ప్రజా భవిష్య నిధి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సంఘటిత రంగాలలోని కార్మికులకు ఉద్యోగ భవిష్య నిధి ఉన్నట్టే, అసంఘటిత రంగ కార్మికులకు, సాధారణ ప్రజలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ సదుపాయం ఉంది. కాకపోతే ఇందులో ఉద్యోగ భవిష్య నిధి (EPF) మాదిరి యజమానుల చెల్లింపు ఉండదు, కేవలం ఖాతాదారుడు మాత్రమే చెల్లించాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఖాతా జాతీయ బ్యాంకులలో కానీ, దగ్గరలోని పోస్ట్ ఆఫీసులో కానీ తెరవవచ్చు. ఇందులో జమ చేసిన మొత్తంపై కేంద్రప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీ ప్రకటిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.70 %గా ఉంది. పిపిఎఫ్ లో పొదుపు చేసిన మొత్తానికి గరిష్ఠంగా ఒక ఆర్థిక సంవత్సారానికి రూ. 1,50,000/- వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. మొదటగా పిపిఎఫ్ ఖాతా 15 సంవత్సరాలకు తెరవబడుతుంది, ఆ తరువాత ఒకటి లేదా అంతకంటే ఎక్కవ విడతల్లో, విడతకు 5 సంవత్సరాల చొప్పున ఖాతాను పొడిగించుకోవచ్చు. పిపిఎఫ్ ఖాతాలోని మొత్తంపై వచ్చే వడ్డీ మీద ఎటువంటి పన్ను ఉండదు. అల్లాగే ఖాతా మెచ్యూర్ అయిన తరువాత వచ్చే మొత్తంపై సంపద పన్ను (wealth Tax) ఉంది. ఒక సంవత్సరంలో ఒక పిపిఎఫ్ ఖాతాలో కనిష్ఠంగా రూ.500 జమ చేయాల్సివుంటుంది. అలాగే గరిష్ఠంగా రూ. 1,50,000 వరకు జమ చేయవచ్చు. సంవత్సరంలో జమ ఒకేసారి పెద్దమొత్తంలో చేయవచ్చు లేదా 12 వాయిదాలలో చేయవచ్చు. ఖాతా తెరచిన 3 సంవత్సరాల తరువాత రుణ సదుపాయం లభిస్తుంది. పిపిఎఫ్ ఖాతాను ఒక పోస్ట్ ఆఫీసు నుండి మరొక పోస్ట్ ఆఫీసుకు లేదా ఒక బ్యాంకు శాఖ నుండి మరో శాఖకు మార్చుకోవచ్చ్చు. ఒక పిపిఎఫ్ ఖాతా తెరవడానికి కనీస జమ రూ. 100/-. తరువాత ప్రతీ సంవత్సరం రూ. 500 తక్కువ ఖాతాలో జమ చేయాలి. పిపిఎఫ్ ఖాతా పిల్లల పేర (మైనర్స్) కూడా తెరవవచ్చు.
ఉద్యోగుల భవిష్య నిధి, ప్రజా భవిష్య నిధి మధ్య వ్యత్యాసాలు
మార్చుఅంశం | ఉద్యోగుల భవిష్యనిధి | ప్రజా భవిష్యనిధి |
---|---|---|
చట్టం | ఉద్యోగుల భవిష్యనిధి, ఇతరత్రా అంశాల చట్టం -1952 | ప్రజా భవిష్యనిధి పథకం -1968 |
సభ్యత్వం | సంఘటిత రంగాలలోని కార్మికులు, ఉద్యోగులు. 20 లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు కలిగిన సంస్థలలో రూ.15,000 అంతకంటే తక్కువ వేతనం కలవారు. | పౌరులు ఎవరైనా |
ఖాతా ఎక్కడ తెరవాలి | పనిచేసే సంస్థ/ కర్మాగారం ఏ ఇపిఎఫ్ఓ ఆఫీసు పరిధిలో వస్తుందో, ఆ ఆఫీసులో | ఏదైనా బ్యాంకు శాఖ లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీసు |
చెల్లింపులు / జమ | యజమాని, సభ్యుడు | కేవలం ఖాతాదారుడు |
కనీస జమ | వేతనంలో 12% (యజమాని, ఉద్యోగస్తుడు ) | రూ. 500 |
గరిష్ఠ జమ | లేదు | రూ. 1,50,000 |
వడ్డీపై పన్ను | లేదు | లేదు |
రుణ సదుపాయం | కలదు | కలదు |
నామినేషన్ సదుపాయమ్ | కలదు | కలదు |
వడ్డీ శాతం | 8.75 | 8.70 |
ఇతర సదుపాయాలు | పించను, జీవిత బీమా . భావిషయనిధిపై వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం కతాయింపు (compound) చెందుతుంది. | ఖాతా తెరచిన ఏడవ సంవత్సరం నుండి పార్షిక ఉపసంహరణకు అనుమతి. భావిషయనిధిపై వచ్చే వడ్డీ ప్రతి సంవత్సరం కతాయింపు (compound) చెందుతుంది. |