పూల్ మఖానా
పూల్ మఖానా (ఆంగ్లం: fox nuts) తామర పువ్వు గింజలతో తయారు చేసిన తినుబండారం[1] బీహార్ రాష్ట్రం, మధుబనీ మఖానా ప్రాంతంలో తయారు చేస్తుంటారు. తామర పువ్వుల నుండి సేకరించిన గింజలను బ్లాక్ డైమండ్స్ అంటారు. మిథిలా మఖానా పేరుతో భౌగోళిక గుర్తింపు పొందింది.[2]
సేకరణ
మార్చుముఖాన తామర పువ్వులు చెరువు నిండ పచ్చని ఆకులతో నిండి ఉంటాయి. పూసిన తామర పులా తొడిమి దగ్గర ఈ విత్తనాలు ఉంటాయి. పులా రెక్కలు పూర్తిగా రాలిపోయి ఆ గింజలన్ని ఎండి పోయి నీటి అడుగుకి చేరుతాయి. నీటి పైకి ఆకులు మాత్రమే పర్చుకోని కనిపిస్తుంటాయి. ఆ ఆకులను పక్కకు జరుపుతూ అడుగున ఉన్న తామర విత్తనాల్ని వలలు-బుట్టలతో సేకరిస్తుంటారు.[3][4]
తయారీ
మార్చుముఖాన తామర పువ్వు విత్తనాలను తేమంతా పోయేలా ఎండబెడతారు. మట్టి ఇతర చెత్త చెదారం లేకుండా శుభ్రంగా చేసిన నల్లని గింజన్ని ఇనుప ముకుళ్లలో సన్నని సెగ మీద పద్ధతి ప్రకారం వేయిస్తారు. ఆ తర్వాత గింజల్ని పగలగొడితే పాప్ కార్న్ లా పేలుతూ బయటికి వస్తాయి.[5]
పోషకాలు
మార్చువంద గ్రాముల పూల్ మఖానాలో ఉండే పోషకాలు:
- శక్తి :347 క్యాలరీలు
- పిండి పదార్థాలు:77 గ్రాములు
- కొవ్వు: 0.1 గ్రాములు
- ప్రొటీన్లు: 9.7 గ్రాములు
- పీచు:14.5 గ్రాములు
- ఐరన్:1.4 మిల్లి గ్రామాలు
- కాల్షియం: 60 మిల్లి గ్రాములు
- పాస్పరస్: 90 మిల్లి గ్రాములు
- పొటాషియం:500 మిల్లి గ్రాములు
ఉత్పత్తులు-రకాలు
మార్చులడ్డులు, బర్పీ స్వీట్లు , చిప్స్, మురుకులు
రుచులు
మార్చుపూల్ మఖానా పిల్లల చిరుతిళ్ళలో భాగమై పోయాక ఉప్పు కారాలు, తీపి రుచులతో పాటు పుదీన, టమాట, ఉల్లిపాయ క్రీముల పేవర్లులో దొరుకుతుంది.
లాభాలు
మార్చు- మఖానాలో క్యాలరీల శాతం తక్కువగా ఉంటుంది. పైగా దీంట్లోని ప్రొటీన్లూ, పీచూ ఎక్కువసేపు ఆకలి వేయకుండా చేస్తాయి. అందుకే, బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
- ఈ నట్స్ లో ఉండే అధిక పీచు- జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకుంటే మలబద్ధకం, ఇతర ఉదర సంబంధ వ్యాధులు చాలా వరకు తగ్గుతాయి.
- మఖానాతో వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవు. ఇందులోని ప్లవనాయిడ్లూ, యాంటీఆక్సిడెంట్లూ చర్మంపైన ముడతల్నీ, తెల్లవెంట్రుకల్నీ నివారిస్తాయి. చర్మానికి నిగారింపును తీసుకొస్తాయి.
- పూల్ మఖానా అధికంగా ఉండే మెగ్నీషియం గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్నీ, ట్రైగ్లిజరైడ్స్ అదుపులో ఉంచుతుంది.
- అధిక పొటాషియం, తక్కువ సోడియంతో ఉండే ఈ మఖానా రక్తపోటు ఉన్నవాళ్లకు మంచి ఆహారం.
- గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో- రక్తంలో చక్కెరస్థాయిల్ని నియంత్రిస్తుంది. కాబట్టి మధుమేహులు దీన్ని తినొచ్చని రకరకాల పరిశోధనలూ చెబుతున్నాయి.
- మఖానా తింటే ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. అందుకు కారణం దీంట్లో ఉండే అధిక కాల్షియమే. కీళ్ల నొప్పులున్నవారు రోజూ తీసుకుంటే ఎంతో మంచిది.
- బి-విటమిన్ ఎక్కువగా లభిస్తుంది దాని వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.[6]
మూలాలు
మార్చు- ↑ "Makhana Health Benefits: పూల్ మఖానా తింటున్నారా? గుండె జబ్బులు, షుగర్, బీపీ ఇంకా." TV9 Telugu. 2022-08-14. Retrieved 2024-06-10.
- ↑ ఈనాడు -ఆదివారం (2024-05-26), పూల్ ముఖాన.. పోషకాల ఖజానా..., retrieved 2024-06-11
- ↑ Haritha. "పిల్లలకు ఖచ్చితంగా పెట్టాల్సిన ఆహారం ఫూల్ మఖానా". ABP Telugu. Retrieved 2024-06-11.
- ↑ Telugu, TV9 (2021-07-02). "తెలుపు రంగులో మెరిసిపోయే పూల్ మఖనా.. ఎలా పండిస్తారో తెలిస్తే షాక్ అవుతారు." TV9 Telugu. Retrieved 2024-06-11.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Chappa, Haritha. "Phool Makhana: పూల్ మఖానా చాట్... పిల్లలకు, పెద్దలకు బెస్ట్ స్నాక్స్ రెసిపీ". Hindustantimes Telugu. Retrieved 2024-06-10.
- ↑ "పూల్ మఖానా తినడం వల్ల బోలెడు లాభాలు!". telugu.samayam.com. Retrieved 2024-06-11.