అంగ వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ:Human_skeleton_front_en.svgను బొమ్మ:Human_skeleton_front.svgతో మార్చాను. మార్చింది: commons:User:Beria; కారణం: (File renamed: rightfull owner).
చి Wikipedia python library
పంక్తి 3:
[[ఫైలు:SystemExample.jpg|thumb|300px|"వ్యవస్థ"కు ఉదాహరణగా ఈ బొమ్మలో నాడీ వ్యవస్థ చూపబడింది. నాడీ వ్యవస్థలో 4 విభాగాలున్నాయి - (1) మెదడు (2) సెరిబెల్లమ్ (3) వెన్నుపాము (4) వాడులు.]]
 
"వ్యవస్థ" అనగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి, అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహించే విషయాల సముదాయం. ఇక్కడ విషయాలంటే కంటికి కనిపించే నిజమైన వస్తువులు కావచ్చును లేదా కేవలం భావాలు (సాకారం కానివి) కావచ్చును. [[జీవశాస్త్రం]]లో ఈ "వ్యవస్థ" అనే పదాన్ని వివిధ జీవ ప్రక్రియలు జరిపే అవయవసమూహాలకు వాడుతారు. '''అంగ వ్యవస్థ''' అంటే ఒక విధమైన పని (జీవ ప్రక్రియ)కి ఉపకరించే కొన్ని [[అవయవం|అవయవాల]] సముదాయం. ఉదాహరణకు గుండె, రక్త నాళాలు, ఊపిరి తిత్తులు కలిపి శరీరంలో రక్త ప్రసరణను జరుపుతాయి గనుక అవి ఒక వ్యవస్థ.
 
అత్యంత క్లిష్టమైన భౌతిక లేదా రసాయనిక ప్రక్రియలు ఇలా అవయవాల సమిష్టి క్రియల ద్వారా సాధ్యమౌతున్నాయి. ఇలా సమిష్టిగా పనిచేసే వ్యవస్థలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.
 
 
* [[జీర్ణ వ్యవస్థ]] - ఆహారాన్ని జీర్ణం చేసి శరీరానికి కావలసిన శక్తిని, పోషకతను సమకూర్చే వ్యవస్థ - [[నోరు]] నుండి [[గుదము]] వరకు విస్తరించి ఉన్నది. దీనికి అనుబంధంగా [[లాలాజల గ్రంధులు]], [[కాలేయం]], [[క్లోమము]] వంటి కొన్ని గ్రంధులున్నాయి.
 
 
* [[మూత్ర వ్యవస్థ]] - శరీరంలో ఆమ్ల, క్షార తుల్యతను సరిగా ఉంచడానికి, వ్యర్ధ పదార్ధాలను, విష పదార్ధాలను విసర్జింపడానికి మూత్రపిండాలలో తయారైన [[మూత్రం]] పనికొస్తుంది. [[మూత్రపిండాలు]], [[మూత్రనాళాలు]], [[మూత్రాశయం]], [[ప్రసేకం]] వంటివి ఈ మూత్ర వ్యవస్థలో అవయవాలు.
 
 
పంక్తి 17:
 
 
* [[నాడీ వ్యవస్థ]] - నాడీ వ్యవస్థ ప్రధానంగా రెండు రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది. '''నాడీ కణాలు''', '''నాడీ కణదేహం'''. నిర్మాణాత్మకంగాను క్రియాత్మకంగాను క్లిష్టమైన నాడీ వ్యవస్థ [[జంతువు]]లలో మాత్రమే కనిపిస్తుంది. ఈ వ్యవస్థ [[ప్రేరణ]]కు [[ప్రతిచర్య]], సమన్వయం మరియు అభ్యాసన అనే మూడు ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. (1) [[కేంద్ర నాడీ వ్యవస్థ]]లో [[మెదడు]] మరియు [[వెన్నుపాము]] ఉంటాయి. (2) [[పరిధీయ నాడీ వ్యవస్థ]]లో [[కపాల నాడులు]] మరియు [[కశేరు నాడులు]] ఉంటాయి. (3) [[స్వయంచోదిత నాడీ వ్యవస్థ]]
 
 
* [[శ్వాస వ్యవస్థ]] - ఊపిరితిత్తులద్వారా మన శరీరానికి కావలసిన [[ప్రాణవాయువు]] లభిస్తుంది. [[ముక్కు]] నుండి [[వాయుకోశాలు]] వరకు ఇది విస్తరించింది. - [[ముక్కు]], [[గొంతు]], [[స్వరపేటిక]], [[ఊపిరితిత్తులు]] ఈ వ్యవస్థలోనివి.
 
 
పంక్తి 26:
 
 
* [[స్త్రీ జననేంద్రియ వ్యవస్థ]] - లో ఒక జత [[స్త్రీ బీజకోశాలు]], [[బీజవాహిక]]లు, [[గర్భాశయం]], [[యోని]], [[యోనిశీర్షం]], కొన్ని అనుబంధ గ్రంధులు ఉంటాయి.
 
 
* [[శోషరస వ్యవస్థ]] - రక్తనాళాల ద్వారా [[రక్తం]] కదులుతున్నప్పుడు [[ప్లాస్మా]]లో ఉన్న నీరు, దానిలో ఉన్న ఆక్సిజన్ పోషకపదార్ధాలు రక్తనాళాల గోడల నుంచి బయటకువచ్చి కణజాలస్థలాల్లోకి చేరతాయి. ఈ ద్రవాన్ని [[కణబాహ్యద్రవం]] అంటారు. ఇది కణాల నుంచి కార్బన్ డైయాక్సైయిడ్ ని జీర్ణక్రియా వ్యర్ధపదార్ధాలను సేకరిస్తుంది. ఈ కణబాహ్యద్రవంలో అధిక భాగం రక్తనాళాల్లో ప్రవేశించి రక్తంలో ఒక అంశంగా రవాణా చెందుతుంది. మిగిలిన కణబాహ్యద్రవం కణజాలంలో ఉండే చిన్న శోషరసనాళికలలోకి ప్రవేశిస్తుంది. ఈ చిన్న నాళికలన్ని కలసి పెద్ద శోషరసనాళంగా ఏర్పడి, వాటి ద్వారా ప్రసరించి రక్తప్రసరణకు చేరుతుంది. ఈ విధంగా శోషరసనాళాల్లో ప్రవహించే కణబాహ్యద్రవాన్ని '[[శోషరసం]]' అంటారు. ఈ మొత్తం వ్యవస్థని శోషరస వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థలో శోషరస నాళికలు, [[శోషరస నాళాలు]], శోషరస వాహికలు, [[శోషరస గ్రంధులు]], శోషరస కణుపులు ఉంటాయి.
 
 
* [[అస్థిపంజర వ్యవస్థ]] - ఇది దేహానికి ఆధారాన్నిచ్చే ధ్రుఢనిర్మాణం. ఇవి దేహానికి వెలుపల ఉంటే వాటిని 'బాహ్య అస్థిపంజరం' అనీ, లోపల ఉంటే 'అంతర అస్థిపంజరం' అనీ అంటారు. శరీర మధ్యభాగంలోని అంతర అస్థిపంజరాన్ని 'అక్షాస్థి పంజరం' అని, వీటికి అనుబంధంగా అతికించబడి ఉన్నదాన్ని 'అనుబంధాస్థి పంజరం' అని అంటారు. మానవుని శరీరములో 206 [[ఎముక]]లుంటాయి.
 
{{clear}}
"https://te.wikipedia.org/wiki/అంగ_వ్యవస్థ" నుండి వెలికితీశారు