పెద్దరేగు
పెద్దరేగును తెలుగులో కొండరేగు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం Ziziphus mauritiana. ఈ చెట్టుకి కాసే రేగు పంద్లు పెద్దవిగా ఉండటం వలన దీనిని పెద్దరేగు అంటారు. దీనిని ఇంగ్లీషులో Jujube, Chinese Apple, Indian plum అని అంటారు. ఉష్ణ మండల ప్రాంతాలలో పెరిగె రామ్నేసి (Rhamnaceae) కుటుంబానికి చెందిన చిన్న పండ్ల చెట్టు ఇది. వీటి పండ్లు తినడానికి తియ్యగా చిన్న పులుపు రుచితో ఉంటాయి. చిన్న రేగు పండ్లు నలిగి నట్లుగా ఇవి పంటి కింద నలగవు కాబట్టి విత్తనం పై ఉన్న కండను మాత్రమే తినగలుగుతారు, కొంతమంది వితనాన్ని సైతం బండతో పగలగొట్టి వితనం లోపల ఉన్న బేసనాన్ని కూడా తింటారు. ఇది సుమారు 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం 40 సెంటీ మీటర్ల అడ్డుకొలత ఉంటుంది. ఈ చెట్టుకి ముళ్లతో కూడిన కొమ్మలు అనేకముంటాయి. వీటి కాయలు 2 నుంచి 4 సెంటీమీటర్ల పొడవు 1 నుంచి 2.5 సెంటీమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. దాదాపు అన్ని ప్రదేశాలలో ఈ చెట్టు వేగంగా పెరుగుతూ ఎప్పుడు పచ్చగా ఉంటుంది. రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడా రేగి పండ్లే. వినాయకుని పూజా విధానంలో బదరీ పత్ర సమర్పయామి అని రేగి పత్రాన్నె సమర్పిస్తారు. ఈ పండులో అనేక ఔషధ గుణాలున్నాయి. పండులోనె గాదు ఆకులలోను చెట్టు బెరడులోను. చివరకు కాయ లోని గింజల్లోకూడ ఔషధ గుణాలున్నాయని పరిశోధకులు కనిపెట్టారు. నిజానికి దీనిని వైద్యంలో వినిగించే పద్ధతి భారత దేశంలో ఈ నాటిది కాదు. చాల పూర్వ కాలంనుండే ఇది వాడుకలో ఉంది. ఇతర దేశాలలోకూడ ఈ రేగి పండు ఔషధ విలువలు తెలిసికొని వాడుతున్నారు. కొన్ని దేశాలలో రేగి లేత ఆకులను కూరలుగా వండుకొని తింటారు. రేగి పండ్లు తినడానికే కాదు ఈ రేగి పండ్లతో కొన్ని వంటకాలు కూడా చేస్తారు. వీటితో జ్యూస్లులు, జామ్ లు,, వడియాలు వంటి తిను బండారాలను కూడా చేస్తరు. ఆంధ్ర ప్రాంతాలల్లో రేగి పండ్ల గుజ్జు తీసి దానికి పండు మిరపకాయలు, కొంత ఉప్పు, కొంత బెల్లం చేర్చి కచ్చా పచ్చా దంచి నిల్వ చేసుకొని అప్పుడప్పుడు తింటారు. అది కొంత తియ్యాగా, కారంగా, పుల్లగా, ఉప్పగా ఇలా అనేక రుచులతో చాల బాగుంటుంది. శాస్త్ర ప్రయోగాలలో ఈ రేగు పండులో పోషక విలువలు ఈ విదంగా ఉన్నాయి. వంద గ్రాముల పండ్లలో................... ప్రొటీన్లు......................0.8 గ్రాములు. పీచు.......................... 0.6 " పిండి పదార్తాలు........... 17.00 " కాల్షియం ................... 25.6 ఎమ్.జి. ఫాస్పరసు.................... 26.8 " ఇనుము..................... 1.0 " వరకు కెరోటిన్ ....................... 0.02 " సిట్రిక్ యాసిడ్............. 1.1 " ఆస్కార్బిక్ యాసిడ్....... 76 "
Ziziphus mauritiana | |
---|---|
Scientific classification | |
Kingdom: | |
Division: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | Z. mauritiana
|
Binomial name | |
Ziziphus mauritiana |