పురుమల్ల శ్రీనివాస్
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
1973 ఉమ్మడి కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో జన్మించారు పురుమల్ల శ్రీనివాస్.
బొమ్మకల్, దుర్షెడ్, కరీంనగర్ లో విద్యాభ్యాసన్ని పూర్తి చేశారు .
సామాజిక కార్యకర్తగా తన జీవితాన్ని ప్రారంభించిన శ్రీనివాస్ అనేక సేవ, సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యలోనే ఉండేవారు.
ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన శ్రీనివాస్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
తన స్వగ్రామమైన బొమ్మకల్ కు 20 సంవత్సరాల పాటు ఉపసర్పంచ్, సర్పంచ్ గా సేవలందించి గ్రామంలో ఎంతో అభివృద్ధిని చూపించారు.
ఆ తర్వాత తన సతీమణితో కలిసి జడ్పిటిసి ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీనివాస్ తన జిల్లాలోనూ అభివృద్ధిలో తనదైన మార్క్ ను చూపెట్టారు.
ఉప సర్పంచ్.. సర్పంచ్.. జెడ్పిటిసి ఇలా అనేక పదవులు దగ్గరుండి నిర్వహించిన శ్రీనివాస్ ప్రజలకు మరింత సేవ చేయాలని ఉద్దేశంతోనే ఉన్నత స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నారు .
మొదటినుంచి కాంగ్రెస్ పార్టీలో ఎంతో అంకితభావం నిబద్ధతతో పాటు పార్టీ అభివృద్ధికి కృషిచేసిన శ్రీనివాస్ పని తీరుని మెచ్చిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనకు కరీంనగర్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించింది .
2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీలో ముందున్నారు శ్రీనివాస్.
అనేక శివ, సామాజిక కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో చూపెట్టిన అభివృద్ధి శ్రీనివాస్ గెలుపుకు ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.[1]
మూలాలు
మార్చు- ↑ "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.