పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు, సంరక్షకులను కోల్పోయిన చిన్నారులకు ' పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ' పథకం కింద సాయం అందజేసే కార్యక్రమాన్ని 2022 మే 30వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు[1]. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రూ. 10 లక్షల ఆర్థిక సాయన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద 3,945 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేశారు[2]. 2022-23 సంవత్సరానికి మొత్తం రూ. 7.89 కోట్లను ప్రధానమంత్రి మోడీ ప్రత్యక్షంగా నగదు బదిలీ చేశారు[3]. లబ్ధిదారులకు ఐదు లక్షల వరకు అవసరమయ్యే వైద్య ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది[4]. 2020 మార్చి 11వ తేదీ నుండి 2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ మధ్యలో తల్లిదండ్రులు, చట్టబద్ధమైన సంరక్షకులు, దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లినో, తండ్రినో కోల్పోయిన పిల్లలకు ఉపకార వేతనాలు పీఎం కేర్స్ పాసు పుస్తకాలు, ఆయుష్మాన్ భారత్ వైద్య బీమా కార్డును అందజేస్తుంది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకంలో భాగంగా .... పిల్లలకు 18 సంవత్సరాలు నిండే సరికి వారి పేరిట రూ. పది లక్షల రూపాయలు సొమ్ము ఉండేలా డిపాజిట్ చేస్తారు. 18 నుండి 23 సంవత్సరాల వయసు వరకు ఆ డిపాజిట్ పై వడ్డీని వారికి ఆర్థిక సాయంగా అందిస్తారు. 23 సంవత్సరాలు నిండిన తరువాత పూర్తిగా రూ. 10 లక్షలు లబ్ధిదారులకు అందజేస్తారు.

మూలాలు :

  1. Sumeda (2022-06-07). "Nearly 4,400 COVID orphans benefitted from PM CARES scheme for children in a year". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2023-12-28.
  2. "పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రెన్ : కరోనా సమయంలో అనాథలైన పిల్లలకు రూ.10 లక్షలు, ఉచితంగా విద్య". Samayam Telugu. Retrieved 2023-12-28.
  3. Telugu, TV9 (2022-07-29). "PM CARES for Children: కరోనా సంక్షోభంలో అనాథలైన పిల్లల కోసం ప్రభుత్వం ముందడుగు.. PM చిల్డ్రన్ స్క్రీమ్ ప్రయోజనాలు తెలుసా ?". TV9 Telugu. Retrieved 2023-12-28.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  4. "PM CARES For children: అనాథ పిల్లలకు రూ.10 లక్షల సాయం.. పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ". News18 తెలుగు. 2022-05-30. Retrieved 2023-12-28.