ఎయిడ్స్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
[[దస్త్రం:Red_ribbon.png|right|thumbnail|ఎర్ర రిబ్బను - ఎయిడ్స్ వ్యాధికి చిహ్నం]]
 
విచ్చలవిడి శృంగార సంభోగాల వల్ల, ముఖ్యంగా ఒకరికంటే ఎక్కువ మందితో [[సంభోగం]]లో పాల్గొనడం వల్ల, రక్త మార్పిడి వల్ల, తల్లి నుండి బిడ్డకు, కలుషిత సిరంజిల వల్ల, ఎయిడ్స్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ముందు ఈ వ్యాదిని ప్రాణహంతక వ్యాధిగా ( Death Sentenced Disease ) గా పరిగణించే వారు. కాని శక్తివంతమైన ART మందులు, ఏయిడ్స్ వల్ల వచ్చె ఋగ్మతలను నయం చేసె మందులు ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాదిని [[మధుమేహం]] మరియు హైపర్ టెన్షన్ ([[రక్తపోటు]])లాంటి వ్యాధుల లాగే ఈ వ్యాధిని కూడ దీర్ఘకాలిక మరియు నియంత్రించటానికి (Chronic and Manageable Disease )వీలు కలిగె వ్యాధిగా వ్యవహరిస్తున్నారు<ref>http://www.prajasakti.com/telusukundama/article-295468</ref><ref>http://www.aids.gov/hiv-aids-basics/diagnosed-with-hiv-aids/overview/chronic-manageable-disease/</ref> <ref>http://news.bbc.co.uk/2/hi/health/7523212.stm
</ref> <ref>http://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3284093/</ref> <ref>http://www.thebody.com/content/art43596.html</ref> <ref>http://www.hivpositivemagazine.com/what_everyone_should_know_about_HIV_treatment.html</ref> <ref>http://emedicine.medscape.com/article/1533218-overview</ref><ref> http://www.pharmacytimes.com/publications/issue/2007/2007-03/2007-03-6317</ref> . ఇది హెచ్.ఐ.వి (హ్యూమన్ ఇమ్మ్యునోడెఫిసియెన్సీ వైరస్)అను [[వైరస్]] వలన వస్తుంది. AIDS అనేది ఎక్యైర్డ్ ఇమ్యూన్ డెఫీసియన్సీ సిండ్రోంకు పొడి పేరు. శరీరంలో రోగనిరోధక శక్తి, బాహ్య కారణాల వల్ల తగ్గ్గడం అన్నమాట. హెచ్ఐవి [[వైరస్]] మనుషులకు మాత్రమే సోకుతుంది.
 
== ఎయిడ్స్ బాధితులు ==
[[దస్త్రం:AIDS cases worldwide te.png|right|thumb|1979-1995 మధ్య కాలంలో నమోదయిన ఎయిడ్స్ కేసులు]]
[[2010]] వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ [[2010]] సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000<ref>http://www.who.int/hiv/data/en/</ref> <ref>http://www.who.int/hiv/data/2011_epi_core_en.png</ref>. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు [[ఆఫ్రికా]] ఖండంవారే. వారి తరువాత స్థానంలో [[భారత దేశము|భారతదేశం]] ఉంది. అంతే కాదు భారత దేశంలో ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య [[ఆంధ్ర ప్రదేశ్]]లో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ(NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 అదే మన ఆంధ్రప్రదేశ్‌‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 <ref>http://www.nacoonline.org/upload/Publication/State%20Fact%20Sheets/State%20fact%20sheet%20March%202012%20.pdf</ref> <ref>http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/</ref> గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతుఉంటాయి [http://www.nacoonline.org/Quick_Links/Directory_of_HIV_Data/ ఈ పేజిలొ] తరచుగా NACO వారు అన్ని వివరాలను పొందుపరుస్తూఉంటారు. పై సంఖ్యలన్ని అధికారిక లెక్కలు మాత్రమే, NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు ఇందులో కలపబడలేదు.
 
== ఎయిడ్స్ ఎక్కడ నుండి వచ్చింది? ==
పంక్తి 53:
 
== హెచ్ ఐ వి లక్షణాలు ==
సాధారణంగా వైరస్ శరీరం లో కి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వార వైరస్ జాడ కనుగోనలేము<ref>http://aids.gov/hiv-aids-basics/prevention/your-hiv-status/testing-window-period/</ref>. దీనినె Window Period అంటారు.
ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగుల లో కనిపిస్తాయి.
జ్వరం,
నోటి పూత,
పంక్తి 64:
పది శాతం బరువు ని కోల్పోవడం,
గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes,
మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.
 
ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లొ తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు <ref> http://www.medicinenet.com/human_immunodeficiency_virus_hiv_aids/article.htm</ref> <ref> http://www.thebody.com/content/art49930.html</ref>పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు.<ref>http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml</ref> <ref>http://www.aidsmap.com/page/1430966/</ref> <ref>http://www.aidstruth.org/denialism/myths/ltnp</ref> . ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వార ఎయిడ్స్ రొగుల జివితకాలం పెరుగుతు ఉంటుంది.
 
[[దస్త్రం:Symptoms of AIDS.png|thumb|left|260px|ఎయిడ్స్ ప్రధాన లక్షణాలు.]]
పంక్తి 79:
== హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స ==
 
HIV ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లొ సుసాద్యం<ref>http://www.aidsmeds.com/articles/hiv_life_exectancy_survival_1667_14989.shtml</ref><ref>http://www.aidsmeds.com/articles/hiv_survival_uk_1667_21328.shtml</ref>.<ref>http://www.everydayhealth.com/hiv-aids/living-longer-with-hiv.aspx</ref> <ref>http://www.aidsmap.com/page/1430966/</ref><ref> http://www.thebody.com/content/64389/life-expectancy-keeps-rising-for-people-with-hiv-p.html</ref>.కాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందుల వేళకు వేసుకొవటం(Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన అహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంబిస్తె జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్‌ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగె ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సారలు వాడుతుపోతుఉంటే హెచ్ఐవీ వైరస్ మందులను తట్టుకునే సామర్ధ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు.
 
హెచ్ఐవి చికిత్సకు సంబంధించి ముఖ్యమయిన మందులు వీటినే ART ( Antiretroviral Therapy) లేదా ARV's(Antiretrovirals) అని పిలుస్తారు. వీటిని అవి పనిచేసె తీరును బట్టి వెర్వెరు తరగతులుగా విభజించారు.ఇక్కడ భారతదేశంలొ దొరికె మందులను మరియు చౌకగా దొరికే వాటిని మాత్రమె పొందుపరచబడినవి. ఇవికాక మనదేశంలో దొరకని మందులు, మనదేశంలొ దొరికుతు ఖరీదైన మందులు వున్నాయి. వీటిని ఇక్కడ పొందుపరచడంలేదు.
 
'''Nucleoside/Nucleotide Reverse Transcriptase Inhibitors (NRTIs)'''
పంక్తి 101:
# RTV (Ritonavir) [[రిటనోవిర్]]
# LPV (Lopinavir) [[లొపినవిర్]]
# DRV (Darunavir) [[డారునవిర్]]
# NFV (Nelfinavir) [[నెల్పినవిర్]]
# SQV (Saquinavir) [[సాక్వినవిర్]]
 
 
ఈ మందులు ఒకప్పుడు కేవలం ధనిక దేశాలలొ మాత్రమె లబించేవి. ఒకప్పటితొ పొలిస్తె ఇప్పుడు వీటికయ్యె ఖర్చు చాల తక్కువ. పెటెంట్ల ను అడ్డం పెట్టుకొ వెలాది రుపాయలకు అమ్ముకునె కంపనీలకు మన ఇండియా కంపనీలు నిర్గాంతపొయెలా చేశాయి. మన దెశానికి చెందిన సిప్లా , అరబిందో, హెటెరో, రాంబక్సి, ఏంక్యుర్ వంటి పార్మసి కంపనీలు ఆంట్రి రిట్రోవైరల్స్ తయారి మొదలుపెట్టాక ART మందుల దరలు చాల వరకు తగ్గాయి. ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక రొగికి మొదటి లైనుకు అయ్యె చికిత్స ఖర్చును రుపాయలు 14000 నుండి 17000 వరకు ఉంది.<ref> http://www.avert.org/generic.htm</ref> <ref>http://aids.about.com/od/hivmedicationfactsheets/a/affordable.htm </ref> <ref>http://www.business-standard.com/india/news/low-cost-hivaids-drugs-to-be-available-in-india-by-oct-end/113628/on</ref> <ref>http://en.wikipedia.org/wiki/Cipla#Struggle_against_HIV.2FAIDS_in_the_developing_world</ref>. ప్రపంచంలొ ఉత్పత్తి అయ్యే ART మందుల వాటాలొ మన ఇండియా కంపనీలే 65%-70% వరకు ఉత్పత్తి చేస్తున్నాయి<ref>http://articles.timesofindia.indiatimes.com/2011-02-10/india-business/28542384_1_arvs-generic-companies-pepfar</ref>. ఎన్నొ అప్రికా దేశాల హెచ్ ఐ వి పాజిటవ్ వ్యక్థుల ప్రాణాలను ఈ కంపనీలు కాపాడుతున్నాయి
 
=== మందులు ఎప్పుడు మొదలు పెట్టాలి?===
పంక్తి 123:
 
=== ఎయిడ్స్ ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల వేతన సెలవు ===
ఎయిడ్స్ వ్యాధితో బాధపడే ప్రభుత్వ ఉద్యోగులు 18 నెలలపాటు వేతనంతో కూడిన సెలవు పొందే వేసులుబాటును తమిళనాడు ప్రభుత్వం కల్పించింది.ఇప్పటి వరకు క్యాన్సర్, టీబీ, గుండె, మూత్రపిండాలు, నేత్ర సంబంధిత శస్త్రచికిత్సలకు మాత్రమే వేతనంతో కూడిన దీర్ఘకాలిక సెలవు మంజూరు చేసేవారు.ఎయిడ్స్ కలిగిన ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు, ప్రభుత్వం వారితో ఉందన్న భావన కలిగించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.(ఈనాడు తేదీ:27.9.2009)
 
== ఎయిడ్స్ ఇలా వ్యాపించదు ==
పంక్తి 133:
* ఎయిడ్స్‌పీడితుల సంరక్షణ బాధ్యతవహించేవారికి ఆ కారణంగా ఇది సోకడం జరగదు.
* హెచ్‍ఐవి/ఎయిడ్స్ ఉన్నవారితో కలసి పనిచేయడం వలన సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎంతమాత్రం లేదు.
== హెచ్ ఐ వి రొగి తీసుకొనవలసిన జాగ్రత్తలు ==
#పౌష్టికరమైన (Protein Rich Food )అహారం సమయానికి తీసుకొవటం, శరీరానికి తగినంత విశ్రాంతి ( నిద్ర), తగినంతగా వ్యాయామం చేయాలి, ప్రశాంతమైన జీవితం.
#వేళకు తప్పకుండా మందులు వెసుకోవాలి ( Drug Adherence ), డాక్టరు అపాయింట్మెంట్ లను, Lab Test లను మరవకూడదు.
పంక్తి 140:
# ఎలాంటి వ్యాదులైన వస్తె సరియైన సమయానికి డాక్టరుగారికి చూపించుకొవటం.
#దూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
#మీ CD4 సంఖ్య బాగా తగ్గినప్పుడు ఎయిడ్స్ రుగ్మతలు రాకుండా HIV మందులతో పాటుగా Prophylaxis తీసుకొవటం<ref>http://www.avert.org/hiv-opportunistic-infections.htm</ref>. ఎయిడ్స్ కు సంబందించిన చాల రుగ్మతలు రాకుండా Prophylaxis మందులు వున్నాయి
 
== కొన్ని ప్రశ్నలు ==
* '''ఎయిడ్స్ రాకుండా ఏవైనా టీకాలు ఉన్నాయా?'''
:హెచ్.ఐ.వి. రాకుండా నిరొదింఛే టీకా ఉత్పత్తి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం మిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేస్తున్నారు కూడా. భారతదేశం విషయానికొస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థ "నారి" ([http://www.nari-icmr.res.in/ జాతీయ ఎయిడ్స్ పరిశొధనా సంస్థ, పుణె] ) ఈ దిశగా ఎంతో కృషి చేస్తోంది. వ్యాక్సిన్ పరిశొధనలు,వివిధ దశలలొ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. అయితే ఇది ఇప్పటికే వ్యాధిగ్రస్తులైన వారికి మాత్రం ఉపయోగపడదు. కొత్తగా ఎవరూ హెచ్.ఐ.వి బారిన పడకుండా మాత్రమే కాపాడగలదు.
* శరీరంలోని రోగనిరోధక శక్తికి అందకుండా దాక్కు ని ఉన్న [[హెచ్.ఐ.వీ]] వైరస్ లక్షణాలను గుర్తించి దానిపై పోరాడే వ్యాక్సిన్ తయారైంది<ref>http://www.pallibatani.com/view-458-ap-roundup-feature.html</ref>. ఈ వ్యాక్సిన్‌ను ఒరేగాన్ వర్సిటీ విద్యార్థులు కనుగొన్నారు. ఇది శరీరంలోని హెచ్ఐవీ వైరస్‌పై తీవ్రంగా పనిచేస్తుంది. శరీరంలో ఏ మూలన దాక్కున్న వైరస్‌నైనా ని యంత్రించి ఇతర శరీర భాగాలపై దాని ప్రభావం లేకుండా చేస్తుంది. వ్యాక్సిన్‌ను ఇంజక్షన్ ద్వారా అందిస్తారు. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరస్ వృద్ధి చెందకుండా చూస్తుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేశారు.
* '''ఎయిడ్స్ గ్యారంటీగా నయం చేయగలమని కొందరు పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారు. నమ్మవచ్చా?'''
:ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసే మందులు తయరు కాలేదు. అయితే ఎయిడ్స్ దశలో రోగి జీవిత కాలాన్ని పొడిగించే "ఎ.అర్.టి." మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 45 ART సెంటర్లలొ NACO ఉచితంగా మందులను ఇస్తుంది. <ref>http://www.nacoonline.org/upload/Directory%20of%20Service%20Facilities/List%20of%20functional%20355%20ART%20Centres%20as%20on%20March-2012.pdf</ref> ART మందులు తప్ప వెరె ఏ మందులు హెచ్ ఐ వి / ఎయిడ్స్ పైన పని చేయవు గ్యారంటీగా ఎయిడ్స్ నయం చేస్తామంటూ ప్రకటనలు ఇచ్చేవారిని నమ్మకండి.
* హెచ్ఐవీ/ఎయిడ్స్ రోగుల్లో సిడి-4 కౌంట్ 200కు తగ్గగానే పలు కేంద్ర నాడీ మండల వ్యాధులు చుట్టుముడతాయి.హైలీ యాక్టివ్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ (హార్ట్) చికిత్సతో వ్యాధిని నియంత్రించే అవకాశం కలిగిఇంది.
* '''డాక్టర్లు నేను హెచ్ ఐ వి పాజిటివ్ గా నిర్దారించారు, నేను వెంబడే చనిపోతానా? ''' <ref>http://www.thebody.com/content/art46391.html#10</ref>
:లేదు, హెచ్ ఐ వి పాజిటివ్ పర్సన్ అంటె ఎయిడ్స్ ను కలగచెసె హెచ్ ఐ వి అనె వైరస్ మీ శరీరంలొ వున్నది అని అర్థం. అంతే కాని మీకు ఎయిడ్స్ ఉన్నది వెంబడె చనిపోతారని మాత్రం కాదు. ఏయిడ్స్ కు పూర్తిగా తగ్గించడానికి మందులు లేవు కాని ఎయిడ్స్ వల్ల వచ్చె అన్ని రుగ్మతలకు (opportunistic infections) పూర్తిగా నివారించె మందులు, రాకుండా అరికట్టె మందులు ప్రస్తుతానికి అందుబాటులో వున్నాయి. ఇవన్ని కలిపి హెచ్ ఐ వి / ఎయిడ్స్ తొ జీవించె వ్యక్థుల జీవన ప్రామాణాల్ని చాలవరకు పెంచాయి.
 
== పాదపీఠికలు మరియు మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎయిడ్స్" నుండి వెలికితీశారు