పోలియో
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పోలియో అని సాధారణంగా పిలవబడే 'పోలియోమైలెటిస్' (Poliomyelitis) అనే వ్యాధి వైరస్ ద్వారా కలిగి, నాడీ మండలాన్ని దెబ్బ తీసే ఒక వ్యాధి.
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} | |
---|---|---|
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} | |
DiseasesDB | 10209 | |
m:en:MedlinePlus | 001402 | |
m:en:eMedicine | {{{m:en:eMedicineSubj}}}/{{{m:en:eMedicineTopic}}} | |
MeSH | C02.182.600.700 |
పోలియో వ్యాధి
మార్చుపోలియో (Polio) ఒక రకమైన వైరస్ వల్ల వస్తుంది. ముఖ్యంగా రెండు విధాలుగా ఈ జబ్బు రావచ్చు. అశుభ్రమైన ఆహారం తినడంవల్ల ఈ వ్యాధి క్రిములు కడుపులో ప్రవేశించి వ్యాధిని కలిగిస్తాయి. ఇదొక రకం. మరొక విధం ఏమిటంటే - ఈ వ్యాధి క్రిములు గొంతులో ప్రవేశించడం మూలాన రోగి బాధపడతాడు. కడుపులో ప్రవేశించిన క్రిములు, రోగి మలంలో ఎక్కువగా బహిర్గతం అవుతాయి. అశుభ్రమైన ఆహార పానీయాదుల వల్ల చేతులూ కాళ్ళూ సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల ఈ వ్యాధి రావచ్చు. మలం మీద వాలిన ఈగలు, మళ్ళీ ఆహార పదార్థాలమీద వాలడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపించవచ్చు. గొంతులో చేరిన క్రిములు , రోగి దగ్గినప్పుడు లేక తుమ్మినప్పుడు ఇతరులకు వ్యాపిస్తాయి.
కడుపులోగాని, గొంతులోగాని ఈ వ్యాధి క్రిములు ఒక సారి ప్రవేశిస్తే, అధిక సంఖ్యలో వృద్దిపొందుతూ, క్రమంగా వ్యాధి బాగా ముదురుతుంది. అధిక సంఖ్యలో ఉత్పత్తి అయిన క్రిములు రక్తంలో కలసిపోతాయి. రక్తంలో కలిసిన క్రిములు ముఖ్యంగా నరాలలోని జీవకణాలను బాధిస్తాయి. అందువల్ల నాడి మండలం దెబ్బతిని కదల్చడానికి వీలులేకుండా కండరాలు బిగుసుకు పోతాయి.
లక్షణాలు
మార్చుఈ క్రిములు శరీరంలో ప్రవేశించి అసంఖ్యాకంగా వృద్ధిపొందడం మొట్ట మొదటి దశ. రెండవ దశలో నాడీ మండలానికి వ్యాధి ప్రాకుతుంది. దానివల్ల కండరాలు కదల్చడానికి వీలు లేకుండా బిగుసుకు పోవడం మూడోదశ.
ఈ క్రిములు గొంతులో ప్రవేశిస్తే, వెంటనే గొంతు రాచుక పోయి, శ్లేష్మం ఏర్పడుతుంది. రెండో దశలో తలనొప్పి, మెడ నొప్పి, కొన్ని సందర్భాలలో అంగ ప్రకంపనాలూ కూడా కన్పించ వచ్చు. మూడవ దశలో శ్వాసకోశం, కండరాలు బలహీన పడతాయి. గొంతు భాగం నోటి లోపలి కండరాల బలహీనం అవుతాయి. మెడ నిలబడకుండా వాలి పోవడం కూడా కద్దు.
కడుపులో అధిక సంఖ్యలో క్రిములు ప్రవేశిస్తే, మొట్ట మొదట విరోచనాలవుతాయి. క్రిములు రక్తంలో కలసిపోవడం వల్ల జ్వరం వస్తుంది. మూడో దశలో చేతులు, కాళ్ళు, వీపులోని కండరాలలో బలహీనత ఏర్పడుతుంది.
ఈ జబ్బు మామూలుగా ఒకటి, రెండేళ్ళ పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అందుచేత ఈ జబ్బును పసి పిల్లల వాతం అనడం కూడా కద్దు.
వ్యాధి నిరోధక శక్తి
మార్చుఒక విచిత్రం ఏమిటంటే , ఈ జబ్బు అశుభ్రవాతావరణంలో పుట్టి పెరిగిన పసిపిల్లలకి అనగా మురికి వాడలలోనూ, గుడిసెలలోనూ పుట్టి పెరిగిన పిల్లలకు సాధారణంగా రాదు. కాని మంచి పరిశుభ్రమైన వాతావరణంలో - ఆధునిక నగరాల్లో పుట్టి పెరిగే పిల్లలకే సులభంగా ఈ వ్యాధి సోకుతుంది. దీనికి కారణం ఏమిటో మీకు తెలుసా?.
అశుద్ధ వతావరణంలో పుట్టి పెరిగే పిల్లల కడుపులోకి ఈ క్రిములు ఆహార పానీయాదుల ద్వారా కొద్దికొద్దిగా ప్రవేశిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ పిల్లల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఏర్పడి క్రొత్తగావచ్చే క్రిముల్ని చంపి వేయడం జరుగుతుంది. అందుచేత ఈ పిల్లలకు పోలియోవ్యాధి సంక్రమించే అవకాశం చాలా తక్కువ.
పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లల పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. వాళ్ళ కడుపుల్లో వ్యాధి క్రిములు ప్రవేశించి నిరోధక శక్తి ఏర్పడే అవకాశం లేదుగదా! అందువల్ల చుట్టుపట్ల ఈ వ్యాధి క్రిములు బాహాటంగా వ్యాపించినప్పుడు, పిల్లల కడుపులోకి ఆ క్రిములు ప్రవేశిస్తాయి. అప్పుడు ఆ పిల్లలకు పోలియో జబ్బు వస్తుంది.
వ్యాధి తీవ్రత
మార్చుమొట్ట మొదటి 48 గంటల కాలం మిక్కిలి వేగంగానూ, ఆ తర్వాత 2, 3 రోజులపాటు కొంచెం మెల్లగానూ ఈ వ్యాధి వ్యాపిస్తుంది. నాడీ మండలం, కండరాలూ దెబ్బ తినడానికి కనీసం వారం రోజులు పడుతుంది. అప్పుడు జబ్బు తీవ్ర రూపం దాల్చినట్టు భావించాలి. బలహీనమైన కండరాలలో బాధ ఆరంభమవుతుంది. తర్వాత కండరాలు కుంచించుకుపోయి, బిగుసుకుపోతాయి. ఆ ప్రదేశాలను తాకితే విపరీతమైన నొప్పి కలుగుతుంది. తర్వాత రెండు మూడు రోజులలో ఆ కండరాలు బిగుసుకుపోవడం పోయి మళ్ళీ అవి సడలిపోతాయి.
మెడచుట్టూ వున్న కండరాల తాలుకు జీవకణాలూ, శ్వాసకోశాన్ని కదిల్చే కండరాల తాలుకు జీవకణాలూ దెబ్బ తిన్నప్పుడు మెడ వాలిపోవడం, శ్వాసకోశం , పనిచేయకపోవడం జరగవచ్చు. ఆహారం మ్రింగే ప్రదేశంలో వున్న కండరాలు దెబ్బ తిన్నప్పుడు మ్రింగడం కష్టమై, ఆహారం శ్వాసకోశంలోకి ప్రవేశించడం జరగవచ్చు. కొన్ని సందర్భాలలో శ్వాసకోసం పూర్తిగా మూసుకుపోవడం కూడ సంభవం! చివరికి శ్వాసకోశ కండరాలు బిగుసుకుపోయి, శ్వాసకోశం పని చేయడం నిలిచిపోవచ్చు.