భానుప్రియ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 5:
| imagesize =
| birthname = మంగ భామ
| birthdate = {{birth date and age|1967|01|15|df=y}}
| birthplace = రంగంపేట, [[రాజమండ్రి]] జిల్ల, [[ఆంధ్ర ప్రదేశ్]], [[భారత్]]
}}
 
పంక్తి 12:
 
== సినీ జీవితం ==
భానుప్రియ [[వంశీ]] దర్శకత్వంలో వచ్చిన [[సితార]] సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత [[కె.విశ్వనాథ్|విశ్వనాథ్]] దర్శకత్వంలో వచ్చిన [[స్వర్ణకమలం]]తో కళాకారిణిగా మంచి గుర్తింపు తెచ్చుకొంది. ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి. దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది. సన్ నెటవర్క్ ఛానల్స్లో ప్రసారమైన శక్తి అనే టెలీ ధారావాహికలో కూడా నటించింది.
 
1980-1993 మధ్య కాలంలో కథానాయికగా పలు చిత్రాలలో నటించి ఓ వెలుగువెలిగారు. ఏ పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యంలో ఆమెలో ఉంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో ఆమె నటించారు. 'సితార' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ, దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాలలో నటించారు. వంశీ, భానుప్రియ ల సినిమాలను అత్యధికమంది ఇష్టపడేవారు. వారి కాంబినేషన్ లో సంగీత, నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులకు నచ్చాయి.
 
నటిగా, నర్తకిగా తనదైన ప్రత్యేక బాణీ పలికించిన భానుప్రియ నాటి అగ్రహీరోలందరి సరసన నటించారు. తెలుగు ప్రేక్షకులు మరచిపోలేని తారగా నిలిచారు. చిరంజీవి అగ్ర నాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేట్రం చేశారు. చిరంజీవి అంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు. భానుప్రియ ఆయనతో సమవుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులను అలరించారు. వారిద్దకి జోడీ అత్యంత విజయవంతమైన జోడీ గా నిలిచింది. చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు.
 
[[నందమూరి బాలకృష్ణ]] విజయవిహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగు పెట్టారు. బాలకృష్ణ, భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది. బాలకృష్ణ సొంత చిత్రాల్లో భానుప్రియ నాయికగా జయకేతనం ఎగురవేయడం విశేషం. మరో కథానాయకుడు [[దగ్గుబాటి వెంకటేష్]] తోనూ భానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు విజయవంతమయ్యాయి. వారిద్దరూ జంటగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి. తెలుగు, తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన భానుప్రియ బాలీవుడ్‌పై కూడా కన్నేశారు. అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేక పోయారు. '''ఖుద్‌గర్జ్‌, ఇన్సాఫ్‌ కీ పుకార్‌, మార్‌ మిటేంగే ''' వంటి హిందీ చిత్రాల్లో భానుప్రియ నటించారు.
 
== వ్యక్తిగత జీవితం ==
భరత నాట్య కళాకారిణి సుమతీ కౌషల్ కుమారుడు, అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌషల్ ను ఆమె వివాహం చేసుకున్నారు. వారికి అభినయ అనే అమ్మాయి ఉంది. కారణాలు ఏవైనా భార్యాభర్తలు విడిపోయారు. ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యరీతులైన కూచిపూడి, భరతనాట్యం శిక్షణ, ప్రదర్శనలతో కాలక్షేపం చేస్తున్నారు. తగిన పాత్ర లభించినప్పుడు టివి సీరియల్స్, సినిమాలలో నటిస్తూనే ఉన్నారు
 
== భానుప్రియ నటించిన తెలుగు చిత్రాలు ==
"https://te.wikipedia.org/wiki/భానుప్రియ" నుండి వెలికితీశారు