పూసల (కులం)
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
వృత్తి
మార్చుఆయుర్వేదం, వ్యవసాయం ఆలంకరణ సామాగ్రి బట్టలవ్యాపారం
చరిత్ర
మార్చుపూసలవాళ్లు ఆదిమవాసుల రాజులూ . పూసల కులస్తులు అడవులను వదిలి గ్రామీణ ప్రాంతాలకు చేరుకున్నప్పటికి .. న్యాయబద్ధంగా వుంటారు ,రాజుల కట్టుబాట్లను వీరు వదులుకోలేదు. పూసల కులస్తులను అయ్యా అని పిలుస్తారు. ఇతని ఆజ్ఞలను అమలు చేసే వ్యక్తిని ధర్మ అని పిలుస్తారు .వైద్య వృతి ఇప్పటికీ వీరి కులంలో కొనసాగుతుంది . నిజాం కాలంలోఈ కులంవారు రహదారి పత్రాన్ని జారీ చేసేవారు . గ్రామాలలో తిరిగి వస్తువులు అమ్ముకునే వారిని ఆయా గ్రామ పెద్దలు అవాంతరాలు కలిగించకుండా ఉండేందుకు ఈ రహదారి పత్రాలను జారీ చేసేవారు . కంచి పీఠాధిపతులు సైతం ఇటువంటి రహదారి పత్రాలు (మంగళ శాసనం) జారీ చేసేవారు
వృత్తి
మార్చుగ్రామాల్లో ఆయుర్వేద మందులు, మసాలాలు, పెళ్లి సామగ్రి, పూసల గొలుసులు, గాజులు, దువ్వెనలు, సూదులు విక్రయిస్తుంటారు. ఇదే వీరికి జీవనాధారం. వస్త్ర వ్యాపారం ద్వారా డబ్బు సంపాదిస్తారు.
చరిత్ర
మార్చుపూసలవాళ్లు ఆదిమవాసులైన చెంచు తెగకు వారసులు. సంచార జాతులను ఎస్టీలుగానో, బీసీ `ఏ' గ్రూపులోనో చేర్చగా పూలస కులస్తులను మాత్రం `డి' గ్రూపులోకి చేర్చారు. వి.రాఘవయ్య నేతృత్వంలో సాగిన వివిధ సంచార జాతుల అధ్యయనంలో పూసల వాళ్లు సంచార జాతి అని కూడా స్పష్టం చేశారు.13.2.2009 న రాష్ర్ట ప్రభుత్వం వీరిని బీసీ `డి' గ్రూప్ నుండి బి.సి.ఏ గ్రూపులోకి మార్ఛింది.
సామాజిక జీవనం
మార్చు. వీరు సంచార జీవులు కావటంతో గ్రామాలకు చేరుకున్న సమయంలో గౌడ, కుమ్మరి చావిళ్లలో తమ సామన్లు పెట్టుకుని ఆ సమీప గ్రామాలలో వ్యాపారం చేస్తుంటారు. కాటుక, తిలకం సీసాలు, బొట్టుబిళ్లలేకాదు... సవరాలు, హెయిర్ పిన్నులు, హెయిర్ బ్యాండ్లు వంటివి కూడా అమ్ముతుంటారు.
కుటుంబ స్థితిగతులు
మార్చుముఖంపై చిరునవ్వుతో కనిపించే ఈ మహిళలు భూ దేవికి ప్రతిరూపం. "మేమూ మనుషులమే" సినిమా కథ ఈ కుల ఆచార వ్యవహారాలకు, జీవన శైలికి దర్పణం పట్టింది. దీంతో అప్పట్లో ఆ చిత్రానికి `పూసల పిల్ల' అని మొదట పేరు పెట్టారు. కానీ ఈ కులస్తులు వ్యతిరేకించటంతో పేరు మార్పు చేశారు.
సమస్యలు
మార్చుపల్లెల్లో కూడా ఫ్యాన్సీ షాపులు రావడంతో వీరి వృత్తి దెబ్బతింది. అయినప్పటికీ వృత్తిని వదులుకోకుండా మారుమూల పల్లె ప్రాంతాలకు చేరుకుని వ్యాపారం చేస్తున్నారు. పురుషుల సంఖ్యు తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తుంటారు. ఆటోలు నడిపి, సున్నంవేసి, కూలిపనులు చేస్తున్నవారూ ఉన్నారు. ఈ కులస్తులలో అత్యధికులది సంచార జీవనమే కావడంతో... ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదు. రేషన్ కార్డు సౌకర్యం కూడా వీరు పొందలేకపోతున్నారు. పూసల కులస్తులకు ప్రత్యేకంగా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎస్టీలలో చేర్చాలని వీరు కోరుతున్నారు.