భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 82:
|}
 
[[1951]]లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్స్టాండర్డ్స్ర రాం ప్రసాద్ ([[బి.ఐ.ఎస్.]]) జాతీయపతాకానికి కొన్ని నిర్దేశకాలను రూపొందించింది. ఈ నిర్దేశకాలను మనదేశంలో అమల్లోకి వచ్చిన [[మెట్రిక్]] మానానికి సరిపోయేటట్లు [[1964]]లో ఒకసారి, [[1968]] [[ఆగష్టు 17]]న మరొకసారి సవరించారు. పతాక పరిమాణం, రంగులు, వాడే బట్టకు వర్తించే ఈ నిర్దేశకాలు చాలా ఖచ్చితమైనవి. వీటి ఉల్లంఘన శిక్షార్హమైన నేరం.
 
పతాకం తయారీలో ''ఖాదీ'' లేక చేనేత వస్త్రాన్ని మాత్రమే వాడాలి. ఖాదీలో నూలు, పట్టు, ఉన్ని బట్టలను మాత్రమే వాడుతారు. జెండాలో రెండు రకాల ఖాదీని వాడుతారు: జెండా రూపానికి ఖాదీ-బంటింగ్, జెండాను కఱ్ఱకు తగిలించడానికి అవసరమయ్యే బట్టకు ఖాదీ-డక్. ఖాదీ-డక్ ప్రత్యేకమైన beige(పసుపు పచ్చ-బ్రౌన్ కలిసిన రంగు) రంగులో ఉంటుంది. సాంప్రదాయిక నేతలో రెండుపోగులను వాడేచోట ఖాదీ-డక్ లో మూడుపోగులను వాడుతారు. ఇది చాలా అరుదైన నేత. దేశం మొత్తమ్మీద ఈ రకమైన నేతపని తెలిసినవాళ్ళు పదిమందికంటే ఎక్కువ లేరు. ఇంకా చదరపు సెంటీమీటరుకు ఖచ్చితంగా 150 పోగులు ఉండాలని, కుట్టుకు నాలుగు పోగులు ఉండాలని,<!--{{inote|ref to deccan newspaper|deccan}}--> ఒక చదరపు అడుగు గుడ్డ ఖచ్చితంగా 205 గ్రాములుండాలని <!--{{inote|ref to rediff.com|rediff}}--> నిర్దేశకాలున్నాయి.
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు