మసాలా: కూర్పుల మధ్య తేడాలు

సంగీతసంబంధ విశేషాలను జతచేసాను
చి Wikipedia python library
పంక్తి 25:
ఇలాంటి విచిత్ర స్వభావం కల బలరాంకి తన చెల్లెలు మీనాక్షి (షాజన్ పదాంసి) అంటే ప్రాణం. మీనాక్షి హైదరాబాదులో చదువుకుంటూ ఉండే ఓ మామూలు అమ్మాయి. ఐతే బలరాం బావమరిది, తన ముఖ్యవైరి, భీమరాజపురం అభివృధ్ధికి అడ్డుపుల్లలు వేస్తూ ఎప్పుడూ ఓడిపోయే నాగరాజు ([[పోసాని కృష్ణ మురళి]]) మీనాక్షిని ఎలాగైనా పెళ్ళిచేసుకోవాలని కుట్ర పన్నుతుంటాడు. కానీ ఈ విషయంలో కూడా ఎప్పుడూ బలరాం చేతిలో ఓడిపోతూనే ఉంటాడు. ఇదంతా నారాయణ సానియాకు అర్థమయ్యేలా ప్రయాణ సమయంలో చెప్తాడు. భీమరాజపురంలో నారాయణ కొడుకు సూరి ([[ఆలీ (నటుడు)|ఆలీ]]) మసాలా డ్రామా కంపెనీ నడుపుతూ దాని కళ శాఖకు సంబంధించిన బాధ్యతలను సానియాకి అప్పగిస్తాడు. రహ్మాన్, సూరి, తన స్నేహితులు మూసి ఉన్న గుడి దగ్గర కాలువ వద్ద కాలం వెళ్ళదీస్తున్నప్పుడు ఓ పిల్లాడు ఆ గుడిలోని కోనేటిలో పడిపోతాడు. రహ్మాన్ గుడి తలుపులను బద్దలుకొట్టి ఆ పిల్లాడిని కాపాడగా నాగరాజు మనుషులతో గొడవ పడాల్సి వస్తుంది. ఇంతలో బలరాం పోలీసులతో కలిసి అక్కడికి చేరుకోవడంతో నాగరాజు తన మనుషులతో పరారవుతాడు. బలరాం రహ్మాన్, సూరి, నారాయణలను తన మహలుకి పిలిపిస్తాడు. అక్కడ రహ్మాన్ సూరి సలహా మీద తన పేరు రాము అని చెప్తాడు. తన ధైర్యసాహసాలకు మెచ్చి, నారాయణ సిఫార్సు మేరన రాముకి సూపర్వైసర్ ఉద్యోగమిచ్చి నెలకి 40 వేల జీతం కూడా ఇస్తానంటాడు.
 
రాము తన నిజాయితితో, పనిలో తన నైపుణ్యంతో బలరాం మనసును గెలుచుకుంటాడు. అయితే రాములో ఏదో తేడా ఉందనే శంకతో మెదులుతుంటాడు బలరాం కుడిభుజంగా వ్యవహరించే ఎద్దుల కామేశ్వరరావు లేక ఎద్దులోడు ([[జయప్రకాశ్ రెడ్డి]]), ఎద్దు అని కూడా పిలవబడే ఎద్దులోడు ఒక్క రహ్మాన్ విషయంలోనే కాదు దేన్నైన అనుమానిస్తుంటాడు. మహా సందేహ ప్రాణి. ఓ నాడు మీనాక్షి పుట్టినరోజున తనని కల్లుద్దామని తను చదివే కాలేజికి వెళ్తారు బలరాం, రాము, ఎద్దులోడు. అక్కడ తన అన్న మొరటుతనాన్ని భరించలేక మీనాక్షి తన కోసం బహుమతిగా తెచ్చిన ఖరు నడుపుతూ భీమరాజపురానికి బయలుదేరుతుంది. కారు పంచర్ అయ్యి ఆగిపోయాక తను నాగరాజు ఉండే ఊరికి కొంత దూరంలో ఉందని తెలుసుకుంటుంది. అప్పుడే నాగరాజు తనని కిడ్నాప్ చేసి బలరామ్ని బెదిరిస్తాడు. అప్పుదు రాము, బలరాం కలిసి వాడి మనుషులను చావబాది మీనాక్షితో కలిసి ఇంటికి చేరుకుంటారు. ఆ రోజునే బలరాం రాముని తన నమ్మిన బంటు అని ప్రకటించి తనతో కలిసి భోజనం చెయ్యమని అడుగుతాడు. ఐతే రాము ముస్లిం అవ్వడం చేత, అది రంజాన్ పవిత్ర మాసం అవ్వడం చేత భోజనం చెయ్యలేని పరిస్తితిపరిస్థితి కనుక బలరాం దగ్గర తను అమ్మ కోసం ఉపవాసమున్నానని అబద్ధం చెప్తాడు. రాము మీద అభిమానంతో రేపు మీ ఇంటికి వచ్చి మీ అమ్మని కలుస్తానని బలరాం సెలవిస్తాడు. దానితో రాముగా తన ముందు తిరుగుతున్న రహ్మాన్ సూరిని ఏదైనా ఉపాయం చెప్పమంటే వాల్లిద్దరూ పక్కూరిలో రికార్డింగ్ డన్సులు వేసే చింతామణి([[కోవై సరళ]])ని రాము తల్లిగా నటించమని అడుగుతారు. అప్పుడు తన వయసు చాలా తక్కువని, అలాంటి ముసలి పాత్రలు చెయ్యలేనని చెప్పడంతో రహ్మాన్, సూరిలు వెళ్లిపోతారు. మరుసటి ఉదయం రహ్మాన్, సూరి, తమ స్నేహితులు, నారాయణలు తెగ తెన్షన్ పడుతుంటారు.
 
ఇంతలో బలరాం రానే వస్తాడు. ఎప్పటి నుంచో రాముపై అనుమానంగా ఉన్న ఎద్దులోడు ఆ రోజు తన తల్లి ఇంట్లో లేకపోవడంతో రాము ఓ మోసగాడు అన్న వాదన వినిపించాలనుకునేలోపే చింతామణి ముసలావిడ వేషం వేసుకుని తను రాము తల్లి అంజలి దేవినని అబద్ధమాడి తమ నాటకాన్ని సుఖాంతం చేస్తుంది. అంతా బాగానే ఉందనుకున్న వేళ సూరి స్నేహితుడొకడు మరో రంగస్థల నటి([[గీతాంజలి (నటి)|గీతాంజలి]])ని తల్లి వేషంలో పంపుతాడు. సమయస్పూర్థితో రాము ఆవిడ మా పెద్దమ్మ అని, తనే నన్ను పెంచిందని చెప్తాడు. ఇంతలో మరొకడు పంపిన మరో నటి ([[శ్రీలక్ష్మి]]) అలాగే వస్తుంది. ఈ సారి వచ్చినావిడ తన చిన్నమ్మని, ఆవిడ తనని చదివించిందని, ముగ్గురు తల్లుల పెంపకంలో తను పెరిగానని చెప్పాక బలరాం పొంగిపోతాడు. ముగ్గురు తల్లుల ప్రేమను పంచుకుని పెరిగిన శ్రీరాముడిలాంటివాదివని పొగిడి భోజనానికి సిద్ధమవుతుండగా సానియా ఇంటికి వస్తుంది. తనని తన అక్క సరితగా బలరాంకి పరిచయం చేస్తాడు రాము. అయితే తను అచ్చం తన చనిపోయిన ప్రియురాలు సావిత్రిలా ఉండటంవల్ల షాకైన బలరాం ఎద్దులోడితో కలిసి తన మహలుకి ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పి బయలుదేరతాడు. నిజం తెలియక పోవడం వల్ల తన ఈ ప్రవర్తన అటు రహ్మాన్ ఇటు సానియా ఇద్దరికీ అర్థం కాదు. ఇలా ఉండగా ఓ రోజు కలెక్టర్ గారిని కలవడానికి బలరాం, ఎద్దులోడు కలిసి బయలుదేరతారు. మసీదులో రంజాన్ అవ్వడం వల్ల ముస్లింలు ప్రార్థనలు చేస్తుంటారు. అక్కడే వాళ్ళ ప్రార్థన ముగిసేందుకు ఎదురుచూస్తున్న బలరాం, ఎద్దులోడు అక్కడ నమాజ్ చేస్తున్న రహ్మానుని చూస్తారు.
"https://te.wikipedia.org/wiki/మసాలా" నుండి వెలికితీశారు