పింక్ స్లిప్ ఒక అమెరికన్ పదము. సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికే సందర్భములో ఈ పదాన్ని ఉపయోగిస్తారు.

20వ శతాబ్ద ప్రారంభంలో విశ్వవిద్యాలయ సభ్యుని ఉద్యోగం నుండి ఉద్వాసన పలికే చిత్రం

ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకోదగిన కొన్ని పింక్ స్లిప్స్ మార్చు

2014 మార్చు

ఐ. బి. ఎమ్ మార్చు

టెక్నాలజీ దిగ్గజం ఐబిఎం ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బెంగళూరులోని ఐబిఎం సిస్టమ్స్ టెక్నాలజీ గ్రూప్ లో 50 మంది ఉద్యోగులకు ఇప్పటికే తొలగింపు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐబిఎంకు 4 లక్షల మంది ఉద్యోగులుండగా, భారత్‌లో లక్ష మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగాల తొలగింపు ఇక్కడే అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐబిఎం పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా భారత్, బ్రెజిల్, యూరప్ దేశాల నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ఐబిఎం ఉద్యోగుల యూనియన్ అధికారి లీ కోన్‌రాడ్ వెల్లడించారు. సర్వర్, స్టోరేజ్ సిస్టమ్స్ అమ్మకాలు గణనీయంగా క్షీణించడంతో కంపెనీ ఆర్థిక పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గత నెలలో ఐబిఎం ఉన్నత స్థాయి ఉద్యోగులకు ఇవ్వాల్సిన బోనస్‌లను కూడా రద్దు చేసింది. 2014 మొదటి త్రైమాసికంలో వంద కోట్ల డాలర్ల పునర్‌వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మారుతున్న క్లయింట్ల అవసరాలను సమర్థవంతంగా తీర్చేందుకే కాకుండా ఐటి రంగంలోని ఉన్నత విభాగాల్లో విస్తరించడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు ఐబిఎం ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. [1][2][3][4]

మూలాలు మార్చు

  1. http://www.businessinsider.in/The-Promised-IBM-Layoffs-Have-Begun-With-Over-1200-Cut-In-Europe-And-India-According-To-Reports/articleshow/30359613.cms
  2. http://www.forbes.com/sites/saritharai/2014/02/13/job-cuts-and-weeping-workers-at-ibm-india/
  3. http://indianexpress.com/article/business/business-others/layoff-reports-do-the-rounds-at-global-it-firms-india-units/
  4. http://beforeitsnews.com/science-and-technology/2014/02/massive-layoffs-reported-at-ibms-bangalore-headquarters-2673688.html