ప్రణయ్ రెడ్డి వంగా

ప్రణయ్ రెడ్డి వంగా భారతీయ సినిమా నిర్మాత. ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందినవాడు. ఆయన తెలుగు భాషలో బ్లాక్ బస్టర్ చలనచిత్రమైన అర్జున్ రెడ్డి ను 2017లో నిర్మించాడు.[1]

Pranay Reddy Vanga
దస్త్రం:PranayRVanga.jpg
జననం (1979-01-12) 1979 జనవరి 12 (వయసు 45)
జాతీయతNaturalized citizen of United States
వృత్తిETL Engineer, Telugu Film Producer
క్రియాశీల సంవత్సరాలు2016–present
జీవిత భాగస్వామిShwetha Pranay Reddy Vanga
పిల్లలుRishik Nandan Reddy, Vibhum Smaran Reddy
తల్లిదండ్రులుPrabhakar Reddy Vanga, Sujatha Vanga

ప్రారంభ జీవితం

మార్చు

ఆయన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో జన్మించాడు. ఆయన తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని ప్లాటినం జూబ్లీ హైస్కూలు లో పూర్తిచేసాడు. ఆయన సోదరుడు సందీప్ రెడ్డి వంగా 2017లో నిర్మితమైన అర్జున్ రెడ్డి సినిమాకు దర్శకత్వం వహించాడు.

కళాశాల జీవితం

మార్చు

ఆయన కర్ణాటక లోని భల్కీలో ఉన్న గుల్బర్గా విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టాను పొందాడు. ఉన్నత చదువులకు 2001లో ఆయన ఐరోపా వెళ్ళాడు. అచటా స్వీడన్ లోని డలర్నా విశ్వవిద్యాలయం నుండి 2003లో మెకానికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. ఆయన స్విర్జర్లాండ్ లోణి బెర్న్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజిమెంటు డిగ్ర్రీని పొందాడు.

జీవిత విశేషాలు

మార్చు

ప్రణయ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నివసిస్తున్నాడు. ఆయన అమెరికాలోని కాపిటల్ ఒన్, కైసెర్ పెర్మనెంటె, కోగ్నిజంట్ కంపెనీలకు ఇ.టి.ఎల్ కన్సల్టంట్ గా పనిచేస్తున్నాడు. ఆయన వర్జీనియా లో గత 13 యేళ్ల నుండి నివసిస్తున్నారు.

అర్జున్ రెడ్డి

మార్చు

ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకురాకపోవడంతో తన తండ్రితో కలసి ఆయన భద్రకాళి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ఏర్పాటుచేసి, ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఆగస్టు 25, 2017న విడుదలయింది. ఈ చిత్రం హిట్ కావడంతో ప్రణయ్ నిర్మాతగా గుర్తింపు పొందాడు.

వివాదాలు

మార్చు

ఈ సినిమాలో పొగత్రాగడం, డ్రగ్స్ సేవించడం వంటి అంశాల వల్ల సెన్సార్ బోర్డులో యిబ్బందులు వచ్చాయి. ఈ చిత్రం పోస్టర్ కూడా ముద్దు సన్నివేశంతో కూడుకొన్నందున యిబ్బందులెదురైనా తెలంగాన ఫిలిం చాంబర్ చే ఆమోదించబడినది.

పునర్నిర్మాణం

మార్చు

ఈ చిత్రం కన్నడం, హిందీ, తమిళ భాషలలో పునర్నిర్మించబడినది.

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన శ్వేతను వివాహమాడాడు. ఆయనకు రిషిక్ నందన్ రెడ్డి వంగా (జ.2009), విభుం స్మారణ్ వంగా ( జ.2011) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.

మూలాలు

మార్చు
  1. Aditya Music (21 August 2017), Arjun Reddy Audio Jukebox, retrieved 22 August 2017

ఆధారాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు