పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి : పుర హితవు కోరే పోరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా గుర్తించి వారిని సామాజికంగా,ఆర్ధికంగా రాజకీయంగా ఆదుకోవలసిన భాధ్యత ప్రభుత్వాలపై ఉంది.ప్రతి కులానికి కుల వృత్తి ఉంది కమ్మై కుమ్మరి వడ్రంగి అలా అందరికీ కు వృత్తి కేటాయించి వారి వారి వృత్తులలో రాయితీలు అందించి వారు ఆర్ధికంగా నిలదొక్కుకొనేందుకు చేయూతనిస్తున్నాయి.

పురోహితుడు-16వ శతాభ్దానికి చెందిన భాగవత పురాణము నుంచి ఒక దృశ్యం

అయితే సమాజ శ్రేయస్సే పరమావధిగా సర్వేజనాః సుఖినోభవంతు అంటూ హైదవ ధర్మాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పౌరోహిత్యాని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ కుల వృత్తిగా గుర్తించాలని ఆంద్రప్రదేశ్ పురోహిత బ్రాహ్మణ సమాఖ్య విజ్నప్తి చేస్తోంది.

డు అనగా ముందుగా హితము పలికెడి వాడు అని అర్థం. అనగా,మనము ఏదైన పనిచేయబోయినప్పుడు, ముందుగా, అతనిని సంప్రదిస్తే, ఆ పని చేయడం లోని మంచి, చెడ్డలను చెప్పి, ఆ పని చేయడం యోగ్యమయిన దయితే, దానిని నిర్వర్తించే విధానం తెలిపేవాడు పురోహితుడు. అందు వలన, ఒకపనిని, స్వప్రయోజనాన్ని ఆశించిగాని, లేదా ఇతర కారణముల వలన గాని మన చేత చేయిస్తే, దాని వలన వచ్చే పాపము పురోహితునికే వెడుతుందిగాని, మనకు కాదు. అందువలన, ఏపనిచేయడానికైనా ముందుగా పురోహితుని అనుజ్ఞ తీసుకోవాలి. పాలకుడైన వాడు పాలితుల( ప్రజల ) పాపములకు బాధ్యుడు, పాలకుని పాపములకు పురోహితుడు బాధ్యుడు.

     రాజా రాష్ట్రకృతం పాపం
     రాజ పాపం పురోహితః

అని ఆర్యోక్తి.
పురోహితుడు చేసే పనిని పౌరోహిత్యము అంటున్నారు. పూర్వకాలంలో, రాజ్యానికి శుభములు సమకూడేందుకు, పరరాజుల దండయాత్రల వంటి విషమ పరిస్థితులలోను మంత్రి, పురోహితులతో రాజు సమాలోచనలు జరిపేవాడు. పురోహితునికి సాధారణమైన పేరు వశిష్ఠుడు.
వివాహాది షోడశకర్మలు జరుపడానికి, ముందుగా, వసిష్టులవారిని ఆహ్వానించి, గౌరవించి, తలపెట్టిన శుభకార్యాన్ని జయప్రదంగా జరుప వలసినదని కోరాలి.

పురోహితుడు

ఇప్పుడు పౌరోహిత్యము చేయువానిని పురోహితుడు అంటారు. పౌరోహిత్యము సాధారణముగా బ్రాహ్మణులు చేయుచుందురు. ప్రస్తుతం వివిధ కులాలకు సంబందించిన వారు కూడా పౌరోహిత్యము నిర్వర్తిస్తున్నారు.

పౌరోహిత్యపు విధులు మార్చు

పురోహితులు పిండాలు, తద్దినాలు, కర్మ మంత్రాలు ఇత్యాది అపర కర్మలు, శుభకార్యాలైన పెళ్ళి, గృహప్రవేశము, వ్రతాలు, నోములు, ఇలా శుభ, అశుభ కార్యాలను అన్నిటిని నిర్వర్తిస్తుంటారు.

పురోహితుని విద్యార్హతలు మార్చు

ప్రస్తుత కాలములో పౌరోహిత్యమును వృత్తిగా స్వీకరించు వారు కొన్ని విద్యలను గురుముఖతః నేర్చుకోవాలి. విద్యార్థి ఉపవీతుడై ఉండాలి. త్రి సంధ్యల లోను సంధ్యావందనము చేస్తూ ఉండాలి. అక్షరజ్ఞానము కలిగి ఉండాలి. ముందుగా అతని శిక్షణ విఘ్నేశ్వరపూజ నేర్చుకోవడంతో ప్రారంభం అవుతుంది. దీనితోపాటు పుణ్యాహవాచనము కూడానేర్చు కోవాలి. ఇవి నేర్చుకోవడమంటే, పాఠము తోపాటు, క్రియ కూడా పూర్తి అనుభవం లోకి రావాలి. అంటే, ఇప్పటి పరిభాష ప్రకారం, థియరీ, ప్రాక్టికల్ మీద పూర్తి అధికారం రావాలి. అందుకోసం, గురువుతోపాటు రాత్రింబవళ్లు తిరుగుతూ, పాఠమును, క్రియను ఏక కాలములో నేర్చుకునే ఓపిక, ఓర్పు ఉండాలి. ఇది సామాన్యమైన పని కాదు. తెలివితేటలు గల విద్యార్థికి, పూర్తిగా ఒక సంవత్సరం కనీసం పడుతుంది. ఇలా పూర్తిగా నేర్చుకున్న విద్యార్థికి చిన్న వ్రతములు, నోములు చేయించడానికి అవసరమైన ప్రారంభ భాగము వచ్చినట్లే. వీటిని పూర్తి చేయించడము తెలియాలంటే, మరొక సంవత్సరము పాటు నేర్చుకోవాలి. ఆ తర్వాత, షోడశ కర్మలు చేయించడము నేర్చుకోవాలంటే, మరొక అయిదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది. దీనితో స్మార్త ప్రయోగము తెలిసినట్లే. కాని అనుభవము పూర్తిగా రాదు. మరో రెండు, మూడేళ్లు ఆ పనిలో ఉండాలి. సాధారణంగా, మనకు తటస్థపడే పురోహితులకు ఇంతమాత్రమే తెలిసి ఉంటుంది.

ఉన్నత విద్యార్హతలు మార్చు

ఏ విద్యలోనైనా ఉన్నట్లే, పౌరోహిత్యము లో కూడా ఉన్నత విద్య ఉంది. యజ్ఞ, యాగాది క్రతువులు చేయించటానికి ప్రత్యేకమైన శిక్షణ అవసరం. దీనికోసము, వేదములో ప్రాజ్ఞత అవసరము. ఇలాంటి ఉన్నతవిద్య లో నిష్ణాతులయినవారు ఆంధ్ర దేశములో చాలా తక్కువగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానములలో ఆస్థానవిద్వాంసులుగా ఇట్టి వారు స్థిరపడతారు.

అపర విద్య మార్చు

స్మార్త ప్రయోగము తెలిసిన వారు సాధారణంగా శుభకార్యాలను మాత్రమే చేయిస్తారు. అపర కర్మలను, అనగా, మనిషి చనిపోయినప్పుడు, ఆ తరువాత మొదటి పండ్రెండు దినముల వరకు చేయవలసిన విధులను చేయించేవారు కూడా ఈ చదువునే చదివినా, వారు శుభకార్యములు నిర్వహించడానికి పూనుకొనరు. దీనికి ఒక కారణమేమంటే, శుభకార్యములు చేయించే సమయములో, పొరపాటున, అపరకర్మల లోని మంత్రములను, కొండొకచో, ,క్రియలను కూడా జరిపించేస్తారని భయము.

పాఠశాలలు మార్చు

స్మార్తము బోధించడానికి, తిరుపతి, సింహాచలము వంటి దేవస్థానములు వేద పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. అదిగాక, ప్రముఖ విద్వాసుల వద్ద శిష్యులుగా చేరి, గురుకుల పద్ధతిలో కొందరు ఈ విద్యను నేర్చుకొంటారు. కొంతమంది వదాన్యులు ఇచ్చిన విరాళముల మీద ఆధారపడి కొన్ని పాఠశాలలు నడుస్తున్నాయి. విచిత్రమైన విషయమేమిటంటే, ఈ పాఠశాలల నిర్వహణలో, ప్రభుత్వము పాత్ర కనిపించడములేదు.

పురోహితుని నడవడి మార్చు

  • పౌరోహిత్యము చేయువారు చక్కని వాగ్ధాటి కలిగి ఉండవలెను.
  • మంత్రశాస్త్రములో ప్రవేశముండవలెను.
  • శుచి, శుభ్రత కలిగి ఉండవలెను.
  • సాత్విక గుణములు కలవాడై ఉండవలెను.
  • మాంసాహారము ముట్టని వాడై ఉండాలి.
  • దురవ్యసనాలు దరిచేరనివ్వని వాడుగా ఉండాలి
  • నియమ, నిష్ఠలతో దేవతార్చన చేయువాడై ఉండవలెను.
  • ఎదుటి వారిని దూషించని వాడయి ఉండాలి