న్యూయార్క్: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: వర్గం చేర్చాను
చి Wikipedia python library
పంక్తి 113:

'''న్యూయార్క్ నగరం''' ([[ఆంగ్లం]] : '''New York City''') (అధికారికంగా '''న్యూయార్క్ యొక్క నగరము''') [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు]] లోని అత్యధిక జనాభా మరియు [[జనసాంద్రత]] కలిగిన నగరాలలో ఒకటి. దీని [[మెట్రోపాలిటన్]] ప్రాంతం, ప్రపంచంలోని అతిపెద్దనగరప్రాంతాలలో ఒకటిగా పరిగణింపబడుతుంది. [[1970]]వ సంవత్సరం వరకూ ప్రపంచంలోనే అతిపెద్ద నగరంగా పరిగణింపబడుతూ వచ్చింది. [[జార్జి వాషింగ్టన్]] కాలంలో అమెరికా ప్రధమ రాజధానిగా వర్థిల్లినది. ఓ శతాబ్దం వరకూ, ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య మరియు ఆర్థికకేంద్రంగా వెలుగొందింది. న్యూయార్క్ నగరం, భూగోళ నగరంగానూ, [[ఆల్ఫా వరల్డ్ సిటీ]] గానూ పరిగణింపబడుచున్నది. దీనికి కారణాలు, [[మీడియా]], రాజకీయాలూ, [[విద్య]], [[వినోద కార్యక్రమాలు]], [[కళలు]] మరియు [[ఫ్యాషన్]]. ఈ [[నగరం]] [[విదేశీ వ్యవహారాలు|విదేశీ వ్యవహారాలకూ]] కేంద్రంగానూ, [[ఐక్యరాజ్యసమితి]] ప్రధాన కేంద్రంగానూ యున్నది.
== చరిత్ర ==
[[దస్త్రం:Castelloplan.jpg|thumb|left|ఆమ్‌స్టర్డామ్]]
[[1524]]వ సంవత్సరంనకు ముందు యురోపియన్ల రాకకు పూర్వం ఇక్కడ 5,000 మంది ''లెనేప్ '' అనే అమెరికన్ పూర్వీకులు ఇక్కడ నివశిస్తుండేవారు.ఫ్రెంచ్ ప్రభుత్వం
తరఫున పనిచేసే ఇటాలియన్ పర్యాటకుడు ''డచ్ ఫర్ ట్రేడింగ్ ''పేరుతో వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ఇక్కడ యురోపియన్ ఒప్పందానికి నాంది అయింది. 1614 తరువాత మాన్‌హట్టన్ దక్షిణ ప్రాంతాన్ని ''న్యూఆమ్‌స్టర్‌డామ్ ''పిలుస్తూ వచ్చారు. 1626 లో '''లెనేపు'''లనుండి మాన్‌హట్టన్ ద్వీపాన్ని 60 డచ్ బంగారునాణాలకు డచ్ కాలనీ డైరక్టర్ జనరల్ ''పీటర్ మైన్యూట్ '' కొనుగోలు చేసాడు. కానీ ధర విషయం సరి అయిన నిర్ధారణ జరగలేదు. 24 అమెరిక డాలర్ల విలువ కలిగిన గాజు పూసలు చెల్లించినట్లు మరొక వాదన కూడా ఉంది. 1664 లో ఈ ప్రదేశం ఆంగ్లేయులచే ఆక్రమించబడి యార్క్ మరియు అల్బెనీల ఆంగ్లేయ రాజ ప్రతినిధి పేరుతో న్యూ యార్క్‌గా పిలువబడింది. ఆంగ్ల - డచ్ యుద్ధం చివర జరిగిన ఒప్పందంలో డచ్ ప్రభుత్వం ఆమ్‌స్టర్‌డామ్ ఆంగ్లేయులకు ఇచ్చి బదులుగా [[ఇండోనేషియా]] లో భాగమైన [[బాండా]] ద్వీపాలలో ఒకటైన ''రన్‌ '' ద్వీపాన్ని తీసుకున్నారు. [[1700]]వ సంవత్సరం నాటికి ఇక్కడ లెనేప్ అమెరికన్ పూర్వీకుల సంఖ్య 200కు క్షీణించింది.
ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో న్యూయార్క్ ప్రముఖ వ్యాపారకేంద్రంగా అభివృద్ధి సాధించింది. [[1754]]వ సంవత్సరంలో ''రెండవ కింగ్ జార్జ్ '' ధార్మిక సౌజన్యంతో ''కింగ్ కాలేజ్ '' పేరుతో స్థాపించ బడింది. అమెరికన్ తిరుగుబాటు యుద్ధ సమయంలో ''న్యూయార్క్ కంపాజిన్ ''పేరుతో (న్యూయార్క్ యుద్ధం) ఈ నగరం వరస యుద్ధాలకు రంగస్థలంగా మారింది. న్యూయార్క్ నగరంలో కాంటినెంటల్ కాంగ్రెస్ కూటమి జరిగింది. [[1789]]వ సంవత్సరంలో వాల్ స్ట్రీట్ లో అమెరికా సంయుక్త రాష్ట్రాల మొదటి ప్రెసిడెంట్ ''జార్జ్ వాషింగ్ టన్ ''చే ఫెడరల్ హాల్ ప్రారంభోత్సవం జరిగింది. [[1790]] వ సంవత్సరం నాటికి అభివృద్ధిలో [[ఫిలడెల్ఫియా]] ను అధిగమించి అమెరికాలో పెద్దనగరంగా మొదటి స్థానంలో నిలిచింది.

[[దస్త్రం:Mulberry Street NYC c1900 LOC 3g04637u edit.jpg|thumb|left|మాన్ హట్టన్ లోని ''ముల్ బెర్రీ ''వీధి ]]
19 శతాబ్ధంలో వలసప్రజల రాక నగర అభివృద్ధి చెట్టాపట్టాలేసుకుని నడవటం ప్రారంభం అయింది.మాన్‌హట్టన్ చుట్టూ ఆనుకుని నగరం విస్తరించింది. దీనికి ''కమీషర్స్ ప్లాన్ ఆఫ్ 1811'' పేరుతో చేపట్టిన నగరాభివృద్ధి ప్రణాళిక దోహదం చేసింది. [[1819]]వ సంవత్సరంలో తెరవబడిన ''ఎరిక్ కెనాల్ ''విస్తారమైన ఉత్తర అమెరికా లోతట్టు ప్రాంతనికి చెందిన అంట్లంటిక్ వ్యవసాయ సంభదిత వ్యాపారానికి ద్వారాలు తెరుచుకోవడానికి దోహదమైంది. ఐరిష్ వలస జాతీయుల రాజకీయపక్క బలంతో స్థాపించబడిన ''టమ్మీ హాల్ '' స్థానిక రాజకీయాలపై ఆధిక్యత సాధించింది. గుర్తించ తగినంత స్వతంత్ర్య నల్లజాతీయుల జనసంఖ్య మాన్‌హట్టన్ లోని బ్రూక్లిన్ ప్రాంతంలో స్థిరపడసాగారు. [[1827]] వ సంవత్సరం నుండి ఇక్కడ బానిసలు అధికసంఖ్యలో నివశించారు .

1861-1865 మధ్య కాలంలో ''అమెరికా సివిల్ వార్ ''సమయంలో బలవంతంగా రక్షణదళంలో చేర్చడానికి వ్యతిరేకంగా '' డ్రాఫ్ట్ రాయిట్స్ ఆఫ్ 1863 ''
చెలరేగిన తిరుగుబాటు [[అమెరికా]] చరిత్రలో గుర్తించదగిన అశాంతిని సృష్టించింది.అప్పటి వరకు ప్రత్యేక నగరంగా ఉన్న న్యూయార్క్ నగరం [[1898]] వ సంవత్సరం నుండి
ఇతర కౌంటీలను కలుపుతూ కొత్త న్యూయార్క్ మహానగరంగా అవతరించింది.ది కౌంటీ ఆఫ్ న్యూయార్క్,ది కౌంటీ ఆఫ్ రిచ్‌మండ్ మరియు ''దికౌంటీ ఆఫ్ క్వీన్స్'' పడమటి భాగంలో కొంత ఈ మహానగరంలో భాగాలైనాయి.[[1904]] వ సంవత్సరం లో ఆరంభించిన ''ది న్యూయార్క్ సిటీ సబ్‌వే '' కొత్త నగరాన్ని ఒకటిగా చేరడానికి మరింత దోహద పడింది.20 వశతాబ్ధం సగభాగంలోనే ఈ నగరం పారిశ్రామికంగా వ్యాపారికంగా మరియు సమాచార రంగం అభివృద్దిలో అంతర్జాతీయ కేంద్రంగా మారింది.
దక్షిణ అమెరికా నుండి పెద్ద మొత్తంలో వలసవచ్చిఉత్తర అమెరికాలో స్థిరపడే ఆఫ్రికన్ అమెరికన్లకు [[1920]] వ సంవత్సరం లో న్యూయార్క్ కేంద్రం అయింది.ఈ వలసలను గ్రేట్ మైగ్రేషన్‌గా వర్ణించబడింది.[[1916]] వ సంవత్సరంలో ఉత్తర అమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్లు ఎక్కువగా నివసించే నగరంగా న్యూయార్క్‌ను గుర్తించారు.ఆర్ధిక రంగంలో జరిగిన విప్లవాత్మక ఆభివృద్ధి కారణంగా ఆకాశహర్మ్యాల నిర్మాణాలు అభివృద్ధి ప్రారంభం అయింది.[[1948]] వ సంవత్సరం నాటికంతా పోటాపోటీగా నిర్మించబడిన ఈ నిర్మాణాల కారణంగా న్యూయార్క్ అంతర్జాతీయ ప్రాముఖ్యత సంతరించుకోవడంలో [[లండన్]] నగరాన్ని అధిగమించింది.ఈ ప్రాముఖ్యత ఒక శతాబ్ధ కాలం కొనసాగింది.''గ్రేట్ డిప్రెషన్ ''పేరుపొందిన ఆర్ధిక సంక్షోభం కాలంలో ఆర్ధిక సంస్కర్తగా గుర్తింపు పొందిన ''ఫియోరెల్లో లాగార్డియా '' రాకతో న్యూయార్క్ రాజకీయాలు కొత్త రూపు దిద్దుకున్నాయి.ఎనిమిది సంవత్సరాల కాలం న్యూయార్క్ రాజకీయాలు రిపబ్లికన్ల ఆధిక్యతలో కొనసాగాయి.డెమాక్రటిక్ ఓటమి ''ఫాల్ ఆఫ్ ది టామ్మనీ హాల్‌ ''గా అభివర్ణించబడింది.

[[దస్త్రం:New York City Midtown from Rockefeller Center NIH.jpg|thumb|left|న్యూయార్క్ లోని మిడ్ టౌన్ మాన్‌హట్టన్]]
రెండవ ప్రపంచ యుద్ధానంతరం తిరిగివచ్చిన వారు మరియు యురోపియన్ నుండి వలస వచ్చిన ప్రజల కారణంగా న్యూయార్క్‌లో యుద్ధానంతర ఆర్ధికపురోగతి ఆరంభం అయింది.తూర్పు క్వీన్స్‌లో పెద్ద సంఖ్యలో నివాసగృహ ఆభివృద్ధి కొనసాగింది.రెండవ ప్రపంచయుద్ధం నుండి న్యూయార్క్ సురక్షితంగా బయటబడింది.
పంక్తి 140:
== భౌగోళికం ==
[[దస్త్రం:Aster_newyorkcity_lrg.jpg|left|thumb|widthpx|కోటి మంది ప్రజలు నివసిస్తున్న న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతపు '''శాటిలైట్ చిత్రం''']]
న్యూయార్క్ నగరం అమెరికాకు ఈశాన్యంలోనూ న్యూయార్క్ రాష్ట్రానికి ఆగ్నేయంగానూ ఉంది.షుమారు [[వాషింగ్టన్]] మరియు [[బోస్టన్]] మధ్యభాగంలో ఉంది.ఇది [[హడ్సన్ నది]] ముఖద్వారంలో ఉండటం వలన ఏర్పడిన సహజ ఓడ రేవు అట్లాంటిక్ సముద్రంలో పెద్ద వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందటానికి సహకరించింది. న్యూయార్క్‌లో ఎక్కువ భాగం [[మాన్‌హట్టన్]]‌,[[స్టేటన్ ద్వీపం]] మరియు [[లాంగ్ ఐలాండ్]] అనే మూడు దీవులలో నిర్మించబడింది.పెరిగే జనాభాకు తగినంత భూభాగం తక్కువైన కారణంగా అధిక జనసాంద్రత కలిగిన నగరాలలో ఒకటైంది.

హడ్సన్ నది న్యూయార్క్ లోయల నుండి ప్రవహించి న్యూయార్క్ సముద్రంలో కలుస్తుంది.హడ్సన్ నది నగరాన్ని [[న్యూజెర్సీ]] నుండి వేరుచేస్తుంది.లాంగ్ ఐలాండ్ నుండి హడ్సన్ నది నేరుగా ప్రవహిస్తూ [[బ్రోంక్స్]] మరియు ''మాన్‌హట్టన్'' దీవులను ''లాంగ్ ఐలాండ్'' నుండి వేరుచేస్తూ ఉంటుంది.''హార్లెమ్ నది '' వేరొక వైపు నేరుగా ప్రవహిస్తూ తూర్పుప్రాంతం మరియు ''హడ్సన్ నదుల '' నదులమధ్య నేరుగా ప్రవహిస్తూ బ్రోంక్స్ మరియు మాన్‌హట్టన్ లను వేరుచేస్తూ ఉంటుంది.

నగర భూభాగం కృత్రిమంగా మానవప్రయత్నంతో కొంచం కొంచం విస్తరిస్తూ ఉంది.ఈ విస్తరణ కార్యక్రమం డచ్ కాలనీ కాలంలోనే ప్రారంభం అయింది.మాన్‌ హట్టన్ దిగువ ప్రాంతంలో ఈ విస్తరణ సుస్పష్టంగా చూడచ్చు.1970 మరియు 1980వ సంవత్సరంల మధ్య [[మాన్‌హట్టన్]] లోతట్టు ప్రాంతంలో అభివృద్ధి చేసిన ''బ్యాటరీ పార్క్ సిటీ ''ఈ విస్తరణను స్పష్టంగా గుర్తించవచ్చు.ప్రత్యేకంగా మాన్‌హట్టన్ ప్రాంతంలో ఈ విస్తరణ వలన సహజ సిద్ధత కనుమరుగైంది.

న్యూయార్క్ నగర విస్తీర్ణం 304.8 చదరపు మైళ్ళు.న్యూయార్క్ నగర మొత్తం ప్రదేశం 468.9 చదరపు మైళ్ళు.159.88 చదరపు మైళ్ళు జలభాగం మిగిలిన 321 మైళ్ళు భూభాగం.నగరంలో ఎత్తైన ప్రాంతం స్టేటన్ దీవిలోని ''టాట్ హిల్ ''(Todt Hill).ఇది సముద్ర మట్టానికి 409.8 అడుగులు ఎగువన వుంది.దీని దిగువభాగం దట్టమైన వనప్రదేశం.స్టేటన్ దీవి గ్రీన్‌బెల్ట్‌లో ఇది ఒక భాగం.

== వాతావరణం ==
పంక్తి 149:

== పరిసరాలు ==
న్యూయార్క్ నగర ప్రజలు అధికంగా ప్రభుత్వ ప్రయాణ సౌకర్యాలను వాడుకుంటారు.న్యూయార్క్ నగర ప్రభుత్వ వాహనాల ప్రయాణీకుల సంఖ్య అమెరికాలో ప్రధమ స్థానంలో ఉంది.ఈ కారణంగా శక్తి(ఎనర్జీ)ని సామర్ధ్యంగా వాడుకునే నగరాలలో న్యూయార్క్ అమెరికాలోనే ప్రధమ స్థానంలో ఉంది.ఈ కారణంగా [[2006]] వ సంవత్సరంలో 10.8 లక్షల గాలన్ల ఇంధనం (ఆయిల్) పొదుపు చేసినట్లు అంచనా.న్యూయార్క్ నగర సరాసరి గ్రీన్‌హౌస్ గ్యాస్ విడుదల 7.1.అమెరికా జాతీయ సరాసరి 24.5.దేశంలోని గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల లలో 1% న్యూయార్క్ నగరంనుండి విడుదల ఔతుంది.న్యూయార్క్ నగర ప్రజలు దేశంలోని ప్రజలలో 2.7%.న్యూయార్క్ నగరవాసి [[శాన్ ఫ్రాన్సిస్కో‎]] నగరవాసి ఉపయోగించే విద్యుత్ శక్తిలో సగం కంటే తక్కువ ఉపయోగిస్తాడు, అలాగే [[డల్లాస్]] నివాసి కంటే షుమారు నాల్గవ వంతు మాత్రమే ఉపయోగిస్తాడు.
న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్య నివారణపై దృష్టి కేంద్రీకరించింది.జసాంద్రత కారణంగా పెద్ద మొత్తంలో కేంద్రీకృతమైన కాలుష్యం న్యూయార్క్ నగర నివాసితులకు [[ఆస్త్మా]] లాంటి శ్వాస సంబంధిత వ్యాదులు రావడానికి కారణమైంది.పురపాలక వ్యవస్థ శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే సాధనాలను ప్రభుత్వకార్యాలయాలలో ఉపయోగించడానికి ప్రాముఖ్యత ఇస్తుంది.న్యూయార్క్ క్లీన్ ఎయిర్ డీసెల్-హైబ్రీడ్ మరియు కమ్‌ప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లను ఉపయోగించే బస్సులను అధికంగా ఉపయోగించడంలో దేశంలో ప్రధమస్థానంలో ఉంది.న్యూయార్క్ నగరం శక్తిని సామర్ధ్యంగా ఉపయోగించే ''గ్రీన్ ఆఫీస్ బిల్డింగ్స్ ''భవన నిర్మాణంలో మొదటి స్థానంలో ఉంది.

న్యూయార్క్ నగరం ప్రజలకు త్రాగునీటిని ''కేట్ స్కిల్ మౌంటెన్స్ వాటర్ షెడ్ '' రక్షిత నీటిసరఫరా పధకంద్వారా అందిస్తుంది.ఈ పధకంద్వారా అందించే నీరు ''వాటర్ ట్రీట్ మెంట్ ''ప్రక్రియ అవసరం లేకుండానే కలుషితంకాని స్వచ్చమైన త్రాగు నీటిని నగరవాసులకు అందిస్తుంది.అమెరికాలో ఇలాంటి నీటిని అందించే
పంక్తి 163:

న్యూయార్క్ నగరంలో అంతర్జాతీయ ఖ్యాతి చెందిన అనేక శైలిలో భవన సముదాయాలు ఉన్నాయి.వీటిలో ముఖ్యమైనవి ''వూల్ వర్త్ ''(1913),మొదటి దశలో నిర్మించిన ''గోతిక్ రివైవల్'',''జోనింగ్ రిసొల్యూషన్ ''(1926),''సెట్బాక్'',ఆర్ట్ డికో శైలిలో నిర్మించిన ''క్రిస్లర్ బిల్డింగ్''(1930) వీటి స్టీల్ ప్లేట్స్ అలంకరణ సూర్య కిరణాలకు ప్రతిఫలిస్తూ ఈ భవనాలకు ప్రత్యేక అందాలను సమకూరుస్తాయి.ఈ భవనం అనేక మంది ప్రముఖులు మరియు ఆర్కిటెక్కులచే
ప్రశంసలను అందుకుంది.అంతర్జాతీయంగా ప్రశంసలందుకున్న అంతర్జాతీయ శైలిలో నిర్మించిన '''సీగ్రామ్ భవనం '''(1957) ఈ భవనం ముఖద్వారంలో రేకుతో తాపడంచేసిన స్థంభాలు ఈ భవనం యొక్క ప్రత్యేకత.'''కోండ్ నేస్ట్ భవనం '''(2000)అమెరిక ఆకాశహర్మ్యాలలో ఊన్న '''గ్రీన్ డిజైన్ '''భవనాలలో ప్రత్యేకత కలిగిన భవనాలలో ఒకటి.

న్యూయార్క్ నగర నివాసగృహ నిర్మాణంలో '''బ్రౌన్ స్టోన్ రా హౌసెస్ ''','''టౌన్ హౌసెస్ ''' మరియు ప్రత్యేక ఆకారంలో నిర్మించిన 1870 నుండి 1930 వ సంవత్సరంల మధ్య కాలంలో నిర్మించిన'''టెనెమెన్ట్స్''' చెప్పుకోతగినవి.[[1835]] వ సంవత్సరంలో సంభవించిన అగ్ని ప్రమాదం తరువాత వచ్చిన మార్పు పలితంగా రాళ్ళు, ఇటుకలు నగర నిర్మాణాలలో ప్రముఖ పాత్ర వహించాయి.

== కళలు వినోదాలు ==
పంక్తి 172:
అమెరికా చిత్రసీమలో న్యూయార్క్ నగరానికి ప్రత్యేక స్థానం ఉంది.[[1920]] వ సంవత్సరంలో నిర్మించిన '''మాన్‌హట్టా '''చలనచిత్రం ఇక్కడ నిర్మించబడిన ''అవన్ట్ గ్రేడ్ ''ఆరంభ చిత్రాలలో ఒకటి.ప్రస్తుతం న్యూయార్క్ నగరం అమెరికా చలనచిత్ర పరిశ్రమలో రెండవ స్థానంలో ఉంది.నగరంలో ప్రస్థుతం 2,0000 పైగా కళా మరియు సాంస్కృతిక కేంద్రాలు,5,000 కళాప్రదర్శనశాలలు ఉన్నాయి.నగరపాలిత సంస్థ
''నేషనల్ ఎండోన్‌మెంట్ ఫర్ ఆర్ట్స్''కు అధికమొత్తంలో నిధులను సమకూరుస్తుంది.19వ శతాబ్ధంలో సంపన్నులచే ప్రముఖ సాంస్కృతిక సంస్థలు వరుసగా స్థాపించబడ్డాయి. ''కార్నెగీ హాల్'' మరియు ''మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్'' వాటిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి.18వ శతాబ్ధంలో
విద్యుత్తుని కనిపెట్టిన తరువాత దీపాల వినియోగం అధికం కావడంతో నగరంలోని [[బ్రాడ్‌వే]] మరియు [[42వ వీధి]] సంగీతకార్యక్రమాలకు ప్రముఖ ప్రదర్శనా కేంద్రమైయ్యాయి.ఈ కారణంగా అవి ''బ్రాడ్‌వే మ్యూజికల్‌గా'' గుర్తింపు పొందాయి.

''సెంట్రల్ పార్క్ సమ్మర్ స్టేజ్ '' వేసవిలో నాటకాలు మరియు ''కన్సర్ట్ '' అనబడే సంగీత కార్యక్రమాలనూ ఉచితంగా ప్రదర్శిస్తూ వేసవిలోసందర్శకులకు వినోదాన్ని అందిస్తున్నాయి.5 బారోస్‌లో ఇప్పటివరకు 1,200 కన్‌సర్ట్స్,డాన్స్ మరియు రంగస్థల ప్రదర్శనలను అందించాయి.''లిన్‌కన్ సెంటర్ ఫర్ ది పర్ఫార్మింగ్ ఆర్ట్స్''అమెరికాలోని కళా ప్రదర్శనశాలలలో అతి పెద్దది దీనిలో ''జాజ్ ఏట్ లింకన్ సెంటర్ '',''ది మెట్రో పాలిటన్ ఒపేరా'',''ది న్యూయార్క్ ఫిల్ హార్మోనిక్'',''ది న్యూయార్క్ సిటీ బ్యాలెట్'',''ది వివియన్ బ్యూమోంట్ దియేటర్'',''ది జూలియర్డ్ స్కూల్ ''అండ్ అలైస్ టల్లీ హాల్'' మొదలైన ప్రదర్శన శాలలు ఉన్నాయి.

== పర్యాటక రంగము ==
[[దస్త్రం:Central Park from Rock.jpg|thumb|left|225px|రాక్‌ఫెల్లర్ టవర్ పైభాగం నుండి సెంట్రల్ పార్క్ దృశ్యం]]

న్యూయార్క్ నగరం అమెరికాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటి.ఈ నగరాన్ని ప్రతి సంవత్సరం 4కోట్లమంది సందర్శిస్తుంటారు.న్యూయార్క్ [[సెంట్రల్ పార్క్]] అమెరికాలో అత్యధికులు సందర్శించే సెంట్రల్ పార్క్.[[పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే ప్రదేశాలలో ముఖ్యమైనవి ''ఎంపైర్ స్టేట్ బిల్డింగ్'',''ఎల్లిస్ ఐలాండ్'',బ్రాడ్‌వే దియేటర్ నిర్మాణాలు,''మెట్రో పాలిటన్ ఆఫ్ ఆర్ట్ ''లాంటి మ్యూజియమ్స్,సెంట్రల్ పార్క్,వాషింగ్టన్ స్క్వేర్ పార్క్,రాక్ ఫెల్లర్ సెంటర్,టైమ్స్ స్క్వేర్,ది బ్రోన్‌క్స్ జూ,''న్యూయార్క్ బొటానికల్ గార్డెన్'',ఫెయిత్ అండ్ మాడ్సన్ అవెన్యూలలో ఖరీదైన షాపింగ్.ఇవికాక నగరంలో జరిగే కొన్ని ప్రత్యేక సందర్భాలు వాటిలో గ్రీన్ విచ్ విలేజ్‌లో జరిగే ''హాలోవిన్ పేరేడ్''',''ది ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్'',సెంట్రల్ పార్క్‌లో జరిగే ప్రదర్శనలు ప్రధానమైనవి.అమెరికా యొక్క ప్రత్యేక గుర్తింపుగా మిగిలిన [[స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ]] సందర్శకులను అమితంగా ఆకర్షించే ప్రదేశాలలో ఒకటి.తూర్పుతీరాలలో నివశించే మొదటి మరియు రెండవతరాలప్రజల ప్రధాన షాపింగ్ కేంద్రాలైన జాక్సన్ హైట్స్,ఫ్లష్షింగ్ మరియు బ్రింగ్టన్ బీచ్ కూడా ప్రత్యేక ఆకర్షణలే.

న్యూయార్క్ ఆహారరంగం విభిన్నరుచుల సమాహారం.భిన్నరీతుల భోజనశాలలు ఇక్కడ ప్రసిద్ధం.అనేక దేశాలనుండి వచ్చి ఇందుకు ఇక్కడ స్థిరపడిన ప్రజలే కారణం.యూదు మరియు ఇటాలియన్ల కారణంగా నగరమంతా ప్రసిద్ధి చెందిన ''బాగిల్స్ '',''చీజ్‌కేక్'' మరియు ''న్యూయార్క్ టైప్-పీజా ''.4,000
న్యూయార్క్ నగర పాలక వ్యస్థ నుండి అనుమతి పొందిన మంది వ్యాపారులు ఆహారరంగంలో సేవలందిస్తున్నారు.వీటిలో చాలావరకు వలస ప్రజలే స్వంతదారులు.
మధ్యతూర్పు దేశాలకుచెందిన ప్రజల ''ఫాలాఫెల్స్ '',''కబాబ్స్ '' ఖండాంతర ఆహారాలు న్యూయార్క్ వీధిలో విక్రయించే ఆహారాలలో కొన్ని.''హాట్ డాగ్స్'' మరియు ''ప్రిట్జెల్స్ ''ఇప్పటికీ న్యూయార్క్ నగరవీధుల్లో లభ్యమౌతున్న ఆహారాలే.నగరం అనేక ప్రసిద్ధ హోటల్స్ నిలయమే.

న్యూయార్క్ నగరంలో ఉన్న ఉద్యానవనాల విస్తీర్ణం 28,000 చదరపు ఎకరాలు.నగర సముద్ర తీరం పొడవు 14 మైళ్ళు.
== ప్రసార రంగం ==
[[దస్త్రం:Rockefeller Center (2006).JPG|thumb|left|ఎన్.బి.సి స్టూడియోస్‌కు కేంద్రమైన రాఖ్ ఫెల్లర్ సెంటర్]]
న్యూయార్క్ నగరం ప్రకటనలకు,సంగీతానికి,దూరదర్శన్ కార్యక్రమాలకు,వార్తా పత్రికలకు మరియు పుస్తక ప్రచురణా రంగం అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగింది.
[[లాస్ ఏంజలెస్]],[[చికాగో]] మరియు [[టొరంటో]] ల తరువాత న్యూయార్కు ప్రసార రంగానికి దక్షిణ అమెరికాలో మంచి గిరాకీ ఉంది.అంతర్జాతీయంగా ప్రాముఖ్యమున్న 8 ప్రకటనా వ్యవస్థలలో 7 సంస్థలకు ప్రధాన కార్యాలయాలు న్యూయార్క్ నరంలో ఉన్నాయి.200 వార్తా పత్రికలకు మరియు 350 పత్రికలకు
నగరంలో కార్యాలయాలు ఉన్నాయి.పుస్తక ప్రచురణా సంస్థ ద్వారా 25,000 మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

అమెరికాలోని మూడు వార్తా పత్రికలలో రెండు వార్తా పత్రికలు న్యూయార్క్ నుండి వెలువడుతున్నాయి.అవి ''ది వాల్ స్ట్రీట్ జర్నల్ '' మరియు ''ది న్యూయార్క్ టైమ్స్''.ప్రజల ఆదరణను చూరగొన్న ''ది న్యూయార్క్ డైలీ న్యూస్'' మరియు ''ది న్యూయార్క్ పోస్ట్''1801 లో ''అలెక్జాండర్ హామిల్టన్ చే స్థాపించ బడ్డాయి.నగరంలో పురాతన సంప్రదాయ శైలిలో నడుస్తున్న ప్రచురణా సంస్థ 40 భాషలలలో 270 పత్రికలను ప్రచురిస్తుంది.స్పానిష్ భాషలో ప్రచురిస్తున్న పత్రిక ప్రచురణలో ఉన్న అతి పురాతన పత్రిక. హార్లెమ్‌‌లో ప్రచురితమౌతున్న ''ది న్యూయార్క్ ఆమ్‌స్టర్‌డామ్ న్యూస్ ''ఆఫ్రికన్ అమెరికన్ల కొరకు
ప్రచురితమైన పత్రికలలో ప్రధానమైంది.ఆల్టర్‌నేటివ్ న్యూస్ పేపర్లలో ది విలేజ్ వాయిస్ ముఖ్యమైంది.

న్యూయార్క్ నగరంలో దూరదర్శన్ అభివృద్ధి అత్యధికులకు ఉపాధి కల్పిస్తూ నగర ఆర్ధిక రంగానికి తోడ్పాతును అందిస్తూ ఉంది.నగరంలోని నాలుగు ప్రధాన ప్రసార సంస్థలు ఎ.బి.సి, సి.బి.ఎస్,మరియు ఎన్.బి.సిలు ప్రసార రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.అనేక కేబుల్ టి.వి ప్రసారాలు నగర ప్రజలకు వినోదాన్నందిస్తున్నాయి.వాటిలో ఎమ్.టివి.,ఫాక్స్ న్యూస్,హెచ్.బి.ఓ మరియు కామెడీ సెంట్రల్ ప్రధానమైనవి.100 కంటే అధికంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న కార్యక్రమాలు చానల్స్ ద్వారా నగరంలో ప్రసారమౌతున్నాయి.

== న్యూయార్క్ భాషా నుడికారం ==
న్యూయార్క్ నగరానికి ప్రత్యేకమైన ప్రాంతీయభాషను ఇక్కడి ప్రజలు '''న్యూయార్క్ డయాలెక్ట్ '''గా వ్యవహరిస్తుంటారు.దీనిని బ్రూక్‌లినీస్ మరియు న్యూయార్కీస్ గానూ గుర్తింపు పొందింది.ఇది తరచుగా అమెరికా ఆంగ్లభాషా సరళులలో ఒకటిగా వ్యవహరిస్తుంటారు.ఈ సంప్రదాయక భాష మధ్య అమెరికాకు చెందిన యురేపియన్ అమెరికన్లకు చెందిన శ్రామిక వర్గం నుండి ప్రాచుర్యం పొందింది.

== ప్రయాణ సౌకర్యాలు ==
న్యూయార్క్ ప్రజలు ప్రభుత్వ వాహనాలలో ప్రయాణించటానికి మొగ్గు చూపుతారు.దిగువ తరగతి న్యూయార్క్ ప్రయాణీకులు అమెరికా మొత్తం ప్రయాణీకులలో మూడవ స్థానంలో ఉన్నారని అంచనా.దేశంలోని మూడింట రెండు వంతులు రైలు ప్రయాణీకులు న్యూయార్క్లో నివసిస్తున్నట్లు అంచనా.ఇది దేశంలోని ఇతర ప్రదేశానికి పూర్తి విభిన్నం.మిగిలిన దేశంలోని అన్నిప్రాంతాలలో 90% ప్రజలు కార్లలో ప్రయాణించి తమ కృయాలయాలకు చేరుకుంటున్నట్లు అంచనా.అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మాత్రమే స్వంత కార్లు లేని వారు సగంకంటే ఎక్కువ మంది ఉన్నారు.మాన్‌హట్టన్‌లో స్వంత కార్లు లేని పౌరుల శాతం 75%.దేశీయ సరాసరి 8%.న్యూయార్క్ పౌరులు తాము పని చేసే ప్రదేశానికి చేరుకోవడానికి ఒకరోజుకు 38.4 నిమిషాల కాలం వెచ్చిస్తారని యు ఎస్ సెన్సస్ బ్యూరో అంచనా.ఇది దేశంలో అత్యధిక ఉద్యోగప్రయాణ సమయం.

న్యూయార్క్ నగరపౌరులకు అమ్‌టెక్ రైల్వే సస్థ రైల్వే సేవలు అందిస్తుంది.ఇది [[పెన్సిల్‌వేనియా]] స్టేషన్‌ను ఉపయోగించుకుంటూ [[బోస్టన్]],[[ఫిలడెల్ఫియా]] మరియు వాషింగ్టన్ డి సి నగరాలను కలుపుతూ సేవలు అందిస్తుంది .

ది న్యూయార్క్ సిటీ సబ్‌వే ప్రంచంలోనే పెద్ద భూగర్భ రైలు మార్గం.468 స్టేషన్‌లు ఉన్నా ఇంత పెద్ద రాపిడ్ ట్రాన్సిస్ట్ ప్రంపంచంలో ఇది ఒక్కటే.ఇది రోజులో 24 గంటలూ తెరిచే ఉండటంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.[[2006]]లో 1.5 బిలియన్ల పాసింజర్ ట్రిప్పులులు వేసినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.రాత్రి వేళలో మార్గాలలో కొన్ని మార్పులు ఉంటాయి.ఇతర నగరాలలో రాత్రి పూర్తిగా ప్రయాణాలు నిలిపివేస్తాయి.అలా నిలిపి వేసే వాటిలో లండన్,పారిస్,వాషింగ్టన్ డి సి,మాడ్రిడ్ మరియు టోకియో నగరాలు ఉన్నాయి.న్యూయార్క్ నగర ప్రయాణ సౌకర్యాలు విభిన్నంగా ఉంటాయి.అమెరికాలోని అతిపెద్ద వంతెన ''సస్పెన్షన్ బ్రిడ్జ్ '' ,యాంత్రికమైన వెంటిలేషన్ చేయబడిన సొరంగ వాహనమార్గం,12,000 కంటే ఎక్కువున్న పసుపు కార్లు(బాడుగ కార్లు),రూజ్‌వెల్ట్ ద్వీపం నుండి ఉద్యోగులను ''మాన్‌హట్టన్''కు చేరవేసే''ఏరియల్ ట్రామ్‌వే '' మారియు మాన్‌హట్టన్ నుండి నగరంలోపలి ప్రాంతాలకు వెలుపలి ప్రాంతాలకు చేరవేసే ఫెర్రీలు.అవిశ్రాంతంగా పనిచేయడంలో అమెరికాలోనే ప్రధమ స్థానంలో ఉన్న
''స్టేటెన్ ఐలాండ్ ఫెర్రీ'' సంవత్సరానికి 19 మిలియన్ల ప్రజలను 5.2 మళ్ళ మార్గంలో స్టేటెన్ ఐలండ్ మరియు మాన్‌హట్టన్ దిగువ ప్రాంతాలకు ఉద్యోగులను చేరవేస్తుంది.

పంక్తి 212:
== ప్రచురణలు ==
=== పుస్తకాలు ===
* ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రచురణ ఎడ్విన్ జి బర్రో మరియు మైక్‌వాలేస్(1998)రచన గోథమ్:ఎ హిస్ట్రీ ఆఫ్ న్యూయార్క్ సిటీ తొ 1898.
* లిట్టిల్,బ్రౌన్&కో ప్రచురణ ఆంటోనీ బర్గెస్(1976)రచన న్యూయార్క్.
* ది న్యూ ప్రెస్ ప్రచురణ (1995లో పున॰ ప్రచురణ)ఫెడరల్ రైటర్స్ ప్రాజెక్ట్ (1939)ది డబ్ల్యూ పి ఎ గైడ్ టొది న్యూయార్క్ సిటీ.
పంక్తి 224:
=== చిత్రమాలిక ===
<gallery>
Image:Statue_of_Liberty.jpg|అమెరికా ప్రతిబింభంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రఖ్యాత స్టాచ్యూ అఫ్ లిబర్టి
Image:Manhattan4_amk.jpg
Image:CentralParkFromAboveCropped.jpg
"https://te.wikipedia.org/wiki/న్యూయార్క్" నుండి వెలికితీశారు