పసుపులేటి కన్నాంబ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 38:
 
[[బొమ్మ:telugucinema_kannamba.JPG|lright|thumb|అలనాటి మేటి నటి - కన్నాంబ]]
'''కన్నాంబ''' ప్రసిద్ద రంగస్థల నటి, గాయని. చలనచిత్ర కళాకారిణిగా తెలుగునాట కీర్తి తెచ్చుకున్న '''కన్నాంబ''' పూర్తి పేరు '''పసుపులేటి కన్నాంబ'''.
 
==బాల్యం, నటనా ప్రవేశం==
పంక్తి 44:
 
==పేరు తెచ్చిన సినిమాలు, విశేషాలు==
[[ద్రౌపదీ వస్త్రాపహరణం]], [[హరిశ్చంద్ర]], [[పాదుక]], [[చంద్రిక]], [[కనకతార]], [[పల్నాటి యుద్ధం]], [[గృహలక్ష్మి]] , [[అనార్కలి]], [[దక్షయజ్ఞం (1962 సినిమా)|దక్షయజ్ఞం]] , [[తోడికోడళ్ళు (1957 సినిమా)|తోడికోడళ్ళు]], [[కృష్ణ కుచేల]], తదితర చిత్రాలు ఆమె నటించిన ముఖ్యమైనవి.
 
[[ఎం.జి.రామచంద్రన్]], [[ఎన్.ఎస్.రాజేంద్రన్]], [[శివాజీగణేశన్]], [[నాగయ్య]], పి.యు. చిన్నప్ప, [[నందమూరి తారక రామారావు]], తదితర అగ్రశ్రేణి నాయకుల సరసన ఎన్నో చిత్రల్లో ఆమె నటించింది.
 
సుమారు 150 పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో తనదైన శైలిలో అద్వితీయంగా నటించి గొప్ప నటీమణిగా కీర్తి గడించింది. నవరసాలను సమర్థవంతంగా అవలీలగా పోషించగల అద్భుత నటీమణి కన్నాంబ . కన్నాంబ భర్త [[కడారు నాగభూషణం]], ఇద్దరూ కలసి ' రాజరాజేశ్వరీ ' చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలు [[తెలుగు]]లోను , తమిళ, [[కన్నడ]] భాషలలోను నిర్మించారు.
 
కన్నాంబ పాడిన " కృష్ణం- భజరాధా' గ్రాంఫోన్ గీతాలు- ఆనాటి రోజుల్లో ప్రతియింటా మారుమ్రోగుతుండేవి. ఆమె గొప్ప నటిమణి మాత్రమే కాదు- చక్కని గాయని కూడా. సుమారు ఐదు దశాబ్దాలు తెలుగు చలన చిత్ర సీమలో తనదైన ప్రత్యేకత ప్రదర్శించిన శ్రీమతి కన్నాంబ [[1964]] లో [[మే 7]] వ తేదీన తుదిశ్వాస వదిలింది.
"https://te.wikipedia.org/wiki/పసుపులేటి_కన్నాంబ" నుండి వెలికితీశారు