పురపాలకసంఘం

(పురపాలక సంఘము నుండి దారిమార్పు చెందింది)

పురపాలక సంఘం లేదా మున్సిపాలిటీ, భారతదేశంలో పట్టణాన్ని పరిపాలించే పరిపాలనా యంత్రాంగం. ప్రజలుచేత ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా ఎన్నుకొనబడిన వ్యక్తి పురపాలక సంఘానికి మున్సిపల్ ఛైర్మన్‌గా ఉంటాడు. పరిపాలనా యంత్రాంగం కొరకు పట్టణ కౌన్సిల్ లేదా మున్సిపల్ కౌన్సిల్ నందు అధికారులు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 3, కార్పొరేషన్లు 13, మున్సిపాలిటీలు 74, నగర పంచాయితీలు 20 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రేటర్ కార్పొరేషన్లు 6, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలు కలిపి 59 ఉన్నాయి. వీటికి ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తుంది. [1]

తెలంగాణ రాష్ట్రంలో ఒక పురపాలకసంఘ కార్యాలయం (గద్వాల)

పురపాలక సంఘాల ఏర్పాటుకు నిబంధనలు

మార్చు

కార్పొరేషన్ కావాలంటే మూడు లక్షల జనాభా చాలని చదరపు కిలోమీటరుకు కనీసం ఐదువేల జనాభా ఉండాలని మునిసిపల్ నిబంధనల్లో మార్పులు చేసినందువల్ల రాష్ట్రంలో కొత్తగా మరో 60 మునిసిపాలిటీలు, మరికొన్ని నగరపాలక సంస్థల ఏర్పాటుకు అవకాశం కలిగింది. గ్రేడ్-1, స్పెషల్, సెలక్షన్ గ్రేడ్ హోదాలో ఉన్న అనేక మునిసిపాలిటీలు కార్పొరేషన్‌లుగా అప్‌గేడ్ర్ అయ్యే అవకాశమేర్పడింది. ప్రతిపాదిత పట్టణంలో తగినంత జనాభా లేనిపక్షంలో సమీప గ్రామాలను విలీనం చేసుకునేందుకు కూడా వీలుంది. మేజర్ పంచాయతీలను మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కనీస జనాభాను 20వేలకు కుదించారు.

ఉడా నియమాలు

మార్చు

అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీలు: హైదరాబాదు (హుడా), విశాఖపట్నం (వుడా), విజయవాడ (విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి పట్టణాభివృధ్ధి సంస్థ), వరంగల్‌, తిరుపతి (తుడా) , కర్నూలు (కుడా).

  1. లే అవుట్ అనుమతికి భూమిపై హక్కు నిర్ధారణ పత్రం చూపించాలి. ఎన్ కంబరెన్స్ సర్టిఫికెట్, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మినహాయింపు సర్టిఫికేట్, లేక నోటరీ అఫిడవిట్‌లు ఉండాలి.
  2. స్థలం భూసేకరణ ప్రతిపాదనలో లేదని తెలుపుతూ మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన నిరంభ్యంతర పత్రం చూపాలి.
  3. ఒకవేళ లే అవుట్ వేసే స్థలం రెసిడెన్షియల్ పరిధిలో లేకపోతే రెసిడెన్షియల్‌గా మార్చుకోవాలి. లేఔట్‌ పొందటానికి ఒక్కో ఎకరాకు దీనికి అభివృద్ధి నిధుల కింద రూ. లక్ష వరకు చెల్లించాల్సి ఉంటుంది.
  4. స్థలం నుంచి ఎల్రక్టిక ల్ లైన్స్ వేసే ప్రతిపాదన లేదని తెలుపుతూ ట్రాన్స్ కో నుంచి నిరభ్యంతర పత్రం ఉండాలి.
  5. లే అవుట్ వేసిన భూమిలో 10 శాతం కామన్ సైట్‌గా వదలాలి. 40 అడుగుల రోడ్డు ఉండాలి.
  6. 10 టన్నుల బరువైన లారీ వెళ్ళినా రోడ్డు కుంగకుండా ఉండాలి.
  7. మొక్కలు నాటటం వంటి పనులన్నీ పూర్తయ్యాకే ఉడా చివరి అనుమతి ఇస్తుంది. ఆ తర్వాతే ప్లాట్ల అమ్మకాలు జరపాలి.

ఇవి కూడా చూడండి

మార్చు

వనరులు

మార్చు
  1. "రాష్ట్ర ఎన్నికల కమీషన్ వెబ్సైటు". Archived from the original on 2010-05-12. Retrieved 2019-01-27.

వెలుపలి లంకెలు

మార్చు