పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ

శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మ ప్రముఖ తెలుగు కవయిత్రి. వీరికి ముక్తికాంత అనే బిరుదు ఉంది.

శ్రీవత్స గోత్రానికి చెందిన శ్రీమతి లక్కరాజు సుందరి, సీతారామయ్యల పుత్రిక. ఆమె పుట్టిన తేదీ విషయంలో స్పష్టత లేదు. కానీ, 'అంతరార్థ రామాయణం' లోని ఆంతంగిక ఆధారాలను అనుసరించి ఆమె 1950 (వికృతి నామ) సంవత్సరంలో స్వర్గస్థులయినట్లు మాత్రం తెలుస్తుంది. ఆమె జీవించి ఉండగా ఈ కావ్యం ముద్రితం కాలేదు. ఆమె మరణానంతరం మనవరాలు శ్రీమతి ఆత్రేయపురపు లక్ష్మీసుందరీ జ్ఞానప్రసూనాంబ గారు చొరవ తీసుకొని దాన్ని 1982లో ప్రచురించారు. జ్ఞానప్రసూనాంబ గారికి స్వయంగా సంస్కృతాంధ్ర సాహిత్యాలలో ప్రావీణ్యం ఉన్నా, గ్రంథ పరిష్కారానికి వివిధ పండితుల సహకారాన్ని కూడా తీసుకున్నారు. ఈ కావ్య పరిష్కరణకు శ్రీమతి ముట్నూరి సీతామహాలక్ష్మమ్మ, డా చిలుకూరి వీరభద్రశాస్త్రి గార్లు సహకరించినట్లు తన కృతజ్ఞతలలో పేర్కొన్నారు.

ఇతర రచనలు

మార్చు

శ్రీమతి పెయ్యేటి లక్ష్మీకాంతమ్మగారు అంతరార్థ రామాయణంతో పాటు వివిధ పురాణేతిహాసాలను, వాటిలోని అంతరార్థాలనూ వివరిస్తూ వివిధ కావ్యాలను గానం చేసేవారు.

అంతరార్థ రామాయణంలో పేర్కొన్న వివరాల ప్రకారం ఆమె కింది రచనలను చేసినట్లు తెలుస్తుంది.

  • 1. అంతరార్థ నరకాసురవధ,
  • 2. అంతరార్థ రుక్మిణీ కల్యాణం,
  • 3. అంతరార్థ గజేంద్ర మోక్షం,
  • 4. అంతరార్థ సాగర మధనం,
  • 5.వచన భగవద్గీత,
  • 6. లాలి పాటలు.

మూలాలు

మార్చు