ప్రణవం (2021 సినిమా)

ప్ర‌ణ‌వం 2021లో తెలుగులో విడుదలైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్ బ్యానర్ పై తనూజ.ఎస్‌ నిర్మించిన ఈ సినిమాకు కుమార్‌ జి. దర్శకత్వం వహించాడు.[1] శ్రీమంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రీ అయ్యర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 5 ఫిబ్రవరి 2021న విడుదలైంది.[2][3]

ప్రణవం
దర్శకత్వంకుమార్‌ జి.
రచనసచిన్ కుందాల్కర్
నిర్మాతతనూజ.ఎస్‌
తారాగణంశ్రీమంగం
శశాంక్
అవంతిక హరి నల్వా
గాయత్రీ అయ్యర్‌
ఛాయాగ్రహణంమార్గల్‌ డేవిడ్
కూర్పుసంతోష్‌
సంగీతంప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
నిర్మాణ
సంస్థ
చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
విడుదల తేదీ
5 ఫిబ్రవరి 2021
దేశం భారతదేశం
భాషతెలుగు

కార్తిక్ (శ్రీ మంగం) , జాను ( అవంతిక‌) మొదటి చూపులోనే ఒక‌రినొక‌రు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. సంతోషంగా సాగిపోతున్న వీరి జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి ఎంట‌ర్ అవుతుంది. ఇంత‌లో జాను మిస్స‌వుతుంది. జాను మిస్సింగ్ కేసు భ‌ర్త కార్తిక్ పైకి వ‌స్తుంది. అస‌లు వీరి మ‌ధ్య‌లోకి వ‌చ్చిన ఆ అమ్మాయి ఎవ‌రు? ఆమెకు కార్తిక్ కి సంబంధం ఏంటి? జాను ఎలా మిస్స‌యింది? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులు

మార్చు
  • శ్రీ మంగం
  • శశాంక్
  • అవంతిక హరి నల్వా
  • గాయత్రీ అయ్యర్‌
  • జెమినీ సురేష్
  • సత్య సమీరా
  • నవీన
  • జబర్దస్త్ దొరబాబు
  • జబర్దస్త్‌ బాబి

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: చ‌రిత అండ్ గౌత‌మ్ ప్రొడక్ష‌న్స్
  • నిర్మాత: తనూజ.ఎస్‌
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ జి
  • సంగీతం: ప‌ద్మ‌నావ్ భ‌ర‌ద్వాజ్‌
  • పాటలు: కరుణ కుమార్, సిహెచ్‌ విజయ్‌కుమార్‌, రామాంజనేయులు
  • సినిమాటోగ్రఫీ: మార్గల్‌ డేవిడ్
  • ఎడిటర్‌: సంతోష్‌
  • ఫైట్స్‌: దేవరాజ్‌
  • సహా నిర్మాతలు: వైశాలి, అనుదీప్‌
  • కొరియోగ్రాఫర్‌:అజయ్
  • కో-డైరక్టర్‌: శ్రావణ్ నల్లూరి

మూలాలు

మార్చు
  1. Sakshi (12 January 2021). "ప్రేమ ప్రణవం". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  2. Andhrajyothy (25 January 2021). "ఫిబ్ర‌వ‌రి 5న `ప్ర‌ణవం`". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  3. The Times of India (5 February 2021). "Pranavam Movie". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.
  4. Santhosam (5 February 2021). "ప్రణవం రివ్యూ". Archived from the original on 3 December 2021. Retrieved 3 December 2021.

బయటి లింకులు

మార్చు