పోఖ్రాన్-II
పోఖ్రాన్-II పరీక్షలు అన్నది భారతదేశం భారత సైన్యానికి చెందిన పోఖ్రాన్ పరీక్షా రేంజిలో 1998 మేలో నిర్వహించిన ఐదు న్యూక్లియర్ బాంబుల విస్ఫోటనాల పరీక్షలు.[4] భారతదేశం నిర్వహించిన రెండవ అణు పరీక్షలు ఇవి; మొదట 1974 మే నెలలో స్మైలింగ్ బుద్ధ అన్న సంకేత నామంతో తొలి పరీక్ష నిర్వహించారు.[5]
పోఖ్రాన్-II ఆపరేషన్ శక్తి | |
---|---|
సమాచారం | |
దేశము | భారత దేశము |
పరీక్షా ప్రదేశం | పోఖ్రాన్ పరీక్షా రేంజ్, రాజస్థాన్, భారతదేశము |
పరీక్షా కాలం | 11–13 మే 1998 |
పరీక్షల సంఖ్య | 5 |
పరీక్షా రకం | అండర్ గ్రౌండ్ టెస్టు |
పరికర రకం | విఛ్ఛిత్తి/సంలీనం |
Max. yield | 60 kilotons of TNT (250 TJ) (Claimed by BARC) Disputed Yields: See below[1][2][3] |
గమనాగమనము నేవిగేషన్ | |
అంతకు ముందు పరీక్ష | Pokhran-I (Operation Smiling Buddha) |
200 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేసి బయటకు విడువగల థర్మోన్యూక్లియర్ ఆయుధాలనూ, అణువిచ్ఛిత్తినీ తయారుచేయగల సామర్థ్యాన్ని భారతదేశానికి అందించడం వీటి ప్రధాన లక్ష్యం. పరీక్షలు ఆ ప్రధాన లక్ష్యాన్ని అందుకున్నాయి.[6] అప్పటి భారత అణుశక్తి కమిషన్ రాజగోపాల చిదంబరం పోఖ్రాన్-II పేలుళ్ళలో ఒకదాన్ని "ఇతర అణ్వస్త్ర దేశాలు దశాబ్దాల పాటు చేసిన వివిధ పరీక్షలకు సమానమైనదని" అభివర్ణించాడు.[7] భారతదేశం తర్వాత, పరీక్షలో ఉపయోగించిన పేలుడు పదార్థాల డిజైన్‌ను పోలిన డిజైన్ కలిగిన ఇతర న్యూక్లియర్ పేలుళ్ళ నుంచి వచ్చే శక్తిని ముందుగానే అంచనా కట్టగల కంప్యూటర్ స్టిమ్యులేషన్ సామర్థ్యాన్ని తాను సాధించిన విషయమూ నిరూపించింది.[6]
పోఖ్రాన్-II పరీక్షల్లో ఐదు విస్ఫోటనాలు జరిగాయి, మొదటిది ఫ్యూజన్ బాంబు కాగా మిగిలినవన్నీ ఫిషన్ బాంబులు (అణువిచ్ఛిత్తి బాంబులు).[8] ఆపరేషన్ శక్తి పేరిట ఒక ప్యూజన్ బాంబు, రెండు ఫిషన్ బాంబుల విస్ఫోటనంతో పరీక్షలు 1998 మే 11న ప్రారంభమయ్యాయి.[8] 1998 మే 13న అదనంగా మరో రెండు ఫిషన్ బాంబులు కూడా విస్ఫోటనం చేశారు.[9] ఇది జరిగిన కొద్దిసేపటికి ఆనాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం ఒక పత్రికా సమావేశం నిర్వహించి భారతదేశం పూర్తి-స్థాయి అణ్వస్త్ర దేశమని ప్రకటించింది.[10] ఈ పరీక్షల కారణంగా తర్వాత జపాన్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు సహా పలు ప్రధాన దేశాలు భారతదేశంపై రకరకాల ఆంక్షలు విధించాయి.
ఈ పరీక్షలకు అనేక పేర్లు పెట్టారు. మొదట ఈ పరీక్షలను ఉమ్మడిగా ఆపరేషన్ శక్తి-98 అని పిలిచారు, ఐదు న్యూక్లియర్ బాంబులకు శక్తి-I నుంచి శక్తి-V వరకూ వరుసగా పేర్లు పెట్టారు. ఇటీవలి కాలంలో, ఆపరేషన్ మొత్తాన్ని కలిపి పోఖ్రాన్-II గానూ, 1974 నాటి విస్ఫోటనాన్ని పోఖ్రాన్-I గానూ వ్యవహరిస్తున్నారు.[11] భారత ప్రభుత్వం ఈ పరీక్షల్లో మొదటిది జరిగిన మే 11 తేదీని పోఖ్రాన్ II పరీక్షల జ్ఞాపకార్థం అధికారికంగా జాతీయ సాంకేతిక విజ్ఞాన దినోత్సవంగా ప్రకటిచింది.[12] ఈరోజున ప్రతీ సంవత్సరం భారత ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషిచేసిన వివిధ వ్యక్తులు, పరిశ్రమలుకు పురస్కారాలు అందిస్తుంది.[12]
మూలాలు
మార్చు- ↑ Overdorf, Jason (30 May 2010). "India's Nuclear Test 'Failure' Poses Threat To Obama's Nonproliferation Plans". Special report covered by Jason Overdorf. Global Post, 2010. Global Post. Retrieved 14 June 2015.
- ↑ "What Are the Real Yields of India's Tests?". Nuclearweaponarchive.org. Retrieved 31 January 2013.
- ↑ Bates, Crispin (2007). Subalterns and Raj: South Asia Since 1600. Routledge. p. 343. ISBN 978-0415214841.
- ↑ India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau, 1998. CNN India Bureau. Retrieved 14 June 2015.
- ↑ "Official press release by India". meadev.gov.in/. Ministry of External Affairs, 1998. Retrieved 14 June 2015.
- ↑ 6.0 6.1 "Press Statement by Dr. Anil Kakodkar and Dr. R. Chidambaram on Pokhran-II tests". Press Information Bureau, Government of India. 24 September 2009. Archived from the original on 24 October 2017.
- ↑ "We have an adequate scientific database for designing ... a credible nuclear deterrent". Frontline. 16. January 2–15, 1999. Archived from the original on 28 అక్టోబరు 2019. Retrieved 7 జూన్ 2020.
{{cite journal}}
: CS1 maint: date format (link) - ↑ 8.0 8.1 India Bureau (17 May 1998). "India releases pictures of nuclear tests". CNN India Bureau, 1998. CNN India Bureau. Retrieved 14 June 2015.
- ↑ "The nuclear politics: The 1998 Election". Nuclear weapon archives. Nuclear politics. Retrieved 16 January 2013.
- ↑ "The nuclear politics: The 1998 Election". Nuclear weapon archives. Nuclear politics. Retrieved 16 January 2013.
- ↑ "Why May 11 be celebrated as National Technology Day? Things you should know". Times of India.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ 12.0 12.1 Press Information Bureau (11 మే 2008). "National technology day celebrated". Department of Science and Technology. Archived from the original on 15 డిసెంబరు 2010. Retrieved 7 జూన్ 2020.