పూడూరు కృష్ణయామాత్యుడు
"పూడూరు కృష్ణయామాత్యుడు" ఇతను 17 వ శతాబ్ది పూర్వార్థానికి చెందిన కవి. గద్వాల సమీపంలోని పూడూరు గ్రామవాసి. ఇతని తండ్రి కొండయామాత్యుడు. కాండిన్యస గోత్రులు. ఈ కవి తన గురువు యోగానందుడని చెప్పుకున్నాడు. ఈ యోగానందుడే కృష్ణయామాత్యునికి వాసుదేవద్వాదశాక్షరీమంత్రబీజాన్ని ఉపదేశించాడు[1]. కౌసలేయ చరిత్రమును రాసిన లయగ్రాహి గరుడాచల కవి కి ఇతను సమకాలికుడు. కృష్ణయామాత్యుడు ' భగవద్గీతార్థ దర్పణం ' అను గ్రంథాన్ని రచించాడు. 17 అధ్యాయములు కలిగిన ఈ తాళ పత్ర గ్రంథం 62 కమ్మలతో రాయబడి ఉన్నది[2].