పుపుల్ భుయాన్

ఒడిషా రాష్ట్రానికి చెందిన సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మోడల్

పుపుల్ భుయాన్, ఒడిషా రాష్ట్రానికి చెందిన సినిమా నటి, టెలివిజన్ వ్యాఖ్యాత, మోడల్. ఒడియా సినిమాలు, టెలిఫిల్మ్‌లు, సీరియళ్ళు, రియాల్టీ షోలలో నటించింది. 2013లో కావ్య కీరన్‌తో కలిసి 1వ ఒడియా 3డి చిత్రం కౌన్రీ కన్య ద్వారా ఆలీవుడ్‌లో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[2] 2018లో ఒపెరా శ్రీమతి విజేతగా కిరీటాన్ని పొందింది.[3]

పుపుల్ భుయాన్
జననం (1992-02-23) 1992 ఫిబ్రవరి 23 (వయసు 32)
ఇతర పేర్లుపాయల్ భుయాన్[1]
విద్యాసంస్థబక్సీ జగబంధు బిద్యధర్ కళాశాల
వృత్తినటి, టీవి వ్యాఖ్యాత
క్రియాశీల సంవత్సరాలు2012 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిదీప్ థదాని
తల్లిదండ్రులుబాటాకృష్ణ భుయాన్
బైజయంతిమాల భుయాన్

పుపుల్ 1992 ఫిబ్రవరి 3న బాటాకృష్ణ భుయాన్ - బైజయంతిమాల భుయాన్ దంపతులకు ఒడిశా రాష్ట్రం, కియోంఝర్ జిల్లాలోని సైంకుల్ గ్రామంలో జన్మించింది. భువనేశ్వర్‌లోని బక్సీ జగబంధు బిద్యధర్ కళాశాల నుండి పట్టభద్రురాలయింది.[4]

వ్యక్తిగత జీవితం

మార్చు

2016లో దీప్ థదానితో పుపుల్ వివాహం జరిగింది.[3]

నటనారంగం

మార్చు

పుపుల్ నాటకరంగం ద్వారా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆపై ఈ-న్యూస్, అపనంక పసంద్ వంటి కొన్ని సోలో టెలివిజన్ షోలను హోస్ట్ చేసింది. తరువాత ఆమె సరిగమప లిటిల్ చాంప్స్, స్వర ఒడిషారా, మున్ బై హీరోయిన్ హెబీ మొదలైన రియాలిటీ షోలను కూడా హోస్ట్ చేసింది.

2013లో సోమ్య రంజన్ సాహు దర్శకత్వం వహించిన మొదటి ఒడియా 3D సినిమా కౌన్రీ కన్య ద్వారా ఒడియా సినిమారంగంలోకి ప్రవేశించింది. తరువాత బ్లాక్ మెయిల్, బిద్యారానా,[5] మొదలైన ఒడియా సినిమాలలో నటించింది.

నటన, యాంకరింగ్‌తోపాటు మోడలింగ్‌లోనూ తరుచుగా పాల్గొంటున్నది. 2018 లో ఒపెరా శ్రీమతిలో పాల్గొంది. ఇండియా గ్లోబల్‌ పోటీలో విజయం సాధించింది.[6][7] కిరీటంతోపాటు సెమీఫైనల్‌లో ఉత్తమ ర్యాంప్ వాక్ అవార్డును గెలుచుకుంది.[8] 2022లోఓడియా పత్రిక శుభపల్లబ కవర్ ఫోటోపై కనిపించింది.[9] అంతకు ముందు 2016లో కాదంబిని పత్రికలో కూడా కనిపించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా భాష పాత్ర ఇతర వివరాలు
2013 కౌన్రి కన్య ఒడియా అనుశాయ ఆలీవుడ్‌లో రంగప్రవేశం చేసింది
2015 భాలా పే టేట్ 100 రూ 100 ఒడియా
2018 బ్లాక్ మెయిల్ ఒడియా
2022 బిద్యారానా ఒడియా [10]
చిత్రీకరణ అనుభవ్- ఏ లవర్ బాయ్ బార్షా
నియతి సాధన
తు మో కమ్జోరి
డెలివరీ బాయ్
అజాతి

టెలివిజన్

మార్చు
సినిమా ఛానల్ ఇతర వివరాలు
నన్న పుతులి మంజరి టి.వి ఒడియా డైలీషాప్
ఇ-న్యూస్ ఓటివి ప్రెజెంటర్
ఇ-గాసిప్ ఓటివి
టెలి ట్రవెల్ ఓటివి
రివ్యూ షో ఎంబిసీ టివి
అమ రోసీ ఘరా తరంగ్ టీవీ
జితా ఒడిషా జీయా తరంగ్ టీవీ
అపనంక పసంద్ ఈటివిఒడియా
స్వరా ఒడిషారా సార్థక్ టీవీ
మున్ బి హీరోయిన్ హెబీ సార్థక్ టీవీ
సరగిగమ లిటిల్ చాంప్స్ సార్థక్ టీవీ

అవార్డులు

మార్చు
  • ఉత్తమ మహిళా అరంగేట్రానికి రూపనగర మహానగర అవార్డు
  • ఉత్తమ తొలిచిత్ర నటిగా షో టైమ్ అవార్డు
  • ఒపెరా మిసెస్ ఇండియా గ్లోబల్ 2018[3]

మూలాలు

మార్చు
  1. "ଛୋଟ ପରଦାରେ ଉପସ୍ଥାପିକା, ହେଲେ ବଡ଼ ପରଦାରେ ନାୟିକା". Sambad (in Odia). 7 March 2018. Retrieved 2023-03-08.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  2. "Kaunri Kanya 3D Oriya Horror Film". Incredible Orissa.
  3. "Odisha's Pupul Bhuyan Wins Opera Mrs India Global 2018". odishabytes. 23 September 2018. Retrieved 2023-03-08.
  4. Bureau, KalingaTV (16 June 2020). "First look of Babusan's Odia upcoming film 'Bidyarana' released: Watch". KalingaTV. Retrieved 2023-03-08.
  5. Pioneer, The. "Cuttack girl wins Charming Face Odisha title". The Pioneer (in ఇంగ్లీష్). Retrieved 2023-03-08.
  6. "These beauty pageant winners capture hearts during lockdown". Odisha News, Odisha Latest news, Odisha Daily - OrissaPOST. 8 May 2020. Retrieved 2023-03-08.
  7. "Pupul is Opera Mrs India Global". Orissa Post. 25 September 2018. Archived from the original on 15 November 2022. Retrieved 2023-03-08.
  8. "Shubhapallaba Released its 39th Edition on Raja Sankranti". Odisha Diary. 15 June 2022. Retrieved 2023-03-08.
  9. "Actress Pupul Bhuyan waits for shooting for her film to resume post lockdown - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2023-03-08.

బయటి లింకులు

మార్చు