పితుకుపప్పు
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
పచ్చి అనప గింజలపై నున్న తొక్క తొలగించిన పప్పునే పితుకు పప్పు అని అంటారు.
తయారు చేయు విధానము
మార్చుముదిరిన అనప కాయలను తీసుకొని వాటిలోని గింజలను వేరు చేయాలి. ఇవి చిక్కుడు గింజల వలె వుంటాయి. ఆ పచ్చి అనప గింజలను ఒక రాత్రంతా నీళ్ళలో నాన బెట్టాలి. తెల్లవారి ఆ గింజలను ఒక్కొక్క దానిని చేతిలోకి తీసుకొని చూపుడు వేలు - బొటన వ్రేలు మద్యలో గింజ చివరన పట్టుకొని గట్టిగా వత్తితే.... గింజ పై నున్న తొక్క వేళ్ళమద్యలో మిగిలిపోయి.. తొక్క లేని గింజ బయట పడుతుంది. అలా అన్ని గింజలను తొక్క తీసి వేరు చేయాలి. ఆ తొక్క తీసే విధానాన్ని పితుకుట అని అంటారు. అందుకే దానికి పితుకు పప్పు అని పేరు.
ఉపయోగములు
మార్చుపితికిన ఆ గింజలను బగా ఎండ బెట్టి నిల్వ చేసుకుంటే చాల రోజుల వరకు నిల్వ వుంటాయి. కూర గాయలు లేని కాలంలో వాటితో కూర వండు కుంటారు. ఆకూర అత్యంత రుచికరంగాను మధురమైన సువాసన గాను వుంటుంది. రాయల సీమ జిల్లాలలో ఈ విధంగా పితుకు పప్పుకూరను తయారు చేసు కుంటారు. రాగి సంగటి పితుకు పప్పు కూర ... ఈ రెండింటి సంయోగము అత్యంత అద్భుతము. అనప గింజలను ఉడక బెట్టి గుగ్గిళ్ళను తయారు చేస్తారు. కాని గుగ్గిళ్ళను చాల అరుదుగా చేస్తారు. అనప గింజల ఉపయోగము ముఖ్యంగా పితుకు పప్పు చేయడానికే ఉపయోగిస్తారు.