పియాజెట్ సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం
పియాజె సంజ్ఞాత్మక వికాస సిద్ధాంతం ద్వారా పిల్లల మానసిక అభివృద్ధిను నాలుగు వేర్వేరు దశల ద్వారా వివరించారు. అతని సిద్ధాంతం ద్వారా పిల్లలు జ్ఞానాన్ని ఎలా సంపాదిస్తారో అర్థం చేసుకోవచ్చు. పిల్లలు అభ్యసించే ప్రక్రియలో చురుకైన పాత్ర పోషిస్తారని పియజె విశ్వసించాడు. ప్రయోగాలు చేయటం, పరిశీలన చేయడం, ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడం వంటి వాటి ద్వారా పిల్లలు నిరంతరంగా కొత్త జ్ఞానాన్ని నేర్చుకుంటారనీ ఆయన ప్రతిపాదించారు.[1]
పియాజె పరిచయం
మార్చుపియాజె స్విట్జర్లాండ్ కు చెందిన శిశు మనో వైజ్ఞానిక శాస్త్రవేత్త. ఇతను జెనీవా యూనివర్సిటీ లో శిశు మనస్తత్వ ఆచార్యుడిగా పని చేశాడు. 22 సంవత్సరాలకే పీహెచ్ డీ పట్టా పొందాడు. ఈయన తన సొంత పిల్లల మీదనే ప్రయోగాలు చేసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.[2][3]
పియాజె రాసిన గ్రంథాలు
మార్చుది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్,
ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ఛైల్డ్,
ది మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది చైల్డ్,
ది ఆరిజిన్స్ ఆఫ్ ఇంటలిజెన్స్,
సిక్స్ సైకలాజికల్ స్టడీస్.
మొదలైన 25 గ్రంథాలను రాశారు.[4]
సిద్ధాంత ప్రతిపాదన
మార్చుపియాజె ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతాన్ని నాలుగు దశలుగా ప్రతిపాదించాడు.
ఇంద్రియ చాలక దశ (0-2 సంవత్సరాలు)
మార్చుఈ దశలోని శిశువులు వారి కదలికలు, అనుభూతుల ద్వారా ప్రపంచం తెలుసుకుంటారు. పీల్చడం, పట్టుకోవడం, చూడటం, వినడం వంటి ప్రాథమిక చర్యల ద్వారా ప్రపంచాన్ని గురించి తెలుసుకుంటారు. ఏదైనా వస్తువు కనిపించకపోతే ఎక్కడో ఒకచోట ఉండి ఉంటుందనే వస్తు స్థిరత్వ భావనను కలిగి ఉంటారు. ఒక పనిని మళ్ళీ మళ్ళీ చేస్తూ సంతృప్తి చెందే యత్న దోష పద్దతిలో అభ్యసిస్తూ ఉంటారు. ఈ దశలో పిల్లల అంతర్దృష్టి వికసిస్తుంది.
పూర్వ ప్రచాలక దశ (2 - 7 సంవత్సరాలు)
మార్చుఈ దశలో పిల్లలు ప్రతీకాత్మకంగా ఆలోచించడాన్ని ప్రారంభించి వస్తువులను సూచించడానికి పదాలు, చిత్రాలను ఉపయోగించడాన్ని నేర్చుకుంటారు. ఈ దశలో ఉన్న పిల్లలు నేను, నాది అనే అహం కేంద్రీకృత వాదాన్ని కలిగి ఉంటారు. ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించే సర్వాత్మక వాదాన్ని కలిగి ఉంటారు. ఒక వస్తువును వేరొక వస్తువుగా భావించే ప్రతిభాసాత్మక ఆలోచనలను కలిగి ఉంటారు. ఈ దశలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది కానీ దానిని వివరించే సామర్థ్యం ఉండదు. వస్తువును బాహ్యంగా మార్పులు చేసినప్పటికీ దానికి సంబందించిన లక్షణాలు అలాగే ఉంటాయి అనే పదిలపర్చుకునే భావనా లోపాన్ని కలిగి ఉంటారు. ప్రతీ ఒక్క తార్కిక ప్రచాలకాన్ని తిరిగి చేయలేము అనే అవిపర్యాత్మక భావనా లోపాన్ని కలిగి ఉంటారు. ఒక విషయాన్ని ఒకే కోణం లో ఆలోచించి దానికి భిన్నంగా ఆలోచించలేకపోవడం అనే ఏకమితి ఆలోచనను కలిగి ఉంటారు.
మూర్త ప్రచాలక దశ (7 - 11 సంవత్సరాలు)
మార్చుఈ దశలోని పిల్లలు సంఘటనల గురించి తార్కికంగా ఆలోచిస్తూ ఉంటారు. ఆగమనాత్మక, నిగమనాత్మక ఆలోచనలు పెరుగుతాయి. కానీ కంటికి కనిపించే మూర్త విషయాలను గురించి మాత్రమే వివరించగలరు.
అమూర్త ప్రచాలక దశ (12 సంవత్సరాల పైన)
మార్చుఈ దశలోని వారు ఊహాజనిత వస్తువులు, ఊహాజనిత సమస్యల గురించి ఆలోచించడం ప్రారంభం చేస్తారు.[5]
ముగింపు
మార్చుశిశువులోని ఆవిష్కరణ అభ్యసనం గురించి, పిల్లలకు ఉన్న వైయుక్తిక భేదాల గురించి, పిల్లల యొక్క స్వీయ చొరవ, క్రియా శీలక పాత్రను గురించి ఈ సిద్ధాంతం వివరిస్తుంది.
మూలాలు
మార్చు- ↑ "Cognitive Development - Encyclopedia of Special Education: A Reference for the Education of Children, Adolescents, and Adults with Disabilities and Other Exceptional Individuals - Credo Reference". search.credoreference.com.
- ↑ Franzoi, Stephen. Essentials of Psychology. p. 119. ISBN 978-1-5178014-2-7.
- ↑ Piaget, Jean (1952), Boring, Edwin G.; Werner, Heinz; Langfeld, Herbert S.; Yerkes, Robert M. (eds.), "Jean Piaget.", A History of Psychology in Autobiography, Vol IV. (in ఇంగ్లీష్), Worcester: Clark University Press, pp. 237–256, doi:10.1037/11154-011, retrieved 2021-02-28
- ↑ Maréchal, Garance (30 November 2009). "Constructivism". Encyclopedia of Case Study Research. 1.
- ↑ బాల్యదశ వికాసం అభ్యసనం (డి ఎల్ ఎడ్). తెలుగు అకాడమీ.