గొరవయ్యలు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి Wikipedia python library
పంక్తి 1:
'''గొరవయ్యలు''' [[కర్నూలు]] జిల్లాలో "గొరవయ్యల నృత్యం" అనే శైవభక్తి ప్రధానమైన జానపద కళా విన్యాసాన్ని ప్రదర్శించే కళాకారులు.
 
; వీరి వేషధారణ : నల్లని [[కంబలి]] ధరించి, నెత్తిన ఎలుగుబంటితో చర్మంతో చేసిన పెద్ద టోపీ లేదా ఎలుగుబంటి తలలాగా తయారుచేసిన టోపీ (ఈ రోజుల్లో క్రీడా 'మస్కట్' లాగా) ధరించి, చేతిలో డమరుకం లేదా పిల్లనగ్రోవి వాయించుకుంటూ (ప్రజలకు ఆకర్షించడానికి) వీధులగుండా పోయేవారు. <!-- నా చిన్నప్పుడు [[ఉరవకొండ]]లో --> వీధుల్లో నల్ల కంబలి ధరించి, నెత్తిన ఎలుగుబంటి చర్మంతో చేసిన పెద్ద టోపీతో డమరుకం, పిల్లనగ్రోవి వాయిస్తు నృత్యంచేసే వారిని చూసి పిల్లలు జడుసుకోవడం కూడా జరిగేది.<!-- రోజులు ఉన్నాయి. --> చిన్న పిల్లలంతా వారి వెంటపడి కేరింతలు కొట్టి వాళ్ళు భయపెడితే జడుసుకుని పరుగెత్తుకెళ్ళేవారు. అప్పట్లో ఇదో తమాషా ఆట. కానీ ఇదొక పరిశోధనాంశం అన్న విషయం చాలా మందికి తెలియదు.
నేడు అనేక దేశాలలో జంతురూపాలను అలంకరించుకుని ప్రజాకర్షణ చేయడం సర్వసాధారణం.
 
 
జానపద కళారూపాల్లో సామూహిక నృత్యాల్లో మతపరమైన , కులపరమైన కళారూపం గొరవయ్యల నృత్యం. [[రాయలసీమ]] ప్రాంతంలో [[కర్నూలు]] జిల్లాకే ప్రత్యేకమైనది ఈ కళారూపం. కర్నులూ జిల్లాలో [[శ్రీశైలం]] ప్రస్సిద్ది చెందిన శైవ క్షేత్రం. ఇక్కడ వెలసిన మల్లికార్జునుడు శైవులకు ఆరాధ్య దైవం. గొరవయ్యల నృత్యం శైవ మత నేపద్యంలోనుంచి వెలుగు చూసిందే.
 
=="గొరవయ్య" పదం==
పంక్తి 14:
 
 
మైలారదేవుడు తన భార్యతో సరసాలాడుతుండగా ఒకరోజు చిన్న వాదు మొదలవుతుంది. వారికున్న ఆరు కుక్కల గణంలో ఒకటి భార్య పక్షం, మరొకటి మైలాసురుని పక్షం. వారి దగ్గరున్న గొలుసులను ఏ గణం తెంపుతుందోనని వాదులాట, పందెం వేసుకున్నారు. పందెంలో మైలార దేవుని భార్య పక్షమే గెలుస్తుంది. ఈ గొలుసును తెంపడాన్ని [[సర్పిణి పందెం]] అంటారు. కర్నూలు జిల్లా గట్టు మల్లయ్య కొండలో దసరా రోజుల్లో ఈ పందెం ఇప్పటికీ జరుగుతుంది. పందెం ముగిసాక ఆరు కుక్కలు ఒక దొన్నెలోని పాలు పోట్లాడుకుంటూ తాగుతాయి. దీనిని ఒగ్గు సేవ అంటారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో గొరవయ్యలను ఒగ్గప్పలంటారు. ఈ పేరు రావడానికి వీరి ఒగ్గు సేవే కారణం కావచ్చు. మరో కథలో మైలార దేవుడు రాక్షసులను చంపిన తరువాత అతని ఉగ్రరూపం నుండి శాంతింప చేయడానికి గొలుసులతో బంధిస్తారు. స్వామి గొలుసులను తెంచుకున్న తరువాత ప్రసాద నైవేద్యాలతో శాంతింప చేసినట్లు ఆ సంధర్భంలో ఒగ్గు సేవ చేసుకున్నట్లు ఉంది.
 
==గొరవయ్య దీక్ష==
పంక్తి 32:
</poem>
==ఒగ్గు సేవ==
ఒగ్గు సేవ అంటే దొన్నెలలోని పాలను కుక్కలలాగా అరుచుకుంటు కొట్టుకుంటూ నాలుకలతో తాగడం. గొరవయ్య దీక్షను తీసుకున్న వారు శివరాత్రి రోజున లేదా మైలార, మాళవికల కళ్యాణం రోజున ఈ ఒగ్గు సేవ చేస్తారు. ఒగ్గుసేవకు ముందు [[సర్పిణి పందెం]] ఉంటుంది. అంటే గొలుసు తెంచడం, భక్తులు తెచ్చిన పాలు, పెరుగు, పండ్లు దొణెలలో పోసి ఈ గిన్నెలను ఒక వలయాకారంగా ఉంచుతారు. లేదా వరుసగా ఎడమెడమగా వరుసగా ఉంచుతారు. ఈ దోనెల చుట్టూ [[డమరుకం]] వాయిస్తూ తిరుగుతూ గంట కొడుతూ కుక్కలవలె వొంగి అరుస్తూ, మెడలపై కరచుకుంటారు. ఈ దృశ్యం పిల్లలకే కాదు పెద్దలకు కూడా భయం కలిగిస్తుంది. ఒగ్గు సేవ తరువాత దోనెలలో మిగిలిన పాలు, పెరుగు, పండ్లు శివ ప్రసాదంగా భావించి భక్తులు సేవిస్తారు. పురాణ కథలోని ఆరు కుక్కలకు ప్రతీకగా ఒకప్పుడు ఆరుమంది పాల్గోనేవారు. కానీ ఇప్పుడు ఒగ్గు సేవలో పల్గొనే గొరవయ్యలకు సంఖ్యానియమం లేదు. ఒగ్గు సేవ చేస్తున్నప్పుడు కుక్కలవలె అరవడంచేత వీరిని మైలారం కుక్కలు అని కూడా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో పిలుస్తారు. కడప జిల్లాలోని గ్రామాల్లో ఇప్పటికీ వీరిని ఒగ్గులప్పలు, మైలారం కుక్కలు అనే పేర్లతోనే పిలుస్తున్నారు. దసరా పండుగ రోజు గట్టు మల్లయ్య కొండలో వివిధ పద్దతులతో పాడుతూ నాట్యం చేస్తారు. వారి శరీరం నుండి రక్తాన్ని తీసి ధార పోసి దేవునికి నైవేద్యం చేస్తారు. వీరి నాట్య పద్దతి కూడా విచిత్రంగా ఉంటుంది.
 
==నృత్య కళ==
పంక్తి 39:
 
 
సామూహికంగా నృత్యం చేస్తున్నప్పుడు సరిసంఖ్యలో వరుసలుగా నిలబడి ఒకసారి డమరుకాన్ని వాయించి గుండ్రంగా తిరుగుతూ తిరిగి వరుసలో నిలబడతారు. వరుసలోని ఎదురుబదురుగా పోటీగా అడుగులు వేస్తూ కూర్చొని లేవడం, కూర్చొని తిరగడం ఒక వరుసలోని వారు మరో వరుస లోనికి మారడం చేస్తారు. ఇదంతా డమరుకం, పిల్లంగ్రోవి వాయిస్తూనే చెస్తుంటారు. తరువాత పాటలు పాడుతూ గజ్జెల్ని నేలపై తాడిస్తూ నాలుగు వేళ్ళ సహాయంతో డమరుకం వాయిస్తారు. ఒకరు పాడుతుంటే మిగిలిన వారు వంత పాడతారు.
 
==పాటలు- సాహిత్యం:==
పంక్తి 101:
యీబూది బండారు తలలో
శ్రీశైల మల్లయ్య యీబూది
శివమనందియీశుని యీబూది ||బండారు||
గట్టు మల్లయ్య సామి బండారు
మాగంగు మాళమ్మ దేవి బండారు
పంక్తి 114:
==సామాజిక జీవనం==
జమ్మలమడుగు ప్రాంతంలో దసరా ఉత్సవాల్లో భాగంగా గొరవయ్యలు నృత్య ప్రదర్శనలిస్తారు. ఈ పరిశోధకుడు వారిని కలిసినప్పుడు చెప్పిన విషయాలు ఆసక్తి కరంగా ఉన్నాయి. వీరు మదనపల్లె తాలూకా తంబళ్ళ పల్లెకు చెందిన వారు. ఊరూరా తిరుగుతూ వీరు నృత్య ప్రదర్శన లిస్తుంటారు. వీరిలో గణ నాయకుడు సిద్దయ్య తాను స్వయంగా శివుని మీద రచించిన దండకం చదివి వినిపించాడు. వీరంతా శివరాత్రి నాటికి గట్టు మల్లయ్య కొండ చేరతారు. పొలాలు ఉన్నా, తమ కుల వృత్తిని మాత్రం మరచిపోమని వీరు చెబుతారు. ప్రభుత్వం ఈ కళాకారులను ఆదుకోవలసిన అవసరం ఉందని వీరిలో చాలామంది పేద కుటుంబాలకు చెందిన వారని వీరు వాపోయారు.
చిత్తూరు జిల్లాలో దాదాపు 20 సంవత్సరాల కింద 40 మంది గొరవయ్యలుంటే నేడు 9 మంది గొరవయ్యలు మాత్రమే ఉన్నారని వీరు కూడా భిక్షాటన చేస్తున్నారని, ప్రభుత్వం ఎటువంటి ఆధారం చూపలేదని వివరించారు. కురుబ కులస్థులైన వీరు గొరవయ్య కుల వృత్తితోబాటు వ్యవసాయం, జీవుల్ని కాయడం వంటివి చేసి బతుకుతున్నారు. ఫిబ్రవరి గురువారం 17వ తేదీ 2005 ఆంధ్రజ్యోతి దినపత్రికలో భిక్షాటనే మల్లయ్య దార్ల బతుకులు అన్న శీర్షిక కింద వ్యాసం ప్రచురితమైంది. చిత్తూరు జిల్లాలోని మల్లయ్య కొండ దేవాలయానికి వందల ఎకరాల మాన్యం ఉందని, ఈ మాన్యంలో గొరవయ్యలకు చెందాల్సిన భుములు కూడా ఉన్నాయని అందులో పేర్కొనడం జరిగింది. మాన్యపు భుములు ఉన్నప్పటికీ అవి వీరికి చెందక వీరు భిక్షాటనకు దిగడం ప్రస్తుత సమాజం కళారూపాలకు ఇస్తున్న విలువలను మనం గ్రహించవచ్చు.
 
==ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/గొరవయ్యలు" నుండి వెలికితీశారు