పూర్ణిమా అద్వానీ
పూర్ణిమా అద్వానీ భారతీయ న్యాయవాది, రచయిత, సామాజిక కార్యకర్త. [1] ఆమె జనవరి 2002 నుండి జనవరి 2005 వరకు జాతీయ మహిళ కమిషన్ (NCW) 4వ అధ్యక్షురాలిగా పనిచేసింది. [2] [3]
పూర్ణిమా అద్వానీ | |
---|---|
జాతీయ మహిళా కమీషన్ చైర్ పర్సన్ | |
In office 2002 జనవరి 25 – 2005 జనవరి 24 | |
తరువాత వారు | గిరిజా వ్యాస్ |
వ్యక్తిగత వివరాలు | |
జాతీయత | భారతీయులు |
నైపుణ్యం | న్యాయవాది, రచయిత్రి, ప్రొఫెసర్, సామాజిక కార్యకర్త |
జీవిత చరిత్ర
మార్చుఆమె తల్లి మీరా గోవింద్ అద్వానీ రచయిత్రి. [4] పూర్ణిమా అధ్వానీ ముంబయి విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డాక్టరేట్ తో పాటు ఫిజియోథెరపీ పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా పొందింది. ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, న్యాయ శాస్త్ర, వైద్య శాస్త్రాలలో రచనలను చేసింది. [5] ఆమె ముంబై విశ్వవిద్యాలలయంలోని న్యాయశాస్త్ర విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేసింది. ఆమె అనేక క్వీన్స్ లాండ్ (ఆస్ట్రేలియా) విశ్వవిద్యాలయం, లండన్ లోని స్కూల్ ఆఫ్ ఓరియంటేషన్ అండ్ సౌత్ ఆఫ్రికన్ స్టడీస్, లండన్ విశ్వవిద్యాలయం లతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాలలో పనిచేసింది. [6][7] ఆమె 2005లో భారత ప్లానింగ్ కమీషన్ మాజీ సలహాదారుడైన బి.ఎన్.ముఖర్జీ తో స్థాపించిన ది లా పాయింట్ సంస్థకు సహ వ్యవస్థాపకురాలు.[8]
పూర్ణిమా 2022 ఏప్రిల్ 1న మృతి చెందింది.
ప్రచురణలు
మార్చుఇండియన్ జ్యుడీషియరీ: ఎ ట్రిబ్యూట్ (Indian Judiciary: A Tribute) (1997) అనే పుస్తకాన్ని రచించారు. [8]
పురస్కారాలు
మార్చు2003లో ఆచార్య తులసి కార్తిత్వ పురస్కారంతో (Acharya Tulsi Kartitva Puraskar) సత్కరించబడ్డారు. [9]
మూలాలు
మార్చు- ↑ "Poornima Advani lambasts UP police". The Times of India (in ఇంగ్లీష్). 2003-08-05. ISSN 0971-8257. Retrieved 2024-01-15.
- ↑ "Poornima bows out as NCW chief". The Tribune. 24 January 2005. Retrieved 2024-01-15.
- ↑ "Dr. Poornima Advani". Amma, Mata Amritanandamayi Devi (in అమెరికన్ ఇంగ్లీష్). 2003-09-27. Retrieved 2024-01-15.
- ↑ "Burying blog bitterness, BJP chief calls Advani tallest leader". Hindustan Times (in ఇంగ్లీష్). 2012-06-12. Retrieved 2024-01-15.
- ↑ "Dr. Poornima Advani". Speaker's Research Initiative. Archived from the original on 25 జూలై 2019. Retrieved 25 July 2019.
- ↑ "Dr. Poornima Advani". The Law Point (TLP) (in ఇంగ్లీష్). Archived from the original on 2023-02-04.
- ↑ "Poornima Advani to be new chairperson of NCW". Zee News. 15 January 2002. Archived from the original on 2021-04-21. Retrieved 25 July 2019.
- ↑ 8.0 8.1 "NCW ex-Chairperson Dr Poornima Advani succumbs to cancer". Argus (in ఇంగ్లీష్). Retrieved 2024-01-15.
- ↑ "Awards Presented By ABTMM". www.abtmm.org (in ఇంగ్లీష్). Retrieved 2024-01-15.