పొటెన్షియల్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఏకైక ధనాత్మక ఆవేశాన్ని అనంత దూరం నుండి అంతరాళంలో ఒక బిందువు వద్దకు త్వరణం లేకుండా విద్యుత్ క్షేత్రమునకు వ్యతిరేకంగా తీసుకొని రావడానికి వినియోగించే పని ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అవుతుంది. దీనిని వోల్టు లలో కొలుస్తారు. రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం కనుగొనుటకు వాడే పరికరం "వోల్టు మీటరు"
వివరణ
మార్చుఅంతరాళంలో A, B అనే రెండు బిందువులు వరుసగా VA, VB అనే పొటెన్షియల్ లను కలిగి ఉన్నాయనుకొందాం. ఇందులో ఒకటి ధనాత్మకమైనది వేరొకటి ఋణాత్మకమైనది కావచ్చు. దీనివలన A, B ల మధ్య పొటెన్షియల్ భేదం ఉన్నదని తెలియుచున్నది. వాహకంలో A చివర ధనాత్మకమైనది, B చివర ఋణాత్మకమైనది అయినపుడు అనంత దూరం నుండి ఏకైన ధనావేశాన్ని A బిందువు వద్దకు తీసుకు రావడానికి అచ్చట ధనావేశం ఉన్నందువల్ల వికర్షణకు వ్యతిరేకంగా తీసుకు రావడానికి ఎక్కు వ పని చేయాలి. అందువల్ల A బిందువు వద్ద ఎక్కువ పొటెన్షియల్ ఉంటుంది. B అనే బిందువు ఋణాత్మకమైనది కావున ఏకైన ధనావేశాన్ని ఆ బిందువు వద్దకు తీసుకు రావడానికి ఆకర్షణ కారణంగా పని తక్కువ అవుతుంది. అందువలన B బిందువు వద్ద తక్కువ పొటెన్షియల్ ఉంటుంది. అందువలన విద్యుత్ ప్రవాహం A బిందువు నుండి B బిందువుకు ప్రవహిస్తుంది. దీనిని బట్టి ఎలక్ట్రాన్ లు తక్కువ గల A బిందువు వద్ద ఎక్కువ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ లు ఎక్కువగా గల B అనే బిందువు వద్ద తక్కువ పొటెన్షియల్ అని తెలుస్తుంది. అనగా విద్యుత్ A నుండి B కి ప్రవహిస్తే ఎలక్ట్రాన్ల ప్రవాహం B నుండి A కు ఉంటుంది. సాంప్రదాయక ధనావేశ దిశను విద్యుత్ ప్రవాహ దిశగా తీసుకుంటాము.