పుట్టగొడుగుల పెంపకం


పుట్టగొడుగుల పెంపకం

White mushrooms ready for cooking. While common, they are just one of the many types of mushrooms cultivated and eaten.

చేపగుల్ల పుట్టగొడుగు ఉత్పత్తి మార్చు

సీజను, రకాలు

ఏడాది పొడవునా వస్తాయి

ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం.

తెల్ల చేపగుల్ల(Co-1), బూడిద రంగు చేపగుల్ల(M-2) రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.

పుట్టగొడుగుల గృహాలు మార్చు

16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్ అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.

విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 30 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.

పెంపకానికి వాడే గదిలో 23 నుంచి 25 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో 80 - 90% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే డిజిటల్ థర్మామీటర్లు, హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.

స్పాన్(పుట్టగొడగులను విత్తడం) మార్చు

సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న, గోధుమ ధాన్యాలు

స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.

వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి. ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి.

పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం మార్చు

సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి, పైపొట్టుతీసిన మొక్కజొన్న

ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి. తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).

సంచులు తయారుచేయడం మార్చు

60X30 సెం.మీ. పాలిథిన్ సంచులు(రెండువేపులా తెరచి ఉండేవి) వాడాలి.

సంచులకు ఒకవేపు మూతికట్టి, మధ్యలో ఒక సెం.మీ. వ్యాసంతో రెండు రంధ్రాలు చేయాలి.

వండిన ఆ గడ్డిని చేతినుండ్గా తీసుకొని 5 సెం.మీ.ఎత్తు వరకు ఆసంచిలో వేసి నింపాలి. దానిపై 25 గ్రా.ల స్పాన్ను చల్లాలి.

గడ్డిని 25 సెం.మీ. ఎత్తుకు ఉంచాలి. ఇలా 4 పొరల స్పాన్, 4 పొరల గడ్డి వచ్చేదాకా చేయాలి.

ఇపుడు మూతి కట్టేసి పాదులను దొంతరలుగా పేర్చి స్పానింగ్ రూంలో ఉంచాలి.

15-20 రోజుల తర్వాత పాలిథిన్ సంచులను కత్తిరించి తీసి వేయాలి, తరువాత ఆ పాదులను పెంపకానికై కేటాయించిన గదిలో ఉంచాలి.

ఇక వాటిని తరచూ నీటితో స్ప్రే చేస్తూండాలి.

పుట్టగొడగుల పంటకోత మార్చు

పుట్టగొడుగుల తలలు పాదులను తెరచిన మూడో రోజుకు పొడచూపుతాయి. ఆ తర్వాత 3 రోజులకు పరిణతి చెందుతాయి.

అలా పరిణతి చెందిన పుట్టగొడుగులను రోజూ కానీ, రోజు మార్చి రోజు కానీ కోసుకోవాలి.

మొదటి పంటకోత అయ్యాక ఆ పాదుల పైభాగాలను చదునుచేసి తిరిగి మరో పంటకు సిద్ధం చేసుకోవచ్చు. ఇలా రెండు, మూడు పంటలు పొందవచ్చు.

మరింత సమాచారం కావాలంటే, వ్యవసాయశాఖను కానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అనుబంధ శాఖలను కానీ సంప్రదించండి.


ఇవి కూడా చూడండి మార్చు

పుట్ట గొడుగు

బయటి లింకులు మార్చు

  • పాల పుట్టగోడుల పేంపకం, శిక్షణ కోరకు N MUSHROOM AGRI TECH ని సంప్రదించండి.
  • సంప్రదించవలసిన నెంబర్లు: 9912627630, 8897332286
  • ఇమెయిల్ : nmushroomagritech@gmail.com

hu:Gombák#Ehető gombák