పురాణపండ రాధాకృష్ణమూర్తి
రాజమండ్రికి చెందిన పురాణపండ రాధాకృష్ణమూర్తి అనేక ఆధ్యాత్మిక, భక్తి, వేదాంత రచనలు చేశాడు. ఇతని తండ్రి బ్రహ్మశ్రీ పురాణపండ రామమూర్తి ప్రముఖ ధర్మప్రచారకుడు. రామాయణ, భారత, భాగవతాలను సులభశైలిలో అనువదించాడు. ఇతని అన్నయ్య ఉషశ్రీగా ప్రసిద్ధుడయిన పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు. తండ్రి తదనంతరం రాధాకృష్ణమూర్తి అతని మార్గాన్నే అనుసరించి ధర్మప్రచారాన్ని ప్రారంభించాడు. రాజమండ్రిలో భాగవత మందిరాన్ని స్థాపించి దాని ద్వారా హిందూ ధర్మప్రచారానికి, దైవభక్తికి సంబంధించిన పుస్తకాలను ప్రచురించాడు.
రచనలుసవరించు
- హనుమచ్చరిత్ర
- శ్రీ గాయత్రీ దివ్యశక్తి
- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం
- శ్రీ లలితా స్తోత్రమంజరి[1]
- శ్రీ లలితా దివ్యస్తోత్ర మంజరి
- శ్రీలలితోపాసనా సర్వస్వము
- శ్రీ లలితా సహస్రనామ స్తోత్రరత్నము
- శ్రీ దుర్గాదేవీ మహాత్మ్యము
- దివ్యవాణి
- శ్రీ దుర్గాదేవీ వైభవము
- నవదుర్గలు
- దేవీనవరాత్రగాథ
- దుర్గానందలహరి
- శ్రీ దుర్గాదేవీ మాహాత్మ్యము
- సకల కార్యసిద్ధికి సుందరకాండ
- సుందరకాండ సారాంశము
- సుందరకాండ వైభవము
- రామాయణములో కొన్ని ఆదర్శపాత్రలు
- అధ్యాత్మ రామాయణము
- అధ్యాత్మ రామాయణ విజ్ఞానము
- ఆంజనేయ వైభవము
- శ్రీ హనుమత్ప్రభ[2]
- శ్రీ ఆంజనేయ పూజావిధానము
- భాగవతామృతము
- శ్రీమద్భాగవతమాహత్మ్యము(పద్మపురాణం)
- శ్రీమద్భాగవత రహస్యము
- భాగవత జ్యోతి
- శ్రీమద్బాగవత మహాపురాణం
- భాగవత ప్రభ
- భాగవత వాణి
- రుక్మిణీ కల్యాణము
- శ్రీరామ వాణి
- శ్రీకృష్ణ వాణి
- శ్రీరామనామ మహిమ
- కళ్యాణ వాణి
- శ్రీరామరక్షా స్తోత్రము
- శివానంద సౌందర్యలహరులు
- అష్టవినాయకులు
- శ్రీదేవి ప్రార్థనలు
- శివ స్తోత్ర రత్నాలు
- శ్రీవిష్ణు సహస్ర నామస్తోత్రం
- పార్వతీ కళ్యాణము
- శివ స్తోత్రమంజరి
- శివ స్తోత్రాలు
- దివ్య స్తోత్ర రత్నావళి
- శ్రీకృష్ణలీలామృతము
- మణిద్వీపవర్ణన
- ఉపనిషద్వాణి
- భీష్మ పితామహుడు
- శ్రీ దత్తాత్రేయ స్తోత్రరత్నాలు
- మహాదాత కర్ణ
- శోకశాంతికి ఉపాయాలు
- శ్రీ సువాసినీ పూజా విధానము
- మహాలక్ష్మీ పూజా విధానము
- భక్త ఉద్ధవ