois". Beauvoir sur Mer. Mairie de Beauvoir sur Mer. Archived from the original on 2015-07-06. Retrieved 2015-07-07.
  2. "THE PASSAGE DU GOIS". Au Passage du Gois. Retrieved 2023-06-21.
  3. "Les Foulées du Gois: the most unique running race in France". LeShuttle. Retrieved 2023-06-21.
  4. "Passage du Gois". Retrieved 20 September 2021.