పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి
పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి(1904-1988) బహుగ్రంథకర్త, విద్వాంసుడు, శతావధాని.
పిశుపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి | |
---|---|
జననం | పిశుపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి 1904 తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి పట్టణం |
మరణం | 1988 |
వృత్తి | సంస్కృత పండితుడు |
ప్రసిద్ధి | పండితుడు, బహుగ్రంథకర్త |
తండ్రి | సీతారాములు |
తల్లి | కనకాంబ |
విశేషాలు
మార్చుఇతడు 1904వ సంవత్సరంలో కనకాంబ, సీతారాములు దంపతులకు జన్మించాడు. ఇతని అన్న పిశుపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి వద్ద వ్యాకరణం చదువుకున్నాడు. రాజమహేంద్రవరం గౌతమీ సంస్కృత కళాశాలలో సంస్కృత పండితుడిగా పనిచేశాడు. కొంతకాలం సూర్యరాయాంధ్ర నిఘంటు నిర్మాణంలో పాల్గొన్నాడు. ఇతడు నంద్యాల, నసికల్లు, గుగ్గిళ్ళ మొదలైన ప్రాంతాలలో అష్టావధానాలు నిర్వహించాడు. 1929 ఏప్రిల్ 14న వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో ఇతనికి పౌరసన్మానం జరిగింది.[1]
రచనలు
మార్చు- శ్రీమదాంధ్ర శంకరవిజయము
- చైతన్య క్రియా యోగము
- విద్యారణ్యచరిత్ర
- పంచకావ్యకథానిధి
- మేదిని
- శ్రీ శాంకరామ్నాయ మఠచరిత్ర
- శ్రీ కంచి కామకోటి మఠచరిత్ర
- శ్రీ సీతాకల్యాణం
- శ్రీ విశ్వామిత్ర చరిత్ర
- భావనారాయణ శతకము
- విరహార్తుడు
మూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (1 June 2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 949.