పౌండ్రవర్ధన
పౌడ్రవర్ధన (బెంగాలీ;পুণ্ড্রবর্ধন) (బ పునరోబోర్ధను, పుల్వర్ధనుడు), భారత ఉపఖండంలోని పురాతన కాలంలో పాలించబడిన ఒక పురాతన రాజ్యం; పురాతనకాలంలో ఇది ఉత్తర బెంగాలు ప్రాంతంలో ఉంది.[1][2][3]
পুণ্ড্রবর্ধন Pundravardhana | |
---|---|
unknown (?~1280 BCE)–unknown (?~300 BCE) | |
రాజధాని | Mahasthangarh |
సామాన్య భాషలు | Sanskrit Pali |
మతం | Vedic Hinduism Buddhism |
ప్రభుత్వం | Monarchy |
చారిత్రిక కాలం | Bronze Age, Iron Age |
• స్థాపన | unknown (?~1280 BCE) |
• పతనం | unknown (?~300 BCE) |
Today part of | India (West Bengal) Bangladesh |
పేరువెనుక చరిత్ర
మార్చు‘పౌండ్ర’ అనే పదానికి సంబంధించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. ఒక సిద్ధాంతం ప్రకారం ‘పౌడ్ర’ అనే పదం దాని మూలానికి ‘పాండు’ అనే వ్యాధి కారణంగా ఉంది. ఆ వ్యాధితో ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న భూమి కనుక ఇది పౌండ్రాక్షేత్ర (పౌండ్ర భూమి) అని పిలుస్తారు. పుండా చెరకు జాతి. ఆ చెరకు జాతిని విస్తృతంగా పండించిన భూమిని పుండదేసా (పుండా భూమి) అంటారు. క్రీస్తుపూర్వం 8 వ -7 వ శతాబ్దానికి చెందిన ఐతేరేయ ఆర్యనకా వంటి తరువాత వేద గ్రంథాల ఆధారంగా పౌండ్ర అనేది సదానీరా నదికి (గండకి నది) తూర్పున నివసించిన ఆర్యేతర ప్రజల సమూహం. మహాభారతం కూడా ఇదే విధమైన సూచన చేసింది. సా.శ. 1 వ శతాబ్దంలో అశోకవదనలో ఈ భూమిని మొదటిసారి పౌడ్రద్రవర్ధనగా పేర్కొన్నారు. [4]
భౌగోళికం
మార్చు25°30′N 81°30′E / 25.50°N 81.50°E పౌడ్రవర్ధన పురాతన రాజధాని మహాస్థాన్గడు. ఇది బోగ్రా-రంగ్పూరు రహదారిమీద బోగ్రాకు ఉత్తరాన 11 కి.మీ (7 మైళ్ళు) దూరంలో ఉంది. ఫీడరు రహదారి (సిటాడెలు ప్రాకారాల తూర్పు వైపున 1.5 కిలోమీటర్ల దూరం నడుస్తుంది) జహాజ్ఘాటా, మ్యూజియం ఉన్న ప్రాంతానికి దారితీస్తుంది.[5]
అన్వేషణ
మార్చుమహాస్థాన్గడు వద్ద శిథిలాల ఆవిష్కరణ, గుర్తింపుకు అనేక మంది వ్యక్తులు సహకరించారు. 1808 లో మహాస్థన్గడును కనుగొని సందర్శించిన మొట్టమొదటి యూరోపియన్ ఎఫ్. బుకానన్ హామిల్టన్, సి.జె.ఒ.డోనెల్, ఇ.వి. వెస్ట్ మాకోట్, బావెరిడ్జ్ అనుసరించారు. ఈ స్థలాన్ని పౌడ్రడ్రవర్ధన రాజధానిగా గుర్తించిన మొదటి వ్యక్తి అలెగ్జాండరు కన్నింగ్హం. ఆయన 1889 లో ఈ ప్రదేశాన్ని సందర్శించాడు. [6]
పౌండ్ర ప్రజలు
మార్చువేద గ్రంథాలలో పౌండ్ర ప్రజల ప్రస్తావన ఉంది. మహాభారతంలోని దిగ్విజయ విభాగం వారిని మొంగైరుకు తూర్పున ఉన్నారని సూచిస్తూ, కోసీనది తీరంలో ఒక యువరాజు పాలించినట్లు సూచిస్తుంది.[7]
గుప్తుల కాలం పురాణకథనాలు, ప్రాచీన చైనా రచయితలు పౌడ్రడ్రవర్ధన ఉత్తర బెంగాలులో ఉన్నట్లు పేర్కొన్నారు.[3]
పౌరాణిక కథనాలు
మార్చుఅసుర రాజు బాలికి రాణి ద్వారా అంగా, వంగా, సుహ్మా, పుంద్ర, కళింగ అనే ఐదుగురు కుమారులు కలిగారు. వారి పేరు మీద వారు 5 రాజ్యాలను స్థాపించారు. పౌడ్ర, వంగల భూములు శక్తివంతమైన రాజుల స్థానాలు మాత్రమే కాక బౌద్ధమతం, జైన మతం, హిందూ మతం వర్ధిల్లిన కేంద్రాలుగా కూడా మారాయి. ఇది క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దం, సా.శ. 4 వ శతాబ్దం మధ్య ఆర్యుల విస్తరణ మొదటి దశను సూచిస్తుంది.[8]
సామ్రాజ్యాలు
మార్చుపురాతన కాలం
మార్చుపౌండ్రరవర్ధన భూభాగంలో ఉన్న పౌండ్రనగర లేదా పౌండ్రవర్ధనపుర, శిథిలాలు బంగ్లాదేశులోని బోగ్రా జిల్లాలోని కరాటోయా నదీ తీరాన ఉన్నాయి.[3]
పౌడ్రప్రజలు వారి ఆవాసాలు తరువాతి వేద సాహిత్యంలో అపవిత్రమైనవిగా భావించబడ్డాయి. ఎందుకంటే అవి వేద సంస్కృతికి దూరంగా జీవనవిధానం ఆచరించారు.[2] క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దం బ్రహ్మీ లిపిలో ప్రాకృతంలో వ్రాసిన ఒక శాసనం పురాతన ప్రదేశమైన మహాస్థాన్గడు వద్ద కనుగొనబడింది. పౌడ్రనగరం ఆ ప్రాంతంలోని మగధ వంటి ఆర్య సంస్కృతిలోని అనేక అంశాలను కలిగి ఉన్నట్లు సూచిస్తుంది.[9] అశోకచక్రవర్తికి ముందు ఉత్తర బెంగాలులో, బెంగాలులోని ఇతర ప్రాంతాలలో బౌద్ధమతం ప్రవేశపెట్టబడింది. క్రీస్తుపూర్వం 2 వ శతాబ్దానికి చెందిన సాంచి వద్ద బౌద్ధ స్థూపం రెయిలింగు మీద రెండు శాసనాలు సూచించిన పునావధన నివాసులు ఇద్దరి బహుమతులను నమోదు చేశాయి. ఇందులో సూచించబడిన పునావధన నిస్సందేహంగా పౌడ్రవర్ధనను సూచిస్తుంది.[10] ఆర్య-బ్రాహ్మణ సంస్కృతి ప్రభావం బెంగాలు, ఉత్తర భారతదేశం అంతటా వ్యాపించిన సమయంలో బెంగాలులో నివసిస్తున్న వివిధ ఆర్యేతర ప్రజలు శక్తివంతమైనవారుగా ఉన్నారు. అందువలన ఆర్య-బ్రాహ్మణ సంస్కృతి వ్యాప్తి తీవ్రంగా నిరోధించబడి సమీకరణకు చాలా సమయం పట్టింది.[11]
పురాతన భారతదేశం అంతటా విస్తరించి ఉన్న పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన మౌర్యులు రాజధాని పాటలీపుత్ర (ఆధునిక పాట్నా) వద్ద ఉంది. ఇది పౌండ్రనగరానికి సమీపంలో లేదు. అశోకవదనం రచన ఆధారంగా గౌతమ బుద్ధుడు నిర్గ్రాంత జ్ఞాతిపుత్ర పాదాల వద్ద నమస్కరిస్తున్నట్లు చూపించే చిత్రాన్ని గీసిన తరువాత మౌర్య సామ్రాజ్యాన్ని పాలిస్తున్న అశోకచక్రవర్తి పౌడ్రరవర్ధనలోని అజీవికలందరిని చంపమని ఒక ఉత్తర్వు జారీ చేశాడు. ఈ ఉత్తర్వు ఫలితంగా అజివికశాఖకు అనుచరులు సుమారు 18,000 మంది ఉరితీయబడ్డారు.[12][13] క్రీస్తుపూర్వం 185 లో మౌర్య పాలన ముగిసిన తరువాత సా.శ. 4 వ శతాబ్దంలో గుప్తుల రాక వరకు చిన్న రాజ్యాలు, గందరగోళం ఏర్పడింది. గుప్తా కాలం నాటి రాగి పలకలు వారి తూర్పు విభాగాన్ని పుంద్రవర్ధన భుక్తి (భుక్తి ఒక ప్రాదేశిక విభాగం) గా పేర్కొన్నాయి. గుప్తసామ్రాజ్యం క్రీస్తుశకం 6 వ శతాబ్దంలో క్షీణతను ఎదుర్కొంది. ఈ ప్రాంతం 567-79లో టిబెట్టు రాజు సంబాట్సనుతో యుద్ధం చేయడం కారణంగా పతనమై ఉండవచ్చు. తదనంతరం బెంగాలు రెండు సామ్రాజ్యాలుగా (తూర్పున సమతతా, పశ్చిమాన గౌడ) విభజించబడింది.[1] కొన్ని పురాతన రికార్డులలో పౌడ్రవర్ధన గౌడలో భాగమైనట్లు ప్రస్తావించబడింది.[14] ఇది సా.శ. 7 వ శతాబ్దంలో శశాంక రాజ్యంలో భాగంగా ఉంది.[15]
క్షీణత
మార్చుచైనా సన్యాసి, యాత్రికుడు జువాన్జాంగు (హ్యూయెన్ త్సాంగ్) 639-45లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రా రికార్డులలో పౌడ్రవర్ధన రాజును గురించి ప్రస్తావించలేదు.[1] ఆయన కాజంగళ నుండి కామరూప వరకు పుంద్రవర్ధన మీదుగా ప్రయాణించాడు. [2]
జువాన్జాంగ్ పౌండ్రవర్ధనను ఈ క్రింది విధంగా ప్రస్తావించారు:
అక్కడ ఇరవై బౌద్ధ మఠాలు, 3,000 మందికి పైగా అనుచరులు ఉన్నారు. వీరిచే ‘గొప్ప, చిన్న వాహనాలలో అనుసరించారు; దేవ-దేవాలయాల సంఖ్య 100 వివిధ వర్గాల అనుచరులు పెల్-మెల్ నివసించారు. దిగంబర నిర్గ్రాంతలు చాలా మంది ఉన్నారు.[16]
7 వ -8 వ శతాబ్దంలో పౌడ్రవర్ధన గొప్పతనాన్ని కోల్పోయిందని సూచించబడింది. మహాస్థాన్గడు పురావస్తు త్రవ్వకాలు సా.శ. 12 వ శతాబ్దానికి చెందిన పాలల కాలంలో నిర్మించబడిన కోటగోడ వాడకాన్ని సూచిస్తున్నాయి. అయినప్పటికీ అవి శక్తి కేంద్రంగా లేవు.[1] ఇది చంద్రవంశ రాజుల పాలితప్రాంతంలో భాగంగా ఉంది.[17] భోజవర్మ సామ్రాజ్యంలో భాగంగా ఉంది.[18] 13 వ శతాబ్దం నుండి ప్రారంభ ముస్లిం పాలకులు ఈ భూభాగాన్ని ఉపయోగించుకుని ఉండవచ్చు. కాని అప్పటికి అది అంత ముఖ్యమైనదిగా భావించబడలేదు.[1] క్రమంగా దాని గుర్తింపు క్షీణించి ఇది పరిసర ప్రాంతంలో భాగమైంది. ప్రధాన నగరం లేదా రాజధాని పుంద్రవర్ధన, పుంద్రవర్ధనగరు లేదా పౌంద్రవర్ధనపూరు కూడా తన గుర్తింపును కోల్పోయి మహాస్థాను అని పిలువబడింది.
ఇస్లాం విస్తరణ
మార్చుమహాస్తానులో ఉన్న ముస్లిమేతర ప్రజలలో ఇస్లాంను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో మహాస్థాను ప్రాంతానికి వచ్చిన రాజ వంశానికి చెందిన షా సుల్తాను బాల్కి మహిసావరు మజారు (పవిత్ర సమాధి) ఉంది. ఆయన ఒక యుద్ధంలో స్థానిక రాజును ఓడించి ఆ ప్రాంత ప్రజలను ఇస్లాం మతంలోకి మార్చి అక్కడ స్థిరపడ్డాడు.[5][19]
విస్తరణ
మార్చుపౌండ్రవర్ధనలో ప్రస్తుత రాజ్షాహి, బోగ్రా, పబ్నా (బంగ్లాదేశులో), దీనజ్పూరు (భారతదేశం, బంగ్లాదేశులో) కలిపిన ప్రాంతం భాగంగా ఉన్నాయి. బుధగుప్తుడి కాలం నాటి దామోదర్పూరు తామ్రఫలక శాసనం ఆధారంగా (సా.శ. 476-94) పౌడ్రరవర్ధన ఉత్తర సరిహద్దున హిమాలయాలు ఉన్నాయి. పంద్రావర్ధన యొక్క పరిపాలనా, ప్రాదేశిక అధికార పరిధి పాల కాలంలో విస్తరించింది. పాలా, చంద్ర, సేన కాలాలలో పౌడ్రవర్ధనలో ఉత్తర బెంగాలు భౌగోళిక సరిహద్దుల వెలుపలి ప్రాంతాలు ఉన్నాయి.[2] ఇది వారేంద్రీ లేదా వారేంద్రీ-మండలా పౌడ్రవర్ధన మహానగర కేంద్రంగా ఉంది. దీనికి అనేక శాసనాలు మద్దతు ఇస్తున్నాయి.[3] ప్రధానంగా 10 వ శతాబ్దంలో పౌడ్రరవర్ధన క్షీణించిన సమయంలో వరేంద్ర లేదా వారేంద్ర ప్రస్తావనను ఉన్నట్లు కనుగొన్నారు.[20]
రాఖల్దాసు బండియోపాధ్యాయ ఇలా అంటాడు, “ఉత్తర బెంగాలు మాత్రమే పౌడ్రవర్ధన భూభాగం కాదు. మనం ఇప్పుడు తూర్పు బెంగాలు అని పిలుస్తున్నది కూడా పుంద్రవర్ధన లేదా పుంద్రవర్ధన భూభాగంలో ఉంది. లక్ష్మణ సేన కుమారుడు కేశవ సేన పాలనలో ఒక తామ్రఫలక శాసనంలో అనగా 12 వ శతాబ్దంలో పుంద్రవర్ధన లేదా పుంద్రవర్ధన భూభాగంలో బిక్రాంపూరు ప్రాంతాలు ఉన్నాయి. ”[21] దక్షిణ పౌడ్రవర్ధన సుందర్బను ప్రాంతాలకు విస్తరించింది.[22]
ఈ ప్రాంతంలోని అనేక జలమార్గాలు రవాణాకు ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. పురాతన సాహిత్యంలో కొన్ని రహదారులకు సూచనలు ఉన్నాయి. సోమదేవుని కథాసరిత్సాగరలో పౌడ్రరవర్ధన నుండి పాటలీపుత్ర వరకు ఉన్న రహదారి గురించి ప్రస్తావించబడింది. జువాన్జాంగు కాజంగళ నుండి పౌండ్రవర్ధన వరకు ప్రయాణించి ఆ తరువాత విశాలమైన నదిని దాటి కామరూపానికి వెళ్ళాడు. పౌడ్రవర్ధన నుండి మిథిలకు వెళ్లే రహదారి గురించి సూచనలు ఉన్నాయి. తరువాత పాటలీపుత్ర, బుద్ధ గయ గుండా వారణాసి, అయోధ్య వరకు వెళుతున్నాయి. చివరకు సింధు, గుజరాతు లకు వెళతాయి. ఇది ఒక ప్రధాన వాణిజ్య మార్గంగా ఉండవచ్చని భావిస్తున్నారు.[23]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 Hossain, Md. Mosharraf, Mahasthan: Anecdote to History, 2006, pp. 69-73, Dibyaprakash, 38/2 ka Bangla Bazar, Dhaka, ISBN 984-483-245-4
- ↑ 2.0 2.1 2.2 2.3 Ghosh, Suchandra. "Pundravardhana". Banglapedia. Asiatic Society of Bangladesh. Retrieved 10 నవంబరు 2007.
- ↑ 3.0 3.1 3.2 3.3 Majumdar, Dr. R.C., History of Ancient Bengal, First published 1971, Reprint 2005, p. 10, Tulshi Prakashani, Kolkata, ISBN 81-89118-01-3.
- ↑ Ashokavadana
- ↑ 5.0 5.1 Hossain, Md. Mosharraf, pp. 14-15.
- ↑ Hossain, Md. Mosharraf, pp. 16-19
- ↑ In earlier days the Kosi used to flow through North Bengal. See Karatoya River for details
- ↑ Majumdar, Dr. R.C., p. 25
- ↑ Majumdar, Dr. R.C., p. 27
- ↑ Majumdar, Dr. R.C., p. 454
- ↑ Roy, Niharranjan, Bangalir Itihas, Adi Parba, (in Bengali), first published 1972, reprint 2005, pp. 216-217, Dey’s Publishing, 13 Bankim Chatterjee Street, Kolkata, ISBN 81-7079-270-3
- ↑ John S. Strong (1989). The Legend of King Aśoka: A Study and Translation of the Aśokāvadāna. Motilal Banarsidass Publ. p. 232. ISBN 978-81-208-0616-0. Retrieved 30 అక్టోబరు 2012.
- ↑ Beni Madhab Barua (5 మే 2010). The Ajivikas. General Books. pp. 68–69. ISBN 978-1-152-74433-2. Retrieved 30 అక్టోబరు 2012.
- ↑ Bandopadhyay, Rakhaldas, Bangalar Itihas, (in Bengali), first published 1928, revised edition 1971, vol I, p 101, Nababharat Publishers, 72 Mahatma Gandhi Road, Kolkata.
- ↑ Majumdar, Dr. R.C., p. 63
- ↑ Majumdar, Dr. R.C., p. 453
- ↑ Bandopadhyay, Rakhaldas, p. 181
- ↑ Bandopadhyay, Rakhaldas, p. 230
- ↑ Khokon, Leaquat Hossain, 64 Jela Bhraman, 2007, p.129, Anindya Prokash, Dhaka.
- ↑ Roy, Niharranjan, p. 116.
- ↑ Bandopadhyay, Rakhaldas, p. 49
- ↑ Roy, Niharranjan, p.85,
- ↑ Roy, Niharranjan, pp. 91-93