"జాతీయములు - ల" కూర్పుల మధ్య తేడాలు

26 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
చి
Wikipedia python library
చి (Wikipedia python library)
చి (Wikipedia python library)
'''ల''' - అక్షరాలతో ప్రారంభమయ్యే జాతీయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
జాబితాను అక్షర క్రమంలో అమర్చడానికి సహకరించండి. క్రొత్త జాతీయాలను కూడా అక్షర క్రమంలో చేర్చండి.
 
 
 
[[:en:John Saeed|జాన్ సయీద్]] అనే భాషావేత్త చెప్పిన అర్ధం - తరతరాల వాడుక వలన భాషలో కొన్ని పదాల వాడుక శిలావశేషంగా స్థిరపడిపోయిన పదరూపాలే జాతీయాలు. భాషతో పరిచయం ఉన్నవారికే ఆ భాషలో ఉన్న జాతీయం అర్ధమవుతుంది. "నీళ్ళోసుకోవడం", "అరికాలి మంట నెత్తికెక్కడం", "డైలాగు పేలడం", "తు చ తప్పకుండా" - ఇవన్నీ జాతీయాలుగా చెప్పవచ్చును. జాతీయాలు [[సంస్కృతి]]కి అద్దం పట్టే భాషా రూపాలు అనవచ్చును.
 
 
 
===లంకంత ఇల్లు===
చాల పెద్ద ఇల్లని అర్థం: ఉదా : వారిది లంకంత ఇల్లు.
===లంక మేత గోదారి ఈత===
లంకల్లో పచ్చ గడ్డి బాగా వుంటుంది. ఆ గడ్డి మేయడానికి ఈదు కుంటూ గోదారి దాటాలి. అలా బాగా మేసి తిరిగి గోదారి ఈదు కుంటూ వచ్చేసరికి ఆ తిన్నదంతా ఈద డానికి సరిపోయింది. ఇక మిగిలింది ఏమి లేదు.
===లబలబా===
లబలబా నోరు కొట్టు కుంటున్నారు.
===లాభం లేదు===
ఇది వ్వాపారం లో వచ్చే లాభం కాదు. దీనికి ఉపయోగము లేదని అర్థం: ఉదా: లాభంలే వాడు దొరకడు గాని మనం తిరిగి ఇంటికెళ్లి పోదాము.
===లాలూచి పడ్డాడు===
కుమ్మక్కయ్యారు: ఉదా: ఆ దొంగలు పోలీసులతో లాలూచి పడ్డారు.
===లావొక్కింతయు లేదు===
భలము పూర్తిగా నశించిందని అర్థం.
 
===లింగపోటు===
మెడలో శివలింగాన్ని ధరించిన జంగందేవర ఓ దొంగ కంటపడ్డాడు. ఆ దొంగ నుంచి తప్పించుకోవడానికి పరుగు లంకించుకుని ఇల్లు చేరాడు కానీ పరుగెత్తేటప్పుడు అతడి మెడలో ఉన్న శివలింగం అటూ ఇటూ ఊగుతూ డొక్కల్లో పొడుచుకుని పోటు పెట్టిందట.[[దొంగపోటు కంటే లింగపోటు ఎక్కువ ]] య్యిందని ఆ [[జంగం]] పరుగెత్తుతూ అనుకుంటాడు.
 
===లెక్కతీరిపోవడం===
మరణించడం . మనిషిగా పుట్టిన తరువాత ఈ లోకంలో చేయాల్సినవన్నీ దేవుడి ఆజ్ఞ మేరకు చేసినట్లు, ఆయన లెక్కకట్టిన విధంగా జీవించాల్సిన రోజులు గడిచిపోయాక మరణం ప్రాప్తిస్తుందనే భావన
===లెక్క లేదు===
ఖాతరు చేయడము లేదు.... ఉదా: నేనంటే వానికి లెక్కేలేదు.
 
===లెక్క మీద సున్నా===
వాడికంటూ ఏమీ లేదు అంతా ఇతరులదే.ఇతరుల మీద ఆధారపడి పని చేసేవాడు, అస్వతంత్రుడు, నిష్ప్రయోజకుడు. అంకె మీద ఆధారపడి మాత్రమే సున్నా తన విలువను పెంచుకొంటుంది.
===లేచి పోయింది===
పారి పోయింది: ఉదా: ఆమే అతనితో లేచి పోయింది.
 
===లేమి లేవనివ్వదు===
అనవసర ఇబ్బందులు . తలనొప్పిని ఎవరూ కావాలని తెచ్చుకోరు. ఇబ్బందులను, అడ్డంకులను కోరి మరీ తెచ్చుకున్నట్టుగా ఎవరైనా ప్రవర్తించిన సందర్భం
===లైట్ తీస్కో===
పట్టించు కోకు. ఉదా: వాని మాట్లను లైట్ తీస్కో.
 
===లొట్టలేయడం===
బాగా ఆనందించడం .మనసుకు నచ్చిన, రుచికరమైన పదార్ధాలను, విషయాలను చూస్తున్నప్పుడు అసంకల్పితంగానే నోట్లో లాలాజలం ఊరడం, లొట్టలేసుకుంటూ తినటం .
===లొడలొడ===
పటుత్వం రహితం, వదులుగా ఉండటం, == ఎక్కువగా మాట్లాడె వాళ్లను గురించి ఈ మాటను వాడతారు. ఉదా: వాడు లొడ లొడ వాగు తున్నాడు.
 
===లోకం తెలియనివాడు===
 
===లోడు మీదుండటం===
లారీ మీద ఎక్కువ లోడు ఉండటం చేత భారంగా కదలాల్సివస్తోంది.మద్యపానం చేసిన వ్యక్తి కూడా బరువుగా కదులుతూ వస్తున్నట్టు కనిపిస్తాడు. వాడు లోడు మీదున్నాడు, వాడితో నీకెందుకు తప్పుకో' అంటారు
 
===లోతైన మనిషి===
అన్ని అంతరంగంలో దాచుకునే వాడు: ఉదా: వాడు లోతైన మనిషి. ఎవ్వరికి అర్థం కాడు.
[[వర్గం:జాతీయములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1182916" నుండి వెలికితీశారు