పితృ దినోత్సవం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
అంతర్జాతీయ పితృ దినోత్సవము (ఆంగ్లం: Father's Day) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా ఈ నాన్నల వందన దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని పితృ వందన దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.
పితృ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | అనేక దేశాలు |
రకం | Commercial, sometimes associated with religious Saint Joseph's Day |
ప్రాముఖ్యత | Honors fathers and fatherhood |
జరుపుకొనే రోజు | Varies per country |
సంబంధిత పండుగ | Mother's Day, Parent's Day, Children's Day, Grandparent's Day |
ఆవృత్తి | ప్రతీ సంవత్సరం |