ఆర్కిమెడిస్ సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 2:
==వివరణ==
ఉర్థ్వ ఒత్తిడి అనగా వస్తువు ద్రవములో మునిగినపుడు అది కొంత భారమును కోల్పోయినట్లు అనిపిస్తుంది. అనగా ఊర్థ్వ దిశలో కొంత బలం పనిచేస్తుంది. ఉదాహరణకు 100 ఘనపు సెం.మీ గలిగిన ఒక లోహపు దిమ్మ ద్రవంలో మునిగినపుడు ఇది అంతే ఘనపరిమాణము గల నీటిని తొలగిస్తుంది. ఇది సుమారు ఒక న్యూటన్ బరువు కలిగి ఉంటుంది. అనగా ఆ లోహపు దిమ్మ ఒక న్యూటన్ బరువును కోల్పోయింది అని చెప్పవచ్చు.<br />
నీటి కంటే [[సాంద్రత]] తక్కువ గల ఒక వస్తువు నీటిలో కొంతభాగం తేలియాడుచున్నది అనుకొనుము. అపుడు ఆ వస్తువు కోల్పోయిన నీటి బరువు ఆ వస్తువు భారం కన్నా యెక్కువ ఉండును. కాని నీటిలో కొంత మునిగి యున్న వస్తుభాగము యొక్క బరువు ఆ వస్తువు తొలగించబడ్డ నీటి బరువుకు సమానము అవుతుంది.<br />
==ప్లవమాన వస్తువులు==
ఒక చెక్క దిమ్మ యొక్క సాంద్రత నీటి సాంద్రత కన్నా 6/10 వ వంతు ఉండును. ఈ దిమ్మ నీటిలో తేలినపుడు 6/10 ఘనపరిమాణం గల భాగం మాత్రమే నీటిలో మునిగి ఉంటుంది. అనగా తొలగింపబడిన నీటిభారం ఆ చెక్క దిమ్మ బరువుకు సమానంగా ఉండును.ఒక సాంద్రత గలిగిన వస్తువు కూడా కొన్ని ఆకారాలలో ఉన్నపుడు నీటిలో తేలుటకు కారణం కూడా ఆర్కిమెడిస్ సూత్రమే. ఒక యినుప దిమ్మ నీటిలో మునుగుతుంది. కాని దానిని రేకులా చేసి పడవను చేసినట్లయితే నీటిపై తేలుగుంది.
"https://te.wikipedia.org/wiki/ఆర్కిమెడిస్_సూత్రం" నుండి వెలికితీశారు