అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 110:
}}
 
[[కృష్ణా జిల్లా]]లోని 16 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గం''' ఒకటి. ఈ నియోజకవర్గంలో 236 పోలింగ్ స్టేషన్లు, 1,83,813 ఓటర్లున్నారు. పురుషుల కంటే 3559 మహిళా ఓటర్లు ఎక్కువ. అవనిగడ్డ నియోజకవర్గం [[దివిసీమ]] గా పేరొందిన ప్రాంతం. పునర్విభజన తరువాత చల్లపల్లి, ఘంటసాల రెండు మండలాలు కొత్తగా చేరాయి. తూ ర్పుతూర్పు కృష్ణాప్రాంతంలో కాపు,అగ్నికుల క్షత్రియ,కమ్మ కులాల జనాభా ఎక్కువ.
 
చల్లపల్లి జమిందార్‌ యార్లగడ్డ శివరామ ప్రసాద్‌, మండలి వెంకట కృష్ణారావు, సింహాద్రి సత్యనారాయణ వంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అవనిగడ్డ నియోజకవర్గం 1962 లో ఏర్పడింది.మొత్తం పదిసార్లు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ (ఐ) లు ఏడుసార్లు, తెలుగుదేశం మూడుసార్లు ఇక్కడ గెలిచింది. యార్లగడ్డ శివరామ ప్రసాద్‌ అవనిగడ్డ నుంచి రెండుసార్లు, అంతకుముందు దివి నియోజకవర్గం నుంచి ఒకసారి మొత్తం మూడుసార్లు గెలవగా, మండలి వెంకట కృష్ణారావు సింహాద్రి సత్యనారాయణ మూడుసార్లు చొప్పున గెలిచారు. రెండుసార్లు కృష్ణారావు కుమారుడు బుద్ద ప్రసాద్‌ గెలుపొందారు. మండలి వెంకటకృష్ణారావు ఒకసారి ఏకగ్రీవంగా ఎన్నికవడం ఒక ప్రత్యేకత. జిల్లాలో శాసనసభ్యులుగా పోటీచేసి మరెవరికీ ఈ గౌరవం దక్కలేదు. 1952, 55 లలో దివి నియోజకవర్గం ఉండేది.ఆ రెండుసార్లు దివి ద్వి సభ్య నియోజకవర్గంగా కొనసాగింది. ప్రఖ్యాత సిపిఐ నేత చండ్ర రాజేశ్వరరావు సొంత నియోజకవర్గమైన దివలో ఒకసారి ఆయన సోదరుడు చండ్ర రామలింగయ్య గెలుపొందగా చల్లపల్లి రాజా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలో రాజేశ్వరరావు స్వయంగా పోటీచేసి చల్లపల్లి రాజాచేతిలో పరాజితులయ్యారు.<ref>http://www.suryaa.com/features/article-2-176612</ref>
 
==నియోజకవర్గంలోని మండలాలు==