కల్యాణం రఘురామయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
| weight =
}}
'''ఈలపాట రఘురామయ్య'''గా ప్రఖ్యాతిచెందిన '''కల్యాణం వెంకట సుబ్బయ్య''' ([[1901]] - [[1975]]) సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు మరియు గాయకుడు. రఘురామయ్య [[గుంటూరు]] జిల్లా [[సుద్దపల్లి (చేబ్రోలు)|సుద్దపల్లి]] లో [[1901]] మార్చి 5వ తేదీన జన్మించాడు. చిన్ననాటి నుండే నాటకాలు వేశాడు. రఘురాముని పాత్ర పోషించడంలో ఈయన చాలా ప్రఖ్యాతిపొందాడు. అందువలన [[కాశీనాథుని నాగేశ్వరరావు]] రఘురామయ్య అని పేరుపెట్టాడు. దాదాపు 60 సంవత్సరాలు నాటక రంగంలో ప్రసిద్ధ నటులందరితో ఈయన స్త్రీ, పురుష పాత్రలు ధరించాడు. [[తిరుపతి వెంకట కవులు]] రచించిన పాండవోద్యోగ విజయాలలోని పద్యాలను చక్కగా పాడుతూ, వాటి భావాన్ని వివరిస్తూ, నటించి ప్రచారం చేసిన నటులు వీరు. చలనచిత్ర రంగంలో ఎన్నో కథానాయకుల పాత్రలు పోషించాడు. ఆ రోజుల్లో అందరూ శ్రీకృష్ణుడు పాత్రలో పద్యాలు పాడుతూ, వేణువును మాత్రం చేతితో పట్టుకునేవారు. కానీ ఈయన మాత్రం తన చూపుడు వేలును నాలిక క్రిందపెట్టి, [[ఈలపాట]] తో వేణుగానం చేస్తూ, ప్రేక్షకులకు ఒక అపూర్వమైన అనుభూతి కలిగించేవాడు. Eeyana 1933 lo "Prudhvi Putra" cinema dwara Telugu cinema rangamloki pravesinchadu. Edi Telugu cine rangamlo vachina 5va cinema. Mottamodatisari Prudhvi Puta Telugu cinemanu nirminchina Telugu vakti Pothina Srinivasa Rao. రఘురామయ్య ఇంచుమించు 20 వేల నాటకాలలో మరియు 100 చలన చిత్రాలలో నటించాడు. 1972లో నాటక బృందంతో కౌలాలంపూరు, బాంకాక్, టోక్యో, ఒసాకా, హాంగ్ కాంగ్ మరియు సింగపూర్ లలో పర్యటించాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్, నెహ్రూ తదితరులు ఈయన వీరి వ్రేలి మురళీ గానాన్ని మెచ్చుకొనగా, రవీంద్రనాథ్ ఠాగూర్ రఘురామయ్యను 'ఆంధ్ర నైటింగేల్' అని ప్రశంసించాడు. భారత ప్రభుత్వం వీరికి [[పద్మశ్రీ]] అవార్డును ప్రధానం చేసింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ విశిష్ట సభ్యత్వాన్ని ఇచ్చి సన్మానించింది. ఈయన తన 75వ ఏట 24 ఫిబ్రవరి [[1975]] న గుండెపోటుతో మరణించాడు. ఈలపాట రఘురామయ్య కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2014 న తెలుగు భాషా సంఘం ఛైర్మన్ మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించాడు.
==నటించిన కొన్ని చిత్రాలు==
===1930లు===
"https://te.wikipedia.org/wiki/కల్యాణం_రఘురామయ్య" నుండి వెలికితీశారు