జిజాబాయి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
భారతదేశం వీరమతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో [[ఛత్రపతి శివాజీ ]] మాతృమూర్తి , వీరమాత జిజాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.
 
జిజాబాయి 1598వ సంవత్సరం నేటి మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి లఖోజీరావ్ జాధవ్ గోల్కొండ నిజాంషాహి పలకులవద్ద ముఖ్య పదవిలో ఉండేవారు. జిజాబాయి భర్త షాజీ భోంస్లే బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవారు. ఆయన మరాఠాలను,హిందువులను ఏకతాటిపై తెచ్చి హిందు రాజ్య స్థాపన చేయాలని భావించేవారు. ఆ ఆశయం జిజాబాయికి కూడా ఉండేది. ఆమెకు ఇద్దరు కుమారులు శంభాజీ , శివాజీ. షాజీ భోంస్లే తుకాబాయిని రెండవ వివహం చేసుకుని శంభాజీతో బీజాపూర్ సుల్తానుల ఆదేశం మేరకు కర్ణాటక ప్రాంతంలో ఉన్నప్పుడు ఎంతో ఆత్మస్థైర్యంతో శివాజీని పెంచి పెద్దచేశారు.
"https://te.wikipedia.org/wiki/జిజాబాయి" నుండి వెలికితీశారు