పెళ్ళిలో భాగంగా జరిగే రకరకాల సాంగ్యాలు - నలుగు పెట్టడం, నాగవల్లి, పాన్పు సంబరాలు, పూల చెండ్లాటలు - అన్నీ పెళ్ళిపాటలకు తగిన సందర్భాలే. ఇవేకాక కొత్త కోడలిని ఇంట్లోకి ఆహ్వానించడానికి పాడే తలుపు దగ్గరి పాటలు, మంగళహారతి పాటలు కూడా ఉన్నాయి. అన్ని పాటల్లోనూ ప్రధానాంశం కవ్వింపులూ తుళ్ళింతలు, సరసాలూ సరదాలే. వరసైన వారిమధ్య చోటు చేసుకునే సరసాలు, మోటు హాస్యాలు పెళ్ళిపాటల్లో ప్రధానపాత్ర వహిస్తాయి. జానపద వాఙ్మయంతో పరిచయం లేని వారికి ఈ సరసాలు, హాస్యాలు దురుసుగా, పెడసరంగా ఉన్నట్లనిపించినా జానపదులు దాన్ని విపరీతంగా భావించరు.

పూర్వము ప్రతి వివాహములో ఈ పాటలు వినిపించేవి.ఇరు వైపులా పెద్దలు ఈ పాటలు పాడేవారు. ఇప్పుడు సీడీలు, క్యాసెట్టులు,సెల్ ఫొనుల్లల్ల పెడుతున్నారు. వింజమూరి సీత -అనసూయ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, జంధ్యాల అన్నపూర్ణాదేవీ కొన్ని పాటలు పాడారు.

  1. ఏ దేశం నుంచి వచ్చారండి ఈ దేశానికి
  2. నలుగు పేట్టరే వదినకు

ఉదాహరణలు మార్చు

వదినెకు ఒగసరి మార్చు

వదినెకు ఒగసరి - బిందెకు బిగుసరి
బంగారుజడకుచ్చుల మా వదినె
అహ బంగారుజడకుచ్చుల మా వదినె ||వదినెకు||

గాలికి ఎగిరే దుమ్మును జూసి
బుక్కాము అంటది మా వదినె
నా ముఖానికంటది మా వదినె ||వదినెకు||

సెరువులొ ఉన్న కప్పలజూసి
బోండాలు అంటది మా వదినె - నేను
బోంచేత్తానంటది మా వదినె ||వదినెకు||

తోపులొ ఉండే తాచును జూసి
వొడ్డాణమంటది మా వదినె - నా
నడుముకు పెట్టమంది మా వదినె ||వదినెకు||

గోడమీద పాకే నల్లులజూసి
బుడ్డొడ్ల బియ్యమనె మా వదినె - నాకు
బువ్వజేసి పెట్టమనె మా వదినె ||వదినెకు||

బండిని నడిపే గాసగాన్నిజూసి
నా మగడన్నది మా వదినె - అహ
బండిలోకి ఎక్కెను మా వదినె ||వదినెకు||

  1. JAANAPADHA#GEETHAM##POEM##


===మంగళహారతి పాట===

<poem>
జయ మంగళం - నిత్య శుభమంగళం
జయాజయమంగళం - రామ శుభమంగళం

ఆ సంకనొకబిడ్డ - ఈ సంకనొకబిడ్డ
కడుపులో ఒకబిడ్ద కదలాడగా
ఆరు శాట్ల బియమొండి - మూడుశాట్ల పప్పొండి
సాలకా మా వదినె - సట్లునాకే ||జయ||

అప్పుకొక పల్లెంబు - పప్పుకొక పల్లెంబు
కూరనారకొక్క గుండుపళ్ళెంబు
అప్పులోడు వచ్చి సెప్పుతో కొడతాంటె
అప్పుడే మా బావ పప్పుకేడ్చెనే ||జయ||

నూగులు నుసి బట్టె - గానుగలు గసిబట్టె
పెండ్లికొడుకు నెత్తికి పేండ్లుబట్టె
పెండ్లికొడుకు సిన్నాయన పేండ్లుబట్టబోయి
గంజిగుంతలోబడి - గుంజులాడ ||జయ||

పల్లెపల్లేదిరిగి - పట్నాలన్నీ దిరిగి
ముల్లోకములు దిరిగి - నిన్నుదెస్చే
మూతి మూడొంకర్లు - నడ్డి నాల్గొంకర్లు
ముచ్చటైన పెండ్లికూతుర - నీకారతీ ||జయ||

ఆ వీధినొక కుక్క - ఈ వీధినొక కుక్క
నట్టనడి వీధిలో నల్లకుక్క
మూడు కుక్కలు కలిసి ముచ్చటలాడంగ
మూలనున్న పెండ్లికొడుకు మూతినాకే ||జయ||

మంగళం మంగళం మా బావ నెత్తికీ
సూరులో ఉండేటి సుంచెలుకకీ
మంగళం మంగళం మా వదినె కొప్పుకూ
గుంతలో ఉండేటి గోండ్రుకప్పకూ ||జయ||