పుచ్చా శేషయ్య శాస్త్రి

పుచ్చా శేషయ్య శాస్త్రిగారు ప్రముఖ కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు, అధ్యాపకుడు. వీరి తల్లితండ్రులు ప్రముఖ సంగీతజ్ఞులు, లక్షణకారులు, హైదరాబాద్ ప్రభుత్వ సంగీత కళాశాల వ్యవస్థాపకులైన కీ. శే. పుచ్చా సుబ్రహ్మణ్య శాస్త్రి, శ్రీమతి సూర్యకాంతం గారలు. శేషయ్య శాస్త్రి కీ. శే. పులవర్తి రామ దీక్షితులు, శ్రీ సుసర్ల శివరాం, శ్రీ నేదునూరి క్రిష్ణమూర్తి గారల దగ్గర సంగీతం నేర్చుకున్నారు. మొదట సికిందరాబాద్ లోని భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అధ్యాపకుని గాను, తరువాత ప్రధానంగా విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో సుమారు 18 సంవత్సరాల పాటు ఉపన్యాసకుని గానూ గాత్ర సంగీత బోధనలో తమ విలువైన సేవల్ని అందించారు. ఆయన శిష్యులు పలువురు దేశ, విదేశాలలో ప్రదర్శనలు ఇస్తూ, విద్యా దానం చేస్తూ సంగీత వృత్తిలోను, అధ్యాపకులు గానూ, ఆకాశవాణి, దూరదర్శన్‌ లలో ఎ-గ్రేడ్ కళాకారులు గానూ స్థిరపడ్డారు. శేషయ్య శాస్త్రి స్వయంగా దేశ విదేశాలలో కచేరీలు చేసేరు, రాష్ట్ర ప్రభుత్వ హంస కళారత్న పురస్కారం, ఉగాది పురస్కారం, సంగీత కళా తపస్వి, గాన కళానిధి వంటి సన్మానాలను అందుకున్నారు. ఆయన హైదరాబాద్ శ్రీ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసి, ప్రస్తుతం కొందరు విద్యార్ధులకు గాత్ర సంగీత కళలోని మెళుకువల్ని బోధిస్తున్నారు.

మూలాలు

మార్చు

http://eemaata.com/em/issues/201607/8889.html