గొట్టిపాడు (ప్రత్తిపాడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''గొట్టిపాడు''', [[గుంటూరు]] జిల్లా, [[ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా)|ప్రత్తిపాడు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 019., యస్.టీ.డీ.కోడ్ 0863.
 
* గొట్టిపాడు గ్రామంలోని ఆంజనేయస్వామివారి దేవాలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి సందర్భంగా, శ్రీ సీతారాముల కళ్యాణం, వైభవంగా నిర్వహించెదరు . [10]
* ఈ గ్రామములోని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయంలో వైకుంఠఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. ఈ దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా, స్వామివారికి, పంచామృత ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేయుదురు. [8]&[9]
* ఈ గ్రామ పంచాయతీకి 1955 లో తొలిసారి ఎన్నికలు జరిగినప్పుడు, గ్రామస్తులు చేతులెత్తటం ద్వారా అప్పటికి గ్రామంలో మూడు వందల ఎకరాల పంటపొలాలతో గ్రామంలో దానశీలిగా ఉన్న శ్రీ గుంటుపల్లి సూర్యనారాయణను సర్పంచిగా ఎన్నుకున్నారు. 1964లో ఆయన ప్రత్తిపాడు సమితి అధ్యక్షులుగా ఎన్నికవగా, సర్పంచి పదవికి రాజీనామా చేశారు. 1964 లో ఆయన తరువాత ఆయన తమ్ముడు శ్రీ గుంటుపల్లి వెంకటాప్పారావును సర్పంచిగా ఎన్నుకున్నారు. గుంటుపల్లి సూర్యనారాయణ 1962 నుండి 1967 వరకూ, 5 సం. పెదకాకాని శ్రీ భ్రమరాంబాసమేత మల్లేశ్వరస్వామి దేవస్థానానికి అధ్యక్సులుగా వ్యవహరించారు. 1969 నుండి 1972 దాకా అప్పారావు సర్పంచిగా చేశారు. అప్పారావు 1981 లో ప్రత్తిపాడు సమితి అధ్యక్షునిగా, 1993లో గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మనుగా నియమితులయ్యారు. 1981 లో అప్పారావు సోదరుడు జానకిరామయ్య, గొట్టిపాడు సర్పంచిగా, 1987 లో మండలాధ్యక్షుడిగా విజయం సాధించారు. 1989 లో జానకిరామయ్య సోదరుడు నాగేశ్వరరావును గ్రామ సర్పంచిగా ఎన్నుకున్నారు. 1996లో పిల్లి లాజరు, 2001 లో జొన్నలగడ్డ దయారత్నం, 2006 లో గుంటుపల్లి వెంకటసుబ్బమ్మ ఈ గ్రామానికి సర్పంచులుగా ఎన్నికైనారు. గుంటుపల్లి సూర్యనారాయణ కుటుంబసభ్యులు పేదలకు సహాయసహకారాలు అందించడం ద్వారా పేరు పొందారు. వీరికి ఉన్న 300 ఎకరాల పొలంలో 275 ఎకరాలు దానధర్మాలకూ, గ్రామంలో అభివృద్ధి పనులకూ, ఖర్చు చేశారు. వీరి పాలనలో మంచినీటి పథకం, జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, పశువైద్యశాల, 5 ప్రాధమిక పాఠశాలలూ, పంచాయతీ భవనం నిర్మించారు. ఇంకా మంచినీటి చెరువులో పూడికతీత, బోయపాలెం, అబ్బినేనిగుంటపాలెం, ప్రత్తిపాడు రహదారులు, విద్యుద్దీకరణ, ప్రత్తిపాడులో సమితి కార్యాలయభవన నిర్మాణం చేశారు. [3]
Line 124 ⟶ 126:
[8] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; జనవరి-12,2014; 1వ పేజీ.
[9] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాదు; 2014,ఫిబ్రవరి-28; 1వ పేజీ.
[10] ఈనాడు గుంటూరు సిటీ/ప్రత్తిపాడు; 2014,ఏప్రిల్-9; 1వ పేజీ.
 
 
{{ప్రత్తిపాడు (గుంటూరు జిల్లా) మండలంలోని గ్రామాలు}}