పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక

(పీఎస్‌ఎల్‌వీ-సీ33 ఉపగ్రహ వాహకనౌక నుండి దారిమార్పు చెందింది)

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ను భారతీయ అంతరిక్ష ప్రయోగ సంస్థ, క్లుప్తంగా ఇస్రో అని పిలువబడుతున్న భారతదేశపు ప్రతిష్ఠాత్మకపు సంస్థ రూపొందించిన ఉపగ్రహ వాహక/ప్రయోగ నౌక.ఈ వాహకనౌక ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని క్షక్యలోకి పంపుటకు నిర్ణయించడమైనది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల వరుసలో ఆఖరు ఏడవ ఉపగ్రహం. ఇప్పటికి వరకు ఈ సిరీస్‌లో వరుసగా ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలో నిర్దేశిత పరిబ్రమణ క్షక్ష్యలో ప్రవేశపెట్టారు.ఈఈ ఆరు ఉపగ్రహాలను ఆంధ్రప్రదేశ్ రాష్తంలోని, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న సతిష్ ధవన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంనుండి ప్రయోగించారు. పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌకను భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (క్లుప్తంగాఇస్రో) రూపోంధించింది. ఇది ఇస్రో తయారుచేసిన పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన 35వ ఉపగ్రహ వాహకనౌక.[1] పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక, పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌక. పిఎస్‌ఎల్‌వి-సీ32ఉపగ్రహ వాహకనౌక, ఇస్రో ప్రయోగించిన XL రకానికి చెందిన వాహకనౌకలలో 13వ వాహకనౌక.

PSLV-C33/IRNSS-1G

పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా పలు ఉపగ్రహాలను అంతరిక్షంలో, కక్షలో ఇస్రో ప్రవేశపెట్టినది. ఐఎన్‌ఎస్‌ఎస్ శ్రేణికి చెందిన 1A,1B,1C, 1D మరియు1E,1ఎఫ్ ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు. అంతేకాదు చంద్రయాన్-1, జీశాట్-12, రీశాట్-1, మార్స్ ఆర్బిటర్ స్పేస్‌క్రాప్ట్‌లను, డిఎమ్‌సి-3 ఉపగ్రహాలను కూడా పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XL రకానికి చెందిన ఉపగ్రహ వాహకనౌకల ద్వారానే ప్రవేశపెట్టారు.

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం పరిధిలో భాగమైన 7 వ ఉపగ్రహమైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని అంతరిక్షములో నిర్దేశిత కక్ష్యలోకి పంపుటకు నిర్ణయించారు. ఇండియన్ రిజినల్ నావిగేసన్ శాటిలైట్ సిస్టం పరిధిలో మొత్తం 7 ఉపగ్రహాలను ప్రయోగించవలసి ఉండగా ఇప్పటి వరకు ఆరు IRNSS (1Aనుండి1F వరకు) ఉపగ్రహాలను అనుకున్న విధంగా నిర్దేశిత అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం జరిగింది. ఆవరుసలో పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ద్వారా కక్ష్యలో ప్రవేశ పెట్టబడుచున్న ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహం ఏడవది. XL రకానికి చెందిన వాహకనౌకల ద్వారా 1400-1700 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టవచ్చును. సూర్యానువర్తిత ధ్రువీయకక్ష్యలో 1700 కిలోల బరువుఉన్న ఉపగ్రహాలను,600 కి.మీ ఎత్తులో ప్రవేశపెట్టవచ్చును. భూబదిలీ కక్ష్యలో అయినచో 1425 కిలోల బరువు ఉన్న ఉపగ్రహాన్ని284 X 20650 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టు సామర్ద్యం XL రకానికి చెందిన రాకెట్ కలిగి ఉంది. నౌకాయాన, జలయాన, వాయు పర్యవేక్షణకై ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల వరుసలో ఇస్రో తయారుచేసిన చివరి ఐఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహన్ని ఈ పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ద్వారా అంతరిక్షంలో భూఅనువర్తిత (Geosynchronous) కక్ష్యలో ప్రవేశపెట్టుటకై ఇస్రో సంస్థ నిర్ణయించింది.

ఉపగ్రహ వాహకనౌక వివరాలు

మార్చు

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ఎత్తు లేదా పొడవు 44.4 మీటర్లు.ఇందులో నాలుగు దశలు ఉన్నాయి. మొదటిదశకు ఆరు స్ట్రాపాన్ బూస్టరు మోటారులను అనుసంధానించారు. ఉపగ్రహంతో సహ పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక బరువు 320 టన్నులు. స్ట్రాపాన్ బూస్టరు మోటారులలో మొత్తం 73.2 టన్నుల ఘనఇంధనాన్ని నింపారు. కోర్‌ఆన్ దశలో మరో 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపారు. రెండవదశలో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు. మూడవదశలో మొడటి దశలో ఉపయోగించిన విధంగా మళ్లీ 7.6 టన్నుల ఘన ఇంధనాన్ని నింపారు. చివరి నాల్గవ అంచెలో/స్టేజిలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపారు.[2]

ప్రయోగ ముందస్తు చర్యలు

మార్చు

శ్రీహారికోటలోని అంతరిక్షప్రయోగకేంద్రంలోని బ్రహ్మప్రకాష్ హాల్‌లో ఎంఆర్‌ఆర్ కమిటీ చైర్మెన్ బీఎస్ సురేష్ సారథ్యంలో రెండు మిషన్ సంసిద్ధతా సమావేశాలను నిర్వహించడం జరిగిందిఈ సమావేశంలో ఉపగ్రహప్రయోగ నౌక ప్రయోగానికై నిర్ణయం తీసుకోవడం జరిగినది24-04-2016సోమవారం 12:50 కి లాంచ్ రిహార్సల్స్ ను అనుకున్న విధంగా విజయవంతంగా ముగించి, ప్రయోగ పనులను లాంచ్ అథరైజేసన్ బోర్దుకు అప్పగించారు.మంగళవారం 2016 ఏప్రిల్ 26 న ఉదయం 9:20 గంటలకు 53 గంటల కౌంట్ డౌన్ మొదలైనది.[3] 51 గంటల 30 నిమిషాల పాటు ఏటువంటి ఆటంకం లేకుండ కౌంట్‌డౌన్ జరిగి గురువారం మధ్యాహన్నం 12.50 కి ముగిసింది.

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వేదిక

మార్చు

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌకను ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరుజిల్లాలో ఉన్న శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగకేంద్రం లోని మొదటి ప్రయోగవేదిక నుండి గురువారం 28 వతేది ఏప్రిల్ నెల 2016 న మధ్యాహన్నం 12:50 ప్రయోగించారు.[4]

పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగ వివరాలు

మార్చు

కౌంట్‌డౌన్ ముగిసిన తక్షణం 12:50గంటలకు వాహకనౌక నిప్పులు కక్కుతూ గగనమండలం వైపు దూసుకెల్లింది.44.4 మీటర్ల పొడవు,320టన్నుల బరువు ఉన్న ఉపగ్రహ వాహకనౌక తనప్రయాణంలో ఏతువంటి వడిదుడుకులు లేకుండా తనలక్ష్యం వైపు దూసుకెళ్ళి, నాలుగుదశల దహనక్రియ విజయవంతంగా అనుకున్నట్లుగా జరిగి, రాకెట్ నిర్దేశించిన మార్గంలో, వేగంతో పయనం సాగించి, 20నిమిషాల 19 సెకన్లకు 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని అనుకున్న భూస్థిర బదిలీ కక్ష్యలో దిగ్విజయంగా ప్రవేశపెట్టినది.మొదటిదశ దహన క్రియ 110 సెకన్లలో, రెండవదశ 262 సెకన్లలలో, మూడవదశ 663 సెకన్లలలో చివరి నాల్గవదశ దహన క్రియ1,182 సెకన్లలలో పూర్తయింది. వాహకనౌక ఉపగ్రహాన్ని 286 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరి దూరం),20,657 కిలోమీటర్ల అపోజీ (భూమి నుండి దూరంగా) దూరంలో దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీ కక్ష్యలో, 17.82 డిగ్రీల వాలులో ఉపగ్రహం తన ప్రదక్షణ సాగిస్తున్నది[2].

ఉపగ్రహంలో ఉన్న 827 కిలోల ద్రవ ఇంధానాన్ని అపోజీ మోటర్లద్వారా దశలవారిగా మండించి, ఉపగ్రహాన్ని భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టెదరు.ఇందుకు కనీసం ఏడురోజుల సమయం అవసరం.

ఇవికూడా చూడండి

మార్చు

బయటి విడియో లింకులు

మార్చు

మూలాలు/ఆధారాలు

మార్చు
  1. "PSLV-C33/IRNSS-1G". isro.gov.in. Archived from the original on 2016-04-28. Retrieved 2016-04-26.
  2. 2.0 2.1 "రెండు నెలల్లో మన జీపీయస్". sakshi.com. 2016-04-29. Archived from the original on 2016-04-29. Retrieved 2016-04-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "The 51 hr 30 min countdown activity". isro.gov.in. Archived from the original on 2016-04-27. Retrieved 2016-04-26.
  4. "PSLV-C33 Successfully Launches India's Seventh Navigation Satellite IRNSS-1G". isro.gov.in. Archived from the original on 2016-04-29. Retrieved 2016-04-29.